‘చిరంజీవి’ కంటే పెద్ద పురస్కారం ఏముంటుంది.?
Padmavibhushan Chranjeevi.. సచిన్ టెండూల్కర్.. ఆ పేరు కంటే పెద్ద పురస్కారం ఏముంటుంది.? క్రికెట్ అభిమానులెవరైనా ముక్త కంఠంతో ఇదే మాట చెబుతారు.!
క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) సాధించిన విజయాలు అలాంటివి.
ఇక, సినీ రంగంలో అయినా సేవా రంగంలో అయినా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు కదా.!
సాయమంటే చిరంజీవి.! చెప్పి చేసే సాయాలు గోరంత.. చెప్పకుండా చేసే సాయాలు కొండంత.!
Mudra369
ఆయన పేరు ముందర ఇప్పటికే ‘పద్మభూషణ్’ అనే గౌరవం చేరింది. దానికి అదనంగా ఇప్పుడు పద్మ విభూషణ్ అనే గౌరవం వచ్చి చేరింది.!
Padmavibhushan Chranjeevi.. సరైన వ్యక్తికి సరైన పురస్కారం గౌరవం..
వ్యక్తులకు పురస్కారాలు అదనపు గౌరవాన్నిస్తాయా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. సమర్థులైన వ్యక్తులకు ఆయా పురస్కారాలు అందితే, ఆయా పురస్కారాల గౌరవం పెరుగుతుందన్నది ప్రముఖంగా వినిపించే వాదన.
అప్పుడు సచిన్ టెండూల్కర్ సరసన ‘భారతరత్న’ చేరినా, ఇప్పుడు చిరంజీవి పేరు ముందర ‘పద్మ విభూషణ్’ చేరుతున్నా.. ఆయా పురస్కారాలకు దక్కిన అరుదైన గౌరవం అది.. అన్నదాంట్లో అతిశయోక్తి ఏమీ లేదు.
అప్పట్లో, రాజకీయ కోణంలో సచిన్ టెండూల్కర్‌కి భారతరత్న పురస్కారం ఇచ్చారన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం విషయంలోనూ అదే గోల.! గొప్ప గొప్ప వ్యక్తుల స్థాయిని తగ్గించే ప్రయత్నమే ఇది.!
లాబీయింగ్.. ఇదో పైత్యం..
పనీ పాటా లేని లోఫర్ మీడియా వల్లనే పురస్కారాలకు సంబంధించి లాబీయింగ్ అన్న ప్రస్తావన వస్తుంటుంది.
నిజమే, కొన్ని పురస్కారాలు మార్కెట్లో దొరుకుతాయ్. డాక్టరేట్లు సైతం అంగట్లో అమ్ముడుపోయే చెత్త సరుకులా తయారయ్యాయ్.
సినిమాలు, సేవా కార్యక్రమాలే కాదు.. కేంద్ర మంత్రిగా చిరంజీవి సేవలు.. ఆయన్ని మిగతావారి కంటే చాలా చాలా భిన్నమైన వ్యక్తిగా.. గొప్ప శక్తిగా చూపిస్తాయ్.!
Mudra369
కానీ, అన్నిటినీ అలాగే చూడలేం కదా.! అందుకే అనేది.. గొప్ప గొప్ప వ్యక్తుల పేర్ల ముందర ఆయా పురస్కారాల పేర్లు చేరితే, ఆ పురస్కారాల గౌరవం మరింత పెరుగుతుందని చెప్పేది.!
Also Read: అయోద్య రాములోరి దర్శనం ఉచితమే! దేవాలయాలన్నిటిలో?
ఓ మద్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన కొణిదెల శివశంకర్ ప్రసాద్‌కి ‘చిరంజీవి’ కంటే గొప్ప గౌరవం, పురస్కారం ఏముంటాయి.? చిరంజీవి అంటే శిఖరం.! ఆ శిఖరాన్ని చూసి, కొన్ని గ్రామ సింహాలు మొరగడంలో వింతేముంది.?
చిరంజీవి అంటే కోట్లాది మంది అభిమానుల్ని వశం చేసుకున్న ఓ శక్తి.! కోట్లాది మందికి సాయం చేసిన ఓ మానవత్వం.. కోట్లాది మందిని ప్రభావితం చేసిన ఓ స్ఫూర్తి.!