బేబమ్మ కృతి శెట్టి అందాల ‘యోగ’మ్..!

Krithi Shetty Yoga
Krithi Shetty Aerial Yoga.. తొలి సినిమా తెచ్చిపెట్టిన పేరు ప్రఖ్యాతల ముందు, ఆ తర్వాత సాధించే ఖ్యాతి బలాదూర్ అనొచ్చా.? అనొచ్చునేమో.!
కృతి శెట్టి.. పరిచయం అక్కర్లేని పేరిది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైందీ బ్యూటీ.
హీరో పంజా వైష్ణవ్ తేజ్, దర్శకుడు బుచ్చిబాబు సన, హీరోయిన్ కృతి శెట్టి.. అందరికీ ఇదే తొలి సినిమా. ‘ఉప్పెన’ తర్వాత కృతి శెట్టి పేరు తెలుగు సినీ పరిశ్రమలో మార్మోగిపోయింది.
స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతుందనుకుంటే.. ఫ్లాపులు ఆమెని వెంటాడాయ్. డిజాస్టర్లు వెక్కిరించాయ్. ఇంకా ప్రయత్నిస్తూనే వుందిలెండి.. ఒక్క హిట్టు.. ఒకే ఒక్క హిట్టుతో రేసులోకి దూసుకొస్తానంటోంది ఈ బ్యూటీ.
Krithi Shetty Aerial Yoga.. యోగా.. మంచిదేగా..
అసలు విషయానికొస్తే, చూస్తున్నారు కదా.. బేబమ్మ తల్లకిందులుగా వేలాడింది.! ఇంతకీ, ఏం చేస్తోందబ్బా.! ఇదో టైపు యోగా.!
ఔను, దీన్ని ఏరియల్ యోగా అని పిలుస్తున్నారు. యోగా అంటే, మంచిదేగా.! అందం ప్లస్ ఆరోగ్యం.. అద్గదీ అసలు సంగతి.

అప్పుడప్పుడూ కాస్త బొద్దుగానూ.. ఎక్కువగా నాజూగ్గానూ కనిపించే కృతి శెట్టి, మంచి డాన్సర్. తన ఫిట్నెస్ సీక్రెట్ కూడా డాన్సేనని చెబుతుంటుంది.
కాదు కాదు, ఇదిగో ఇలాంటి యోగాసనాలే కృతి శెట్టి (Krithi Shetty) ఫిట్నెస్ సీక్రెట్.. అని మనం అనుకోవాలేమో.!
ప్రపంచమంతా ‘అంతర్జాతీయ యోగా దినోత్సవ’ సంబరాల్లో మునిగిపోతున్న వేళ, కృతి శెట్టి సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ఏరియల్ యోగా ఫొటోలు వైరల్ అవుతున్నాయ్.
