ఏం సదువులివి.? చదువుకీ చేసే పనికీ సంబంధమేంటి.?

Education Parents And Students
Parents Students And Education.. ఎంటెక్ చదివి, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పోటీ పడాల్సి వస్తోంది.! ఎంబీబీఎస్ చదివిన వ్యక్తి, సాఫ్ట్‌వేర్ రంగంలో కొలువుల కోసం ప్రయత్నిస్తున్న రోజులివి.!
పెద్ద పెద్ద చదువుల వ్యవహారాలివి.! ఏం చదువుతున్నాం.? ఏం చేస్తున్నాం.? అసలు మన పిల్లల్ని ఎలా చదివిస్తున్నాం.? ఎటువైపు నడిపిస్తున్నాం.?
నర్సరీ నుంచే, ‘ఐఐటీ’ చదువుల్ని పిల్లల మీద బలవంతంగా రుద్దుతున్న రోజులివి.! ఐఐటీ ఫౌండేషన్ అనేది సర్వసాధారణమైపోయింది ఈ రోజుల్లో.
Parents Students And Education.. ఇంతకీ నువ్వేం చదివావ్.?
సరే, పిల్లల్ని ఉన్నత చదువుల వైపు నడిపించాలనే ఆలోచన తప్పు కాదు.! ఇంతకీ, నువ్వేం చదివావ్.? నువ్విప్పుడు ఏం చేస్తున్నావ్.? ఈ ప్రశ్నల చుట్టూ గనక తల్లిదండ్రులు ఆత్మవిమర్శ చేసుకుంటే.!
ఔను, వైద్య విద్యనభ్యసించాలంటే, ముందుగా ‘నీట్’ పరీక్షలో క్వాలిఫై అవ్వాలి.! కానీ, ఆ నీట్ పరీక్ష చుట్టూ ఎన్ని వివాదాలు నడుస్తున్నాయో చూస్తున్నాం కదా.?

ఇంటర్మీడియట్ స్థాయిలో ఇంజనీరింగ్, మెడిసిన్.. అంటూ విద్యార్థుల్ని పరుగులు పెట్టిస్తున్నాం. పొద్దున్న నాలుగింటి నుంచి, అర్థరాత్రి పన్నెండు గంటల వరకు చదువులు తప్పనిసరైపోయాయ్.
కష్టపడి ఉస్సూరుమనాల్సిందేనా.?
ఇంత కష్టపడీ, అటు మెడిసిన్‌లోనో, ఇటు ఇంజనీరింగ్‌లోనో సీటు రాకపోతే పరిస్థితేంటి.? వచ్చినా, అప్పుడిక చదువు మీద ఆసక్తి సన్నగిల్లితే ఎలా.?
ముందే చెప్పుకున్నట్టు, ఎంటెక్ చదివి కానిస్టేబుల్ ఉద్యోగానికి పోటీ పడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందో ఆత్మపరిశీలన చేసుకుంటే, పిల్లల్ని ఏం చదివించాలన్నదానిపై ఓ అవగాహన వస్తుంది.
ప్చ్.. పోటీ ప్రపంచంలో అవేవీ మనకు అర్థం కావు. ఆత్మ విమర్శ.. అన్నదానికి అర్థమే లేకుండాపోయింది. అప్పో సప్పో చేసేసి, పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వాలన్న కోణంలో, ఖరీదైన చదువులు చదివించేస్తున్నాం.
చదువు..కొనడం వల్ల ప్రయోజనమేంటి.?
ఉన్నత చదువులు చదివించాలన్న ఆలోచన తప్పు కాదు.! ఏం చదివితే భవిష్యత్తు బావుంటుందో పిల్లల్లో అవగాహన పెంచడం ద్వారా చదివించడం అనేది ముఖ్యం.
Also Read: అమ్మాయిలే దొంగలైతే! అమెరికాలో తెలుగోళ్ళ పరువు పాయే!
జర జాగ్రత్త.. లక్షలు పోసి పిల్లల్ని చదివించేయడం గొప్ప కాదు.! పిల్లల మనసుల్ని చదవండి.! అదే సమయంలో, సమాజాన్ని చదవండి.!
ఏం చదివితే ఏమవుతారన్నదానిపై పిల్లల్లో అవగాహన పెరగాలి. అంతకన్నా ముందు, ఆ అవగాహన తల్లిదండ్రులకీ వుండాలి. ఇది ఒత్తిడితో కూడుకున్న ప్రపంచం.. ఒత్తిడిని జయించడం అన్నిటికన్నా ముఖ్యం.
