Liquor Telecom Mafia India.. లిక్కర్ రేట్లు పెంచేస్తే, తాగడం మానేస్తారంటూ ఓ పనికిమాలిన సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చాడో రాజకీయ మూర్ఖుడు.!
మద్యపానం.. అనేది ప్రభుత్వ ఖజానాకి మాంఛి ‘కిక్’ ఇచ్చే వ్యవహారం. వందైనా, వెయ్యైనా.. తాగేటోడు, తాగుతూనే వుంటాడు.
మరి, మద్యాన్ని నిషేధించొచ్చు కదా.? అంటే, ప్చ్.. ఆ రిస్క్ ప్రభుత్వాలు అస్సలు తీసుకోవు. ఒకవేళ ఎక్కడైనా మద్య నిషేధాన్ని అమలు చేసినా, అక్కడ అక్రమ మద్యం అమ్మకాలు మామూలే.!
Liquor Telecom Mafia India.. మద్యపానం.. మొబైల్ ఫోన్ వినియోగం.!
మద్యం రేట్లు పెంచినంత మాత్రాన మద్యపానం తగ్గదు. అలాగే, మొబైల్ టారిఫ్‌లు పెరిగినంత మాత్రాన, మొబైల్ ఫోన్ల వినియోగమూ తగ్గదు.
లైంగిక దాడులకి మద్యం మత్తు కారణమవుతోంది.. అదే లైంగిక దాడులకి, ఇంటర్నెట్ పో..ర్న్ కూడా కారణమవుతోంది.
Mudra 369
నాన్సెన్స్.. మద్యపానానికీ, మొబైల్ వినియోగానికీ లింకేంటి.? మద్యం సేవించి వాహనం నడిపితే, ప్రమాదాలు జరుగుతాయ్. మొబైల్ వాడుతూ వాహనం నడిపినా ప్రమాదాలే జరుగుతాయ్. సో.. రెండింటికీ ఎక్కడో లింక్ అయితే వుంది.

మొబైల్ ఫోన్ రేడియేషన్ కారణంగా క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. మద్యం సేవిస్తే కలిగే అనారోగ్య సమస్యల సంగతి సరే సరి.
చాలా పోలికలు వున్నాయ్ కదా.! పద్ధతిగా వాడితే, మొబైల్ ఫోన్ వల్ల ఎన్నో లాభాలు. కానీ, ఎంత పద్ధతిగా మద్యం తాగినా, దాని వల్ల అనర్థమే తప్ప, లాభాలేమీ వుండవ్. ఇదీ అసలు తేడా.
అదీ వ్యసనమే.. ఇదీ వ్యసనమే..
మద్యపానం అనేది ఓ వ్యసనం.! మొబైల్ వినియోగం కూడా దాదాపు అలాంటిదే. అవసరానికి తగ్గట్టుగా మొబైల్ ఫోన్ వాడితే, నష్టమేం లేదు.
కానీ, మొబైల్ ఫోన్‌ని భారత దేశంలో అవసరానికి మించి వాడుతున్నారు. అదే అసలు సమస్య. విచ్చలవిడిగా పోర్న్ చూస్తున్నారు మొబైల్ ఫోన్లలో.! చిన్నా, పెద్దా.. అన్న తేడాల్లేవ్.
తప్ప తాగి డ్రైవింగ్ చేస్తే ప్రమాదాలు చోటు చేసుకుంటాయ్.. మొబైల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేసినా.. జరిగేది ప్రమాదాలే.!
Mudra 369
ఆడెవడో అన్నట్టు, మద్యం ధర పెంచితే మందుబాబులు, మద్యాన్ని సేవించడం తగ్గించడం అనేది జరగదు. మొబైల్ టారిఫ్‌ల విషయంలో కూడా అదే వర్తిస్తుంది.
Also Read: మేతావి ‘మేత’స్సు.. సమాజానికి అత్యంత హానికరం.!
పోలిక సబబు కాదుగానీ, పోలికలైతే వున్నాయ్.. మద్యానికీ, మొబైల్ ఫోన్‌కీ.! అదీ వ్యాపారమే.. ఇదీ వ్యాపారమే.! రెండూ లాభసాటి వ్యాపారాలే.!

లిక్కర్ మాఫియా, టెలికాం మాఫియా.. రెండిటిలోనూ రాజకీయ దోపిడీ బహిరంగ రహస్యం.