Table of Contents
Outside Food Health Problems.. ఎలక్ట్రిక్ కుక్కర్‌లో రైస్ పెట్టేసుకుంటే, కర్రీస్ అలాగే సాంబార్.. బయట నుంచి తెచ్చేసుకోవచ్చు.!
రోజూ ఇంట్లో ఏం తింటాం.? సరదాగా బయటకెళ్ళి బిర్యానీ తినొద్దాం.! వీకెండ్ కదా, ఇక ఈ రోజంతా బయటే తిరుగుడు.. ఉదయం టిఫిన్ దగ్గర్నుంచి మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్ కూడా బయటే చేసేద్దాం.!
బయట తినే తిండి.. చూడ్డానికి బావుంటే సరిపోతుందా.? కడుపులోకి వెళ్ళాక.. మన ఆరోగ్యాన్ని చిదేమేస్తుందన్న సంగతి ఎంతమందికి తెలుసు.?
Mudra369
బ్యాచిలర్స్ మాత్రమే మాట్లాడుకునే మాటలు కావు. సాధారణ కుటుంబాలు కూడా ఇలాగే మాట్లాడుకుంటున్న సందర్భాల్ని చూస్తున్నాం. అందులో మనం కూడా వున్నాం.!
Outside Food Health Problems.. రుచీ.. శుచీ.. లేకున్నా తప్పదంతే..
బయట ఏమన్నా తక్కువ రేట్లకి ఫుడ్ దొరుకుతుందా.? లేదే.! మరెందుకు బయటి తిండి మీద మోజు.? అంటే, ఇంట్లో చేసుకునే ఓపిక లేక.!

మరి, అంత ఖర్చు చేసి బయట తిండి తింటున్నాం కదా.. అది సరిగ్గానే వుంటోందా.? ‘ఛీ, ఛండాలం.. ఖర్చు దండగ..’ అని తిట్టుకుంటూ ఇంటికొస్తున్నారు చాలామంది.
అన్ని చోట్లా ఛండాలంగా వుంటుందని అనలేం. కొన్ని చోట్ల బావుంటుంది.! నోటికి రుచి బావుంటే సరిపోతుందా.? పరిశుభ్రత మాటేమిటి.?
తినేసి వచ్చేయడమేనా.?
తినడానికి వెళ్ళినప్పుడు, తినేసి వచ్చేయాలిగానీ.. అక్కడి కిచెన్‌లో పరిశుభ్రత గురించి వాకబు చేస్తామా ఏంటి.? అదీ నిజమే మరి.!
కాదేదీ అనారోగ్యానికనర్హం.. అది ఖరీదైన రెస్టారెంట్లలో ఫుడ్ అయినా.. కాస్త తక్కువ ధరలో రోడ్ల మీద దొరికే ఫుడ్ అయినా.. మన ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసేస్తోంది..
Mudra369
గత కొన్ని రోజులుగా తెలంగాణలో హోటళ్ళు, రెస్టారెంట్లలో తనిఖీలు జరుగుతున్నాయి. బేకరీలు, ఐస్ క్రీమ్ పార్లర్లని కూడా వదలడంలేదు అధికారులు.
ఈ తనిఖీల్లో బయటపడుతున్న విషయాల్ని చూస్తే, కళ్ళు బయర్లు కమ్మడం కాదు, కడుపులో ఆర్నెళ్ళ క్రితం తిన్నది కూడా దేవేసి, వాంతులొచ్చేస్తున్నాయ్.

ఔను, అంత దారుణమైన పరిస్థితులున్నాయ్ చాలా హోటళ్ళలో.. రెస్టారెంట్లలో. ఎందుకీ దుస్థితి.? ఎవరిది బాధ్యత.? డబ్బులు ఖర్చు చేస్తున్న మనం, అనారోగ్యాన్ని ఎందుకు కొనితెచ్చుకుంటున్నాం.?
ఏం తింటున్నాం మనం.?
అసలేం తింటున్నాం మనం.? అన్న అనుమానం కలుగుతోంది చాలామందికి. అలాగని బయట తిండి మానేస్తున్నారా.? అంటే, దేని దారి దానిదే.!
కొందరైతే ఆలోచిస్తున్నారు.. చాలామంది పట్టించుకోవడంలేదు. ఆ ఒక్క రోజు బయట తింటే ఏమయిపోతుంది.? అనే భావన చాలామందిలో వుంటోంది.
అన్ని చోట్లా అనారోగ్యకరమైన పరిస్థితుల్లోనే ఆహార పదార్థాల్ని తయారు చేస్తారనుకోవడం పొరపాటు కావొచ్చు. కానీ, చాలా చోట్ల ఇదే పరిస్థితి.. ఆహారాన్ని అమ్ముకుంటున్నారుగానీ.. మంచి ఆహారాన్ని సాటి మనుషులకు అందించాలన్న సోయ వుండటంలేదు..!
Mudra369
రోగమొచ్చి ఆసుపత్రికి వెళితే, వైద్యులు నానా రకాల పరీక్షలూ చేసేసి, ప్రమాదకర రోగాల గురించి చెబుతూ, కలుషిత ఆహారం తినడం వల్లే.. అని కూడా వాయించి పారేస్తున్నారు.
ఇదేదో తెలంగాణకి (Telangana State) సంబంధించిన విషయమేనని అనుకునేరు.! ఎక్కడైనా ఇదే తంతు. ఏ రాష్ట్రంలో అయినా ఇదే పరిస్థితి.
Also Read: బిగ్ క్వశ్చన్: ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలి.?
బయట తిండి.. అంటే, బతుకు మీద ఆశలు నిజంగానే వదిలేసుకోవాల్సిందే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, తప్పదు.!