రేవంత్ తిట్లు.. కేసీయార్ తిట్లు.! ఎవరు నెంబర్ వన్.!
KCR Revanth Dirty Talk.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఓ ‘తిట్టు’ని ప్రయోగించారు.. ఆ తిట్టు విషయమై పెద్ద రాజకీయ పంచాయితీ నడుస్తోంది సోషల్ మీడియాలో.!
ఆ పదాన్ని ఇక్కడ ప్రస్తావించడం సబబు కాదు. ముఖ్యమంత్రి పదవిలో వున్న వ్యక్తి, అలాంటి ‘పదాన్ని’ ఉపయోగించడం అత్యంత హేయం.
ఈ విషయంలో రేవంత్ రెడ్డిని (Revanth Reddy) తప్పు పట్టకుండా వుండలేం. ముఖ్యమంత్రి అనే కాదు, ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి ‘పదాల్ని’ ఉపయోగించకూడదు.
KCR Revanth Dirty Talk.. రాజకీయాలే అలా తగలడ్డాయ్..
‘రాజకీయ ప్రత్యర్థుల్ని బూతులు తిట్టలేకపోతే.. మీరు రాజకీయాలకు పనికిరారు. మీకెందుకు టిక్కెట్టు.?’ అంటూ పార్టీలు, టిక్కెట్లు నిరాకరిస్తున్న రోజులివి.
అందుకే, పదవుల కోసం బూతులు తిట్టాల్సి వస్తోంది రాజకీయ నాయకులు. అధికార ప్రతినిథుల దగ్గర్నుంచి, మంత్రుల వరకు.. ఆఖరికి ముఖ్యమంత్రి కూడా తన స్థాయిని దిగజార్చేసుకోవడానికి వెనుకాడ్డంలేదు.
ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana).. ఇలా అన్ని చోట్లా వుందీ బూతు రాజకీయం.!
కేసీయార్ తక్కువోడేం కాదు..
ఇక, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ (KCR) రావు కూడా, గతంలో నోరు పారేసుకున్నారు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే ‘పదాన్ని’ ఉపయోగించారో, అదే పదాన్ని అప్పట్లో కేసీయార్ కూడా ఉపయోగించారు. అదీ కేసీయార్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడే.!
రేవంత్ రెడ్డిని (Telangana CM Revanth Reddy) తప్పు పట్టి, కేసీయార్‌ని వెనకేసుకొద్దామా.? కేసీయార్‌ని వెనకేసుకొచ్చి రేవంత్ రెడ్డిని సమర్థిద్దామా.?
Also Read: పూనమ్ పాండే ఇక లేదట.! అంటే, అసలేమయ్యిందంటే.!
రాజకీయ నాయకుల్ని అనుసరించడం వేరు, అభిమానించడం వేరు. అదే సమయంలో, ఆ రాజకీయ నాయకులు తమ మాట మీద అదుపు కోల్పోయినప్పుడు, ‘తప్పుని తప్పుగా’ ఒప్పుకోగలగాలి.!
రాజకీయమంటే ప్రజా సేవ.! ఎవరెక్కువ ప్రజా సేవ చేస్తారన్నది కొలమానం కావాలి తప్ప, రాజకీయాల్లో బూతులు సమంజసం కాదు.!
ఈ బూతు రాజకీయానికి ముగింపు ఎప్పుడు.?