గాలి వార్త.! పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.!

 గాలి వార్త.! పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.!

Pawan Kalyan

Pawan Kalyan Atlee Movie.. అట్లీ దర్శకత్వంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కథా సహకారం అందించగా, పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కబోతోందిట.!

అదిరింది కదా.! నిజానికి, ఇది ఓ గాలి వార్త.! ఎందుకని దీన్ని గాలి వార్తగా చెప్పాల్సి వస్తోందంటే, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలు చేసే మూడ్‌లో లేరు.

జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా వున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందరే, అప్పటికి కమిట్ అయిన సినిమాలు పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ సంకల్పించుకున్నా, అనివార్య కారణాల వల్ల అది కుదరలేదు.!

Pawan Kalyan Atlee Movie.. ఆ మూడు సినిమాలు..

క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీర మల్లు’, సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’, హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలు మద్యలో ఆగిపోయాయి.

పై మూడింటిలో ఒక్కటి కూడా ఇప్పట్లో ముందుకు కదిలే పరిస్థితి లేదు.

Pawan Kalyan Varahi Vijaya Yatra Visakhapatnam
Pawan Kalyan Varahi Vijaya Yatra

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సహా, దేశంలో సార్వత్రిక ఎన్నికలు మార్చి – ఏప్రిల్ – మే నెలల్లో పూర్తవుతాయ్.

ఆ తర్వాత ఎలాంటి పొలిటికల్ ఈక్వేషన్స్ వుంటాయో ఎవరూ చెప్పలేం. పవన్ కళ్యాణ్ చట్ట సభలకు వెళితే, ఇంకా బాధ్యతగల పదవిలో ఆయన కూర్చోవాల్సి వస్తే.. ఇక అంతే.! సినిమాలకు ఛాన్స్ వుండకపోవచ్చు.

గాలి పోగెయ్యడం..

నిజానికి, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి వుంది పవన్ కళ్యాణ్. అది కాకుండా, మరో రెండు సినిమాలు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు.

Also Read: ఈ చిన్ని ‘హనుమాన్’ ఏం పాపం చేశాడని.?

కమిట్ అయిన సినిమాల్లో, పైన పేర్కొన్న మూడు సినిమాల్ని పవన్ కళ్యాణ్ ఎలాగోలా పూర్తి చేస్తారు. అది ఆయన కమిట్‌మెంట్. కానీ, అదీ ఎన్నికల తర్వాతే.

ఇప్పుడు అర్థమయ్యిందా.. అట్లీ – త్రివిక్రమ్ – పవన్ సినిమా అనేది కేవలం ‘గాలి’ ప్రచారమేనని.! గాలి పోగేసి, గాసిప్పులనడం ఓ వర్గం మీడియాకి ‘దురద’ అయిపోయింది.! వాళ్ళకి దురదేస్తే, అందరూ గోక్కోవాలా.?

Digiqole Ad

Related post