చంచల్ గూడా జైలుకెళితే ‘ముఖ్య మంత్రి’ అయిపోవచ్చా.?
Pallavi Prashanth Bigg Boss.. అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఆ తర్వాత రేవంత్ రెడ్డి.. హైద్రాబాద్‌లోని చంచల్‌గూడా జైలుకు వెళ్ళాల్సి వచ్చింది.
ఒకరేమో అక్రమాస్తుల కేసులో అరెస్టయి, జైలుకి వెళితే.. ఇంకొకరేమో ఓటుకు నోటు కేసులో అరెస్టయి జైలుకు వెళ్ళిన సంగతి తెలిసిందే.
ఇప్పుడేమో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి.! తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇటీవల రేవంత్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.
Pallavi Prashanth Bigg Boss.. కామన్ పాయింట్ అదేనా.?
ఇద్దరూ జైలుకు వెళ్ళారు.. అదీ చంచల్ గూడా జైలుకి.. ఇద్దరూ ముఖ్యమంత్రులయ్యారు.! సో, చంచల్ గూడా జైలు అనేది తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులకు ఓ సెంటిమెంట్.. అనే కామెంట్ సోషల్ మీడియాలో కనిపిస్తోంది.
తాజాగా, బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఏడో సీజన్ విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ కూడా అరెస్టయి, అదే చంచల్ గూడా జైలుకు వెళ్ళాడు.
బిగ్ బాస్ టైటిల్ గెలిచాక, పల్లవి ప్రశాంత్ సహా అతని అభిమానులు చేసిన అతి, ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వంసమవడంతో, కేసు నమోదు చేసిన పోలీసులు, అతన్ని అరెస్ట్ చేశారు.
ఇంకేముంది.? పల్లవి ప్రశాంత్ కూడా జైలుకు వెళతాడేమోనంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయ్. ముఖ్యమంత్రి పదవి అంటే అంత కామెడీ అయిపోయిందన్నమాట.!
కాదు కాదు, జైలుకు వెళ్ళడం అంటే కామెడీ అయిపోయింది. అరెస్టవడమంటే కామెడీ అయిపోయింది.! వ్యవస్థలు అలా తగలడ్డాయ్ మరి.!