Migraine Headache: మైగ్రేన్ తలనొప్పి, తీస్కోవాల్సిన జాగ్రత్తలు
Migraine Headache..తనదాకా వస్తే కానీ, తలనొప్పి తెలీదు అంటారు. అవును నిజమే.. ఆఫ్ట్రాల్ తలనొప్పే కదా అనుకుంటాం. కానీ, తలనొప్పి భరించేవాళ్లకే తెలుస్తుంది దాని తీవ్రత ఎంతో.!
తలనొప్పి అనేక రకాలు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది మైగ్రేన్ తలనొప్పి. కొందరికి తలకు కుడి భాగంలో కానీ, లేదా ఎడమ భాగంలో కానీ వేధించే తలనొప్పినే మైగ్రేన్‌గా చెబుతుంటారు.
మిగతా సీజన్లతో పోల్చితే చలికాలంలో తీవ్రంగా వేధిస్తుంది మైగ్రేన్ తలనొప్పి. వాతావరణంలో బారో మెట్రిక్ ప్రెజర్‌లో వచ్చే మార్పుల కారణంగా మెదడు నాళాల్లో సంకోచం ఏర్పుడుతుంది.
Migraine Headache.. ఆల్కహాల్‌కి దూరంగా..
తద్వారా మైగ్రేన్ తలనొప్పి వస్తుంది. అందుకే మైగ్రేన్ వున్న వాళ్లు చలికాలంలో ఎక్కువగా చలిగాలులకు ఎక్స్‌పోజ్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
స్కార్ఫ్‌లు, మఫ్లర్లూ వాడడంతో పాటూ, శరీరాన్ని పూర్తిగా కప్పి వుంచే దుస్తులు ధరించాలి. చాక్లెట్లూ, కెఫిన్ ఎక్కువగా వుండే కాఫీ, టీలకు కాస్త దూరంగా వుండాలి.
అలాగే ఆల్కహాల్‌కీ ఈ సీజన్‌లో దూరంగా వుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రాసెస్ చేసిన ఆహార పదార్ధాల జోలికి పోకుండా వుంటే మంచిది.
తేమ వాతావరణం లేకుండా జాగ్రత్త పడాలి..
ఆర్టిఫిషియల్ స్వీట్‌నెర్స్ ఎక్కువగా వాడడం వల్ల కూడా ఈ సీజన్‌లో మైగ్రేన్ అధికమవుతుందని చెబుతున్నారు.
ఇల్లు, ఇంటి చుట్టూ పరిసరాలను శుభ్రంగా వుంచుకోవాలి. అలాగే, ఎప్పటికప్పుడు శరీరాన్ని కూడా హైడ్రేటెడ్‌గా వుంచుకోవాలి.
Also Read: సామి చెప్పిండు.! ఓ పదిహేనేళ్ళు ఎన్నికలు మానేయిండ్రి.!
ఇంట్లో తేమ వాతావరణం లేకుండా చూసుకోవాలి. ఆహారంలో చేపలు, గుడ్లు వంటి మాంసాహారంతో పాటూ, ఆకుకూరలు కూడా క్రమం తప్పకుండా వుండేలా చూసుకోవాలి.
తగినంత విటమిన్ ‘డి’ అందేలా చూసుకోవాలి. అలాగే, చిన్నపాటి వ్యాయామాలు.. వాకింగ్, జాగింగ్ వంటివి చేస్తే రక్త ప్రసరణ మెరుగై తలనొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.
గమనిక:
ఇది కేవలం ఇంటర్నెట్‌లో అందుబాటులో వున్న సమాచారం.. అలాగే, కొందరు వైద్య నిపుణులు అందించిన సమాచారం ప్రకారం సేకరించబడింది. సొంత వైద్యం కొంత వరకూ మాత్రమే. నొప్పి తీవ్రతరమైతే వైద్యుని సలహా తప్పని సరి.