Home » లక్కీ బ్యూటీ మీనాక్షి చౌదరి ‘నెమలి సోయగం’.!

లక్కీ బ్యూటీ మీనాక్షి చౌదరి ‘నెమలి సోయగం’.!

by Mudra369 Editorial Desk
0 comments
Meenakshi Chaudhary

Meenakshi Chaudhary Nemali Glamour.. ‘‘పచ్చందనమే పచ్చందనమే..’ అంటూ పాటేసుకోవాలనిపిస్తుంది కదా.!

ఈ పిక్స్‌లో మీనాక్షి చౌదరిని చూస్తుంటే.! పసుపు పచ్చ రంగు లెహెంగాలో మీనాక్షి చౌదరి చేయించుకున్న ఈ స్పెషల్ ఫోటో షూట్ నెట్టింటిని షేక్ చేస్తోంది.

టాలీవుడ్‌లో మీనాక్షి చౌదరి ట్రెండింగ్ హీరోయిన్‌గా చెలామణీ అవుతోంది. ఆ మాటకొస్తే.. మీనాక్షి చౌదరి చేసిన తెలుగు సినిమాలన్నీ సూపర్ హిట్సే కావడం విశేషం.

అలాగని స్టార్ హీరోయిన్ హోదా అయితే మీనాక్షి చౌదరి దక్కించుకోలేకపోతోంది ఎందుకో తెలీదు.! తెలుగుతో పాటూ, ఇతర భాషల్లోనూ బిజీగా సినిమాలు చేస్తోంది మీనాక్షి చౌదరి.

సినిమాలతో బిజీగా వున్నా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా వుంటుంది. తాజా ఫోటో షూట్స్ ఆ కోవకు చెందినవే. ఫెస్టివల్ మూడ్ క్రియేట్ చేస్తున్నాయ్ మీనాక్షి చౌదరి ఈ ఫోటో పోజులు.

Meenakshi Chaudhary Nemali Glamour.. ఎల్లో వైబ్స్..

పసుపు పచ్చ రంగు లాంగ్ లెహెంగా.. దాని మీద నెమలి మోటివ్స్ అలాగే పూల డిజైన్లతో రూపొందించిన ఈ లెహెంగాలో మీనాక్షి చౌదరి అందం ఎన్నో రెట్టు పెరిగినట్లయ్యింది.

ఈ లెహెంగాకి స్లీవ్‌లెస్ బ్లౌజ్.. దానికి మ్యాచింగ్ డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్ అద్భుతంగా వుంది. ఈ కాంబినేషన్‌కి పింక్ కలర్ దుపట్టా ఇచ్చిన రాయల్ లుక్ నెక్స్‌ట్ లెవల్.

Meenakshi Chaudhary
Meenakshi Chaudhary

ఇంత హెవీ కాస్ట్యూమ్‌కి మీనాక్షి ఏమైనా జ్యుయలరీ ధరించిందా.? అంటే మెడలో భారీ నెక్లస్‌లూ, హరాలూ లాంటివేమీ ధరించలేదు.

కానీ, చెవులకి ధరించిన లాంగ్ లాంగ్ ఝుంకాలూ ఆమె ముఖానికి సకికొత్త అందాన్ని తెచ్చిపెట్టాయ్. మొత్తం జ్యుయలరీ స్పేస్ అంతా అవే కవర్ చేసేశాయా.! అన్నట్లుగా వున్నాయ్.

Meenakshi Chaudhary
Meenakshi Chaudhary

లూజ్ హెయిర్ స్టైల్‌తో పెదాలపై చిరునవ్వులు చిందిస్తున్న మీనాక్షి ఈ పోజులు సోషల్ మీడియాలో చాలా ప్రత్యేకంగా వైరల్ అవుతున్నాయ్.

కాగా, మీనాక్షి చౌదరి ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య సరసన ‘వృషకర్మ’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అలాగే, తమిళంలో కార్తి హీరోగా ఓ సినిమాలో నటిస్తోంది. మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు మీనాక్షి చౌదరి ఖాతాలో వున్నాయని తెలుస్తోంది.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Most viewed

trending

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group