మెన్ ఇన్ బ్లూ.. ఈ దాహం తీరనిది.!

341 0

ఈసారి వరల్డ్‌ కప్‌ పోటీల్లో టీమిండియా (Team India World Cup 2019 Winner) బ్యాటింగ్‌ సెన్సేషన్‌ ఎవరంటే, తడుముకోకుండా వచ్చే సమాధానం రోహిత్‌ శర్మ అనే. హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ.. ఒకదాని తర్వాత ఇంకోటి.. ఇలా వరుస సెంచరీలు కొడుతోంటే, ప్రత్యర్థి బౌలర్లు చేతులెత్తేయక ఇంకేం చేయగలరు.?

టీమిండియా (Team India) ఈసారి వరల్డ్‌ కప్‌ పోటీల్లో ఈ స్థాయి దూకుడు ప్రదర్శించడానికి కారణం ముమ్మాటికి రోహిత్‌ శర్మనే. అవతలి ఎండ్‌లో బెస్ట్‌ పార్టనర్‌ శిఖర్‌ ధావన్‌ గాయం కారణంగా ఔట్‌ అవడంతో, అతని స్థానంలో వచ్చిన లోకేష్‌ రాహుల్‌ ఇచ్చిన సపోర్ట్‌తో రోహిత్‌ చెలరేగిపోతున్నాడు.

నిజానికి, ఎవరితో అయినా పెర్‌ఫెక్ట్‌ భాగస్వామ్యాల్ని నమోదు చేయడం రోహిత్‌ శర్మకి (Rohit Sharma) వెన్నతో పెట్టిన విద్య. మామూలుగా అయితే, రోహిత్‌ ఓ మ్యాచ్‌లో హిట్‌ అయితే, ఇంకో మ్యాచ్‌లో ఫట్‌.. అన్నట్లుంటాడు. కానీ, వరల్డ్‌ కప్‌ పోటీల్లో మాత్రం రోహిత్‌ అంచనాలకు మించి సత్తా చాటుతున్నాడు.

చాలా కన్సిస్టెంట్‌గా రోహిత్‌ ఒక్కో మ్యాచ్‌లోనూ పరుగులు సాధిస్తున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తీరు చూస్తుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ జోరు ఇంకో రెండు మ్యాచ్‌లకు గనుక రోహిత్‌ కొనసాగించగలిగితే, టీమిండియా తన ఖాతాలో మూడో వరల్డ్‌ కప్‌ టైటిల్‌ వేసుకోవడం ఖాయం.

లోకేష్‌.. కెవ్వు కేక.! (Team India World Cup 2019 Winner)

ఈ వరల్డ్‌ కప్‌లో రోహిత్‌ తర్వాత బ్యాటింగ్‌ పరంగా మరో స్టార్‌ ఎవరంటే ఖచ్చితంగా చెప్పే పేరు లోకేష్‌ రాహుల్‌దే (Lokesh Rahul). అయితే, రోహిత్‌ వరుస సెంచరీల నడుమ లోకేష్‌ రాహుల్‌ (KL Rahul) స్టయిలిష్‌ బ్యాటింగ్‌ అంతగా ప్రాచుర్యంలోకి రావడంలేదు.

శ్రీలంకతో (Sri Lanka) చివరి గ్రూప్‌ మ్యాచ్‌ని ముగించిన టీమిండియా, ఆ మ్యాచ్‌లో లోకేష్‌ రాహుల్‌ (Lokesh Rahul) ఆడిన తీరుకి మురిసిపోయిందనడం నిస్సందేహం. లోకేష్‌ రాహుల్‌ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్‌లు మరో రెండు కావాల్సి వుంది టీమిండియాకి.

రోహిత్‌కి సపోర్ట్‌ ఇస్తూనే, వీలు చిక్కినప్పుడల్లా తన సొగసైన బ్యాటింగ్‌తో అలరిస్తున్న లోకేష్‌ రాహుల్‌, ఈ వరల్డ్‌ కప్‌లో టీమిండియాకి (Team India World Cup 2019 Winner) మరో ట్రంప్‌ కార్డ్‌ అన్నది నిర్వివాదాంశం.

కెప్టెన్‌ కోహ్లీ.. అదుర్స్‌..  (Team India World Cup 2019 Winner)

ఈ వరల్డ్‌ కప్‌లో తన బ్యాటింగ్‌ గణాంకాల గురించి పెద్దగా కోహ్లీకి (Virat Kohli) టెన్షన్‌ లేదు. అవసరమైనప్పుడు పరుగులు చేస్తున్నాడు. ఒక్కోసారి ఫెయిల్‌ అయినా, మైదానంలో అప్పటికప్పుడు మంచి నిర్ణయాలు తీసుకుంటూ జట్టుని ముందుకి నడిపిస్తున్నాడు.

అయితే, కోహ్లీ (King Kohli) నుంచి ఓ భారీ సెంచరీని అతని అభిమానులు ఆశిస్తున్నారు. సెమీస్‌లోకి అడుగు పెట్టేసిన టీమిండియా.. బ్యాటింగ్‌ పరంగా కోహ్లీ మీద ఆధారపడాల్సిన అవసరం ఇప్పటిదాకా తెచ్చుకోలేదంటేనే, ఓపెనర్లు ఏ స్థాయిలో అదరగొడ్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఏమో, కివీస్‌తో మ్యాచ్‌లోనే కోహ్లీ సత్తా చాటుతాడేమో. అసలు ఆ అవకాశం కోహ్లీకి ఇవ్వకుండానే లోకేష్‌, రోహిత్‌ (Lokesh Rahul – Virat Kohli) పని పూర్తి చేసెయ్యాలనే ఆశిద్దాం.

ఎమ్మెస్‌ ధోనీ.. ది కింగ్‌.! (MS Dhoni)

నో డౌట్‌, మహేంద్ర సింగ్‌ ధోనీ (Mahendra Singh dhoni).. టీమిండియాకి మేజర్‌ ట్రంప్‌ కార్డ్‌. బ్యాటింగ్‌ పరంగా కొన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా, వికెట్ల వెనకాల కొన్ని వైఫల్యాల్ని అతని నుంచి చూస్తున్నా.. ఎందుకో, ఎమ్మెస్‌ ధోనీ మీద అభిమానులకు నమ్మకం అంతగా సడలిపోదు.

అవసరమైన సందర్భాల్లో బ్యాట్‌ ఎలా ఝుళిపించాలో ధోనీకి (Mahendra Singh Dhoni) తెలుసు. క్లిష్ట పరిస్థితుల్లో మ్యాచ్‌ని ఎలా వికెట్ల వెనుకాల వుండి తమవైపుకు తిప్పేసుకోవాలో ధోనీకి (Mister Cool Dhoni) తెలుసు. సో, ధోనీని అంత తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు.

జట్టుకి పెద్దన్న ఎవరన్నా వున్నారంటే అది ధోనీ (MS Dhoni – Mister Cool) మాత్రమే.

పేస్‌ అండ్‌ స్పిన్స్‌.. పెర్‌ఫెక్ట్‌ కాంబినేషన్‌

బంతిని వేగంగా విసిరి, ప్రత్యర్థుల్ని షాక్‌కి గురిచెయ్యాలంటే ఆ పని జస్‌ ప్రీత్‌ బుమ్రా (Jaspreet Bumrah), భువనేశ్వర్‌కుమార్‌ (Bhuvaneshwar Kumar) తోపాటు షమీ (Shami) కూడా వున్నాడు టీమిండియాకి. ఈ ముగ్గురూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కి చుక్కలు చూపించగలరు.

ఈ వరల్డ్‌ కప్‌లో ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అనడానికి వీల్లేదు.. అందరూ సమిష్టిగా రాణిస్తున్నారు. బుమ్రా (Bumrah) అయితే అందరిలోకీ వెరీ వెరీ స్పెషల్‌.

స్పిన్‌ బౌలింగ్‌ విషయానికొస్తే యజువేంద్ర చాహల్‌ (Yazuvendra Chahal), కుల్‌దీప్‌ యాదవ్‌ (Kuldeep Yadav) ఓ రేంజ్‌లో తిప్పేస్తున్నారు. ఇప్పటిదాకా ఓ ఎత్తు, ఇకపై ఓ ఎత్తు. నాకౌట్‌ మ్యాచ్‌లు కదా.. బౌలర్లపై బాధ్యత మరింత ఎక్కువగా వుంటుందిప్పుడు.

ముచ్చటగా మూడోస్సారి.. వస్తుందా.?

నో డౌట్‌, మూడోసారి టీమిండియా వరల్డ్‌ కప్‌ (Team India World Cup) సాధించి పెడుతుంది.. కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ అందుకోబోతోన్న తొలి వరల్డ్‌ కప్‌ ఇదేనంటూ అప్పుడే క్రికెట్‌ విశ్లేషకులు ఓ అంచనాకి వచ్చేశారు.

సెమీస్‌లో న్యూజిలాండ్‌ని (Newzeland) ఓడిస్తే.. ఆ తర్వాత చివరి మెట్టుపై నెగ్గడం టీమిండియాకి పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? అన్న కసితో టీమిండియా వుంది.. ఆ టీమిండియాని ఎంకరేజ్‌ చేయడానికి 130 కోట్ల మంది భారతీయులూ సిద్ధంగా వున్నారు.

ఆల్‌ ది బెస్ట్‌ టు టీమిండియా.

Related Post

King Kohli

కోహ్లీ ఊచకోత: 10,000 నాటౌట్‌

Posted by - October 24, 2018 0
ఇండియన్‌ క్రికెట్‌లో ‘విరాట’ పర్వం కొనసాగుతోంది. కాదు కాదు, అంతర్జాతీయ క్రికెట్‌లోనే విరాట్‌ కోహ్లీ తన ప్రస్థానాన్ని ఇంకెవరికీ సాధ్యం కాని రీతిలో కొనసాగిస్తున్నాడు. రికార్డులన్నీ విరాట్‌…

పసికూనపై మెన్ ఇన్ బ్లూ గెలుపు

Posted by - September 19, 2018 0
క్రికెట్‌లో అగ్ర జట్లలో ఒకటి టీమిండియా (Team India). పసికూన హాంగ్‌ కాంగ్‌ (Hong Kong). అయితే, మైదానంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. పిచ్‌ కండిషన్స్‌…
Vallabh Bhai Patel, Sardar, Iron Man Of India, Statue of Unity, Run for Unity

ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌

Posted by - October 31, 2018 0
బానిస సంకెళ్ళను తెంచుకుని, తెల్ల దొరల నుంచి భారతావని ‘స్వేచ్ఛా’ గీతిక పాడుకుంటోంది. కానీ, ఏం లాభం.? దేశంలో అనేక సంస్థానాలు.. ఆ సంస్థానాధీశులు ఎవరి దారి…

విరాట్‌.. రో’హిట్‌’.. విండీస్‌ ఫట్‌.!

Posted by - October 22, 2018 0
లక్ష్యం ఎంత పెద్దదైనా, విరాట్‌ కోహ్లీ క్రీజ్‌లో కుదురుకున్నాడంటే అంతే సంగతులు… ప్రత్యర్థికి చెమటలు పట్టాల్సిందే. ఆ విషయం ఇంకోసారి నిరూపితమయ్యింది. వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *