Maha Shivaratri.. శివరాత్రికి ‘జాగరణ’ ఎందుకు.. ఎలా చేయాలి.?
శివోహం.! ఓం నమః శివాహ. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. లయకారుడు శంకరుడు. ఆ శంకరుడు లింగ రూపంలో వుధ్భవించిన రోజునే మహా శివరాత్రి (Maha Shivaratri) గా పేర్కొంటారు పండితులు.
శివున్ని‘భోళా శంకరుడు’ అంటారు. చెంబుడు నీళ్లతో అభిషేకం చేస్తే చాలు పొంగిపోతాడు శివుడు. అందుకే పక్షానికీ, మాసానికీ అంటూ శివరాత్రులు జరుపుకుంటుంటారు భక్తులు.
ప్రతీ నెలా శివరాత్రి వస్తుంది దాన్ని ‘మాస శివరాత్రి’ అంటారు. ఏడాదికి ఒకసారి వచ్చే శివరాత్రిని ‘మహా శివరాత్రి’ అని పిలుస్తాం. దీన్నే జన్మకో శివరాత్రి అని ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు హిందువులు.
Maha Shivaratri.. అసలు శివరాత్రికి శివుడ్ని ఎందుకు పూజించాలి.?
హిందూ సనాతన ధర్మంలో మహా శివరాత్రికి ప్రత్యేక విశిష్టత వుంది. మాఘమాసంలో వచ్చే చతుర్ధశినే మహా శివరాత్రి పర్వదినంగా జరుపుకుంటుంటాం.
మహా శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ రోజు ఉపవాసం, శివార్చన, జాగరణ చేస్తే ఎంతో పుణ్యం దక్కుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు.
చతుర్దశి నాడు అంటే 14 వ రోజు చంద్రుడు బలహీనమవుతాడు. ఆ చంద్రవంకను తలపై ధరించినవాడు శివుడు. కనుక ఈ రోజు శివున్ని పూజిస్తే, చంద్రునికి అపారమైన శక్తి లభిస్తుందని పురాణాలు, జ్యోతిష్యాలు చెబుతున్నాయి.
శివరాత్రికి జాగరణ ఎందుకు చేయాలి.?
శివరాత్రి అటే ముందుగా గుర్తొచ్చేది ఉపవాసం, జాగారం. శివరాత్రి మహత్యం అంతా రాత్రి వేళలోనే వుందంటారు. అందుకే, రాత్రి సమయంలోనే మహా శివునికి అభిషేకాలు, అర్చనలు చేస్తుంటారు.
శివ పార్వతుల కళ్యాణం జరిగిన రోజు కూడా ఇదేనని నమ్ముతుంటారు. అందుకే రాత్రి వేళలోనే మహా శివరాత్రి నాడు శివ పార్వతులకు వైభవంగా కళ్యాణం జరిపిస్తుంటారు.
అందుకే శివరాత్రినాడు జాగారం చేయడం ఎంతో విశిష్టమైనదిగా చెబుతుంటారు. అలాగే ఉపవాసం కూడా. రోజంతా ఉపవాసం వుండి, రాత్రికి జాగారం చేయడం వల్ల ఆరోగ్య పరంగానూ ఎన్నో ప్రయోజనాలున్నట్లు చెబుతారు.
అదే అసలు సిసలు జాగరణ
అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఉపవాసం, జాగారం చేయడం ఆరోగ్య రీత్యా ఒకింత కష్ట సాధ్యమవుతున్న దర్మిలా.. సాత్విక ఆహారం తీసుకుని శివున్ని పూజించొచ్చని పండితులు చెబుతున్నారు.
అలాగే జాగరణ పేరు చెప్పి సినిమాలు చూడడం, మరో రకమైన పనులతో టైమ్ పాస్ చేయడం తగదని పండితులు చెబుతున్నారు.
Also Read: రాజధాని లేని రాష్ట్రంలో ఇంకెన్నాళ్ళీ మూడు ముక్కలాట.?
మహా శివునిపై మనసు లగ్నం చేసి, ఓం నమఃశివాయ మంత్రంతో పరమేశ్వరుడ్ని ధ్యానం చేయడమే.. అసలు సిసలు మహా శివరాత్రి జాగరణ ఉద్దేశ్యం.