కష్టపడమాకు.! ‘జైలర్’ని చూసి నేర్చుకో చిరంజీవీ.!
Mega Star Chiranjeevi Rajinikanth ఏదో ఆషామాషీగా రజనీకాంత్‌కి స్టార్‌డమ్ వచ్చేయలేదు.! ఆయనేమీ రాత్రికి రాత్రి సూపర్ స్టార్ అయిపోలేదు.!
ఎన్నో ఏళ్ళు కష్టపడ్డాడు.. చాలా రిస్కీ స్టంట్స్ చేశాడు. తనదైన స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు. అందుకే, అంతలా ఆయనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
ఔను, రజనీకాంత్ తిరుగులేని సూపర్ స్టార్.! కేవలం తమిళ సినిమాల్లోనే కాదు.. ఆయన ఇండియన్ సినిమాకి సూపర్ స్టార్.!
మెగాస్టార్ చిరంజీవి తక్కువా.?
రజనీకాంత్‌ని చూసి నేర్చుకో.! ఈ మాట ‘జైలర్’ (Jailer) సినిమా వచ్చాక చాలామంది నోట వినిపించింది.!
ఏం చూసి, కొత్తగా చిరంజీవి నేర్చుకోవాలి.? చిరంజీవి (Mega Star Chiranjeevi) కూడా రాత్రికి రాత్రి స్టార్ హీరో అయిపోలేదు.! ఎన్నో ఏళ్ళపాటు కష్టపడ్డారు చిరంజీవి.
కష్టమంటే మామూలు కష్టం కాదు.! రజనీకాంత్ డాన్సులు సరిగ్గా చేయలేరు. ‘జైలర్’ సినిమాని తీసుకుంటే, రజనీకాంత్‌ని దర్శకుడు ‘పువ్వులా’ చూసుకున్నాడు.
రజనీకాంత్ అస్సలు కష్టపడకుండానే, ఆయన పాత్రకి ఈ సినిమాలో విపరీతమైన ఎలివేషన్ ఇచ్చాడు. అది బాగా వర్కవుట్ అయ్యింది.
చిరంజీవి (Mega Star Chiranjeevi) అలా కాదు.! తన శరీరాన్ని మేగ్జిమమ్ కష్టపెట్టేసేవారు డాన్సుల కోసం కెరీర్ తొలినాళ్ళలో.
అప్పటికీ ఇప్పటికీ, చిరంజీవిలో అదే కష్టం కనిపిస్తుంటుంది. ఆరు పదుల వయసు దాటి, ఏడు పదుల వయసులోకి అడుగు పెడుతున్నా, డాన్సులైనా.. రిస్కీ స్టంట్స్ అయినా చిరంజీవి వెనుకాడరు.
Mega Star Chiranjeevi Rajinikanth.. అభిమాని.. దర్శకుడైతే.!
ఓ అభిమాని.. తన అభిమాన హీరో సినిమాకి దర్శకుడైతే.! అది ‘జైలర్’ సినిమాలా వుంటుంది.? మరి, ‘కాలా’ సినిమా తీసిందెవరు.? చెప్పుకుంటూ పోతే చాలానే వుంటాయ్.
చిరంజీవికి ‘భోళా శంకర్’ సినిమా వర్కవుట్ అవలేదంతే. సక్సెస్, ఫెయిల్యూర్ ఎవరికైనా సహజమే. రజనీకాంత్ సైతం, ఇందుకు అతీతుడేమీ కాదు.
కాకపోతే, తమిళనాట కులజాడ్యం లేదు. తెలుగునాట అది వుంది. అదే అసలు సమస్య.! చిరంజీవి మీద ట్రోలింగ్ అనేది అర్థం పర్థం లేకుండా జరుగుతుంది.
జాతి తక్కువ మీడియా పైత్యం..
‘జాతి తక్కువ మీడియా’ ఒకటి.. ఈ ఛండాలంలో తనవంతు కీలక పాత్ర పోషిస్తుంది. చిరంజీవి ‘జైలర్’ చూస్తారు.. అందులో వింతేముంది.?
అలా అనుకుంటే, ‘జైలర్’ కంటే ముందు బహుశా రజనీకాంత్ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చూసి వుంటారు.. చూస్తారు కూడా.!
‘జైలర్’ని చూస్తే, కష్టపడకుండా ఎలా హిట్టు కొట్టొచ్చో తెలుస్తుందంటూ కొందరు ఉచిత సలహాలు చిరంజీవికి ఇవ్వడంలో వింతేముంది.?
Also Read: కొత్త ఒక వింత.! ‘బ్రిక్ బిర్యానీ’ తెలుసా మీకు.?
కష్టం అంటే చిరంజీవికి ఇష్టం.! చిరంజీవి (Mega Star Chiranjeevi) కష్ట జీవి.! అందుకే, సినీ పరిశ్రమలో వందలాది మందికి.. వేలాది మందికి ఆయన ఓ ఇన్‌స్పిరేషన్.!
నో డౌట్.. చిరంజీవితో సినిమాలు చేసే దర్శకుల ఆలోచనల్లో మార్పు రావాలి.! చిరంజీవి ఏదైనా చేయడానికి వెనుకాడరు.! అలాంటి చిరంజీవితో ఆయన స్థాయికి తగని సినిమాలు చేస్తోన్న దర్శకుల మైండ్ సెట్ మారి తీరాల్సిందే.!