ముఖ్యమంత్రి, మీమర్స్, పరదాలు ఓ దర్శకుడి యాతన!

 ముఖ్యమంత్రి, మీమర్స్, పరదాలు ఓ దర్శకుడి యాతన!

Mahi V Raghav

Mahi V Raghav Yatana.. ‘యాత్ర-2’ పేరుతో ఓ సినిమా రూపొందింది. 2024 ఎన్నికల ముందర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా లబ్ది చేకూర్చేందుకు దర్శకుడు మహి రాఘవ్ చేస్తున్న ప్రయత్నం ఇది.!

వైసీపీ కోసం వైసీపీ అభిమాని తీస్తున్న సినిమా గనుక, ‘యాత్ర-2’ ఎలా వుండబోతోంది.? అన్న చర్చ అనవసరం.!

సినిమా.. జస్ట్ సినిమా మాత్రమే కాదు.! ‘యాత్ర-2’ (Yatra 2) అనేది కేవలం సినిమా మాత్రమే అనుకుంటే పొరపాటు.! ఓటర్లను ప్రభావితం చేసేలా సినిమా వుంటుంది.!

ఓటర్లు ప్రభావితం అవుతారా.? లేదా.? అన్నది మళ్ళీ వేరే చర్చ. సమాజం పట్ల బాధ్యత వున్న ఏ క్రియేటివ్ పర్సన్ అయినా, రాజకీయ పార్టీలకు లబ్ది చేకూర్చే సినిమాలు తీయడు.

Mahi V Raghav Yatana.. అంతా కమర్షియల్.. లాభ నష్టాల పంచాయితీ..

అయితే, సినిమా అనేది కమర్షియల్ ప్రపంచం.! సో, ‘యాత్ర-2’ కూడా కమర్షియల్ కోణంలోనే తెరకెక్కి వుండొచ్చు. ఇదొక పొలిటికల్ ప్రచారం కోసం తీసిన సినిమా.

సినిమా ప్రచారం సందర్భంగా, మీడియా సంధించిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, ‘మీది పొలిటికల్ మీడియానా.? సినిమా మీడియానా.?’ అని అమాయకంగా ఎదురు ప్రశ్నించేశాడు దర్శకుడు.

‘పరదాల ముఖ్యమంత్రి’ అనే ప్రస్తావన మీడియా నుంచి వస్తే, ‘పొత్తులతో పని లేకుండా సింగిల్‌గా వచ్చే ధైర్యం అతనికి వుంది’ అంటూ అసంబద్ధమైన వ్యాఖ్యలు మహి వి రాఘవ్ ఎందుకు చేసినట్టు.?

అసలు పొత్తులకీ, పరదాలకీ సంబంధమేంటి.? పొత్తు అనేది రాజకీయం.. పరదాల మాటున.. అనేది ముఖ్యమంత్రి.. తన ప్రజల దగ్గరకు ధైర్యంగా, బాధ్యతగా వెళ్ళడం గురించి.! ఆ తేడా మహి వి రాఘవ లాంటి సెన్సిబుల్ దర్శకుడికి అర్థం కాకపోతే ఎలా.?

Mudra369

తీసింది పొలిటికల్ సినిమా అయినప్పుడు, పొలిటికల్ ప్రశ్నలు రాకుండా వుంటాయా.? ఆ సంగతి పక్కన పెడితే, మీమర్స్ మీద కూడా అసహనం వ్యక్తం చేశాడు మహి వి రాఘవ.

‘మీమర్స్ ఏవేవో అర్థం పర్థం లేని మీమ్స్ చేస్తుంటారు. కానీ, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పీఠమ్మీదెక్కారు..’ అంటూ ఒకింత వెటకారం చేశాడు మీమర్స్ మీద.

ఈ సినిమాకి టార్గెట్ ఆడియన్స్ ఎవరో మహి వి రాఘవకి బాగా తెలుసు.! వాళ్ళని సైతం, డబ్బులిచ్చి, సినిమాకి రప్పించాల్సిన పరిస్థితి.

ఎవరి కోసం సినిమా తీశాడో, వాళ్ళే ఆ బాధలు కూడా పడతారు. అలాంటప్పుడు, ఈ ప్రెస్ మీట్లు, ఈ పొలిటికల్ కవరింగులు.. దేనికి.?

Mudra369

ఆ మీమర్స్ మీద కూడా రాజకీయ పార్టీలు ఆధారపడుతున్న వైనం చూస్తున్నాం. ప్రజలకు మేలు చేయాల్సిన పార్టీలు, మీమర్స్‌కి డబ్బులిచ్చి తమ పార్టీల తరఫున ప్రచారం చేయించుకుంటున్నాయి.

గద్దెనెక్కినోడు గొప్పోడు కాదు.. మీమర్స్ అనండీ, సామాన్యులనండీ.. చేతకానోళ్ళూ కారు.! నిజానికి, మహి వి రాఘవ అంటే కాస్తంత బ్యాలెన్స్‌డ్‌గా వ్యవహరించే దర్శకుడు.

ఏమయ్యిందో, మీడియా సమావేశంలో దర్శకుడు మహి వి రాఘవ (Mahi V Raghav) బ్యాలెన్స్ కోల్పోయాడు.! బహుశా ‘యాత్ర-2’ సినిమా విషయంలో పడుతున్న యాతన వల్లే కావొచ్చు..!

Digiqole Ad

Related post