Sye Raa Narasimha Reddy

ఓ సైరా.. ‘మెగాస్టార్‌’ పవర్‌ చూడరా.!

229 0

‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Review) సినిమా నుంచి ‘ఓ సైరా’ సాంగ్‌ వీడియో బయటకు వచ్చింది. సాంగ్‌ ఎలా వుంది.? అన్న సంగతి తర్వాత, సాంగ్‌లో మెగాస్టార్‌ చిరంజీవి (Mega Star Chiranjeevi) చూపించిన పవర్‌ ఏంటన్నదే అందరికీ కావాలి.

ఎందుకంటే, చిరంజీవి (Mega Star Chiranjeevi) ముందు ఏ హంగూ ఆర్భాటాలైనా ఆ తర్వాతే. అదే చిరంజీవి గొప్పతనం.

తమన్నా (Tamannah Bhatia) ఈ పాటలో చాలా అందంగా కన్పించింది.. అంతకు మించిన పవర్‌తో ఆమె కన్పించింది. నయనతార (Nayanthara) కూడా పాటలో దర్శనమిచ్చింది.. ఆమె కూడా చాలా చాలా బావుంది.

దేశభక్తి ఉప్పొంగేలా ఈ పాటని తీర్చిదిద్దారు. బోల్డంతమంది జూనియర్‌ ఆర్టిస్టులతో సాంగ్‌ని చాలా గ్రాండ్‌గా రూపొందించారు.

అవన్నీ ఓ ఎత్తు.. చిరంజీవి అప్పీయరెన్స్‌ ఒక్కటీ ఓ ఎత్తు. గుర్రపు స్వారీ విషయంలో చిరంజీవికి తిరుగు లేదు. అలా గుర్రమ్మీద చిరంజీవి దూసుకొస్తోంటే, చూసేందుకు రెండు కళ్ళూ సరిపోవడంలేదనడం అతిశయోక్తి కాదేమో.

చిరంజీవి కళ్ళలో ఏదో మ్యాజిక్‌ వుంటుంది. ఆ మ్యాజిక్‌ని దర్శకుడు పెర్‌ఫెక్ట్‌గా ప్రొజెక్ట్‌ చేసినట్లే కన్పిస్తోంది. ఒక్కో ప్రోమో ఒక్కో రేంజ్‌లో సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి.

టీజర్‌ చూశాక, ఇంతకన్నా అద్భుతం ఇంకేముంటుందని అంతా అనుకున్నారు. ట్రైలర్‌ వచ్చాక, దాన్ని మరో అద్భుతంగా భావిస్తూనే.. ఇంతకు మించి ఇంకేం ఆశించగలమని భావించారు. ఇప్పుడు ఈ ప్రోమో సాంగ్‌తో.. ఇదే పీక్స్‌.. అనే భావన కలగడం సహజం.

అప్పుడే ఏముంది.? అసలు కథ అక్టోబర్‌ 2న చూడబోతున్నాం.. అంటోంది ‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Review) టీమ్‌. యూఏఈ నుంచి జర్నలిస్ట్‌, సెన్సార్‌ బోర్డ్‌ మెంబర్‌ ఉమైర్‌ సంధు, ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకి రేటింగ్‌ వేస్తూ నాలుగు స్టార్స్‌ ఇచ్చాడు.

స్టార్టింగ్‌ టు ఎండింగ్‌.. చిరంజీవి దుమ్మురేపేశాడట. ఆ ఎనర్జీ లెవల్స్‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందేనట. సుదీప్‌ పాత్ర గురించీ, అమితాబ్‌ బచ్చన్‌ పాత్ర గురించీ ఉమైర్‌ సంధు ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం.

రామ్ చరణ్.. (Ram Charan) నిర్మాతగా ఎక్కడా రాజీ పడకుండా సినిమాని తెరకెక్కిస్తే, దర్శకుడు సురేందర్ రెడ్డి.. (Surender Reddy) ఈ చిత్రాన్ని లైఫ్ టైమ్ డీమ్ ప్రాజెక్ట్ అనుకుని రూపొందించడం.. స్పష్టంగా కనిపిస్తోంది ప్రోమోస్ లో.

Related Post

Saaho Review Mudra

‘సాహో’: ప్రభాస్‌ సెన్సేషన్‌.. రికార్డులన్నీ గల్లంతే.!

Posted by - August 29, 2019 0
సక్సెస్‌ లెక్కలేసుకుని సినిమా చేయాలన్న ఆలోచన ప్రభాస్‌ ఎందుకు చేయడు.? ఇచ్చిన మాటకు కట్టుబడి ఎందాకైనా వెళ్ళాలనుకోవడం ఈ రోజుల్లో సబబేనా.? రాజమౌళి చేసిన మ్యాజిక్‌, సుజీత్‌…

విజయ్‌ దేవరకొండ ‘రౌడీయిజం’ తగ్గలేదంతే

Posted by - October 9, 2018 0
ఫ్లాపొచ్చినా, ధైర్యంగా ఒప్పుకునే సత్తా ఎంతమందికి వుంటుంది.? అందుకే, ఆయన ‘రౌడీ’ అయ్యాడు. ‘రౌడీ’ అన్పించుకోవడానికి ఇష్టపడే విలక్షణ హీరో విజయ్‌ దేవరకొండ, తన తాజా చిత్రం…

‘మహర్షి’ ప్రివ్యూ: ‘సూపర్‌’ స్టామినా ఇదీ.!

Posted by - May 1, 2019 0
గత సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా కొత్త సినిమాపై ఆకాశాన్నంటే అంచనాల్ని పొందడమే ‘సూపర్‌’ స్టార్‌డమ్‌. ఆ స్టార్‌డమ్‌ సూపర్‌స్టార్‌ సొంతం. పరిచయం అక్కర్లేని ఆ సూపర్‌స్టార్‌…

స్వీట్ అండ్ స్పెషల్ సమంత.!

Posted by - September 3, 2018 0
ఎక్కడో కేరళలో (Samantha Akkineni) పుట్టింది. తమిళ, తెలుగు సినిమాల్లో నటించింది. హీరోయిన్‌గా సక్సెస్‌ల మీద సక్సెస్‌లు అందుకుంటూ స్టార్‌డమ్‌ సంపాదించుకుంది. కెరీర్‌లోనూ, లైఫ్‌లోనూ ఎన్నో ఎత్తు…

‘సైరా’ మేకింగ్‌.. ది మెగా హై ఓల్టేజ్ యాక్షన్.!

Posted by - August 14, 2019 0
మెగా ఇంపాక్ట్‌ (Sye Raa Making) అంటే ఏంటో ఇంకోసారి ప్రూవ్‌ అయ్యింది. సోషల్ మీడియా పోటెత్తుతోంది.. ‘మెగా మేకింగ్..’ అంటూ. కొంచెం లేట్‌గా వచ్చినా, మెగాస్టార్‌…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *