Pashupatinath Temple: మనిషి ’మరణాన్ని‘ ముందే చెప్పే ’గుడి‘
Pashupatinath Temple Kathmandu
Pashupatinath Temple.. జనన మరణాలు శివేచ్ఛ. శివుడి ఆజ్న లేనిదే చీమైనా కుట్టదంటారు.
కానీ, ఆయువు మూడితే, తప్పించుకోవడం ఎవ్వరి వల్లా కాదు. మృత్యువు ఎప్పుడు.? ఎలా.? ఏ రూపంలో ఆవహిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు.
కానీ, ఈ గుడిలో చావు తేదీని ముందుగానే చెప్పేయగలరట. ఏంటా మహిమ.? ఎక్కడుంది ఆ గుడి అనుకుంటున్నారా.? ఇంకెందుకాలస్యం ఆ గుడి రహస్యం తెలుసుకుందాం పదండిక.
పశుపతి నాధ్ టెంపుల్
హిమాలయ పర్వతాల్లో ఉంది ఈ దేవాలయం. నేపాల్ రాజధాని ఖాట్మండుకి ఈశాన్య దిక్కు పొలిమేరలో భాగమతి నది ఒడ్డున ఈ దేవాలయం ఉంది.
సాక్షాత్తూ పరమేశ్వరుడు స్వయంభు పశుపతినాధుడిగా కొలువైన పుణ్య క్షేత్రం. ప్రపంచంలోనే అతి పురాతన శివాలయాల్లో అత్యంత పవిత్రమైన శివ క్షేత్రమిది.
బంగారంతో తయారు చేసిన శిఖరంతో ధగ ధగలాడిపోతుంటుంది ఈ గుడి శిఖరం. గోపురంపై ఏర్పాటు చేసిన బంగారు కలశాలు భక్తులను పరవశంలో ముంచెత్తేస్తుంటాయి.
Pashupatinath Temple.. అద్భుతమైన శిల్పకళ
ఈ ఆలయ నిర్మాణ శైలికి భక్తి పారవశ్యమే కాదు, చూస్తున్నంతసేపు తెలియని వింత అనుభూతి కలుగుతుంది. ఆలయ గోపురాలపై ఏర్పాటు చేసిన అందమైన శిల్పాలు, జీవకళ ఉట్టి పడేలా కనిపిస్తాయి.

నిజంగానే అందమైన అప్సరసలు దేవాలయ శిఖరాలపై నాట్యం చేస్తున్నారా.? అనేంత అందమైన అనుభూతి కలుగుతుంది.
హిందువులకు మాత్రమే..
ఈ ఆలయ ప్రాంగణంలో బ్రుహత్ నందిగా పిలవబడే అతి పెద్ద నంది విగ్రహం ఉంటుంది. మనం మామూలుగా శివాలయాల్లో చూసే నందికి భిన్నంగా ఉంటుందీ నంది నిర్మాణం.
ఈ ఆలయంలో ఎక్కడ చూసినా శివ లింగాలే తారసపడుతుంటాయి. అందుకే, ఒక్కసారి ఆలయ ప్రాంగణంలో అడుగు పెడితే చాలు, మనకు తెలియకుండానే మన శరీరంలోని అణువణువూ శివ నామ స్మరణలో లీనమైపోతుంది.
గర్భగుడిలోనికి కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. అన్య మతస్థులు దేవాలయ ప్రాంగణం మొత్తం తిరగొచ్చు. కానీ, గర్భ గుడిలోనికి వెళ్లకూడదు. విదేశీయులు ఎక్కువగా ఈ దేవాలయాన్ని సందర్శిస్తుంటారు.
ఆలయ పూజారులకూ ఓ ప్రత్యేకత ఉంది
ఈ ఆలయంలోని పూజారులను ‘భట్టా‘ అని పిలుస్తుంటారు. ప్రధాన అర్చకులకు ‘మూల భట్టా’ అని పిలుస్తారు. ఇక్కడి పూజారులకు కేవలం దక్షిణ భారతదేశం నుండి వచ్చిన వారు మాత్రమే ఉంటారు.
అందుకు ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. నేపాల్ రాజు మరణించిన తర్వాత, దేశం మొత్తం శోక సంద్రంలో ఉండగా, పశుపతి నాధుడికి (Pashupatinath Temple) పూజలు కరువయ్యాయి.
కానీ, పశుపతినాధుడికి నిరంతరం నిత్య పూజలు జరగాల్సిందే అన్న కారణంతో దక్షిణ భారత దేశం నుండి పూజారులను రప్పించారట.
అప్పటి నుండీ, అది ఓ సాంప్రదాయంగా మారింది. కేవలం దక్షిణ భారతదేశ పూజారులు మాత్రమే ఇక్కడి శివార్చకులుగా ఉండాలన్న నియమం బలపడింది.
Pashupatinath Temple.. చావు తేదీ సమయంతో సహా చెప్పగలరు
సాధారణంగా చావు పుట్టుకలు ఈ భూమ్మీద ఎవ్వరూ ఖచ్చితంగా అంచనా వేయలేరు. కానీ, పశుపతి నాధుని దేవాలయంలో చావు తేదీని.. రోజు, సమయంతో సహా ఖచ్చితంగా చెప్పేస్తారు ఇక్కడి ప్రధాన అర్చకులు.
Also Read: ఉగాది షడ్రుచులు.! కొత్త సంవత్సరాది ప్రత్యేకతలివీ.!
ప్రపంచంలో మరణం గురించి ముందుగానే ఖచ్చితంగా చెప్పగలిగేది ఇక్కడ మాత్రమే. ఇక్కడి వాతావరణంలోని గాలిలో మృత్యుదేవత ఉండడమే అందుకు కారణమని భక్తులు నమ్ముతుంటారు.
సహజంగా ఈ శివాలయాన్ని చాలా తక్కువ మంది భక్తులు మాత్రమే దర్శించుకుంటారు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లోనే భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటుంటారట.