Pawan Kalyan Political Alliance జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించేలా కొన్ని ప్రశ్నాస్త్రాలూ సందించారు.
తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ ముందు ముందు పోషించబోయే పాత్ర గురించి కీలక వ్యాఖ్యలు చేసిన జనసేనాని, పొత్తులపైనా సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
‘వాళ్ళు అనుకున్నది జరగదు.. మీరు అనుకున్నదే జరుగుతుంది’ అంటూ, జనసైనికుల్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయా రాజకీయ పార్టీల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Pawan Kalyan Political Alliance..వైసీపీకీ.. టీడీపీకీ…
పవన్ కళ్యాణ్ (Jana Senani Pawan Kalyan) చేసిన వ్యాఖ్యల్లో ‘వాళ్ళు అనుకున్నది జరగదు’ అంటే, ఇక్కడ వైసీపీ (YSR Congress Party) గురించి అన్నమాట.!

మీరు అనుకున్నదే జరుగుతుంది.. అన్న మాటపై తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఉలిక్కిపడుతోంది.
ఒంటరిగా పోటీ చేయాలా.? ఎవరితోనైనా కలిసి వెళ్ళాలా.? అన్నది ప్రజలు డిసైడ్ చేయాలని, జనసేన పార్టీ (Jana Sena Party) పొత్తులపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం గమనార్హం.
గెలిచినోడు గొప్పోడు కాదు.. ఓడినోడు చెడ్డోడు కాదు.!
ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కరెన్సీ నోట్లను వెదజల్లబోనని చెప్పే ధైర్యం ఏ నాయకుడికి అయినా వుందా.? ఒక్క పవన్ కళ్యాణ్‌కి తప్ప.!
రాజకీయమంటే సేవ.! రాజకీయమంటే ధర్మం తప్పకపోవడం.!
ఆ సేవకై జనసేన పార్టీ కట్టుబడి వుందన్న జనసేనాని.!
పొత్తుల పంచాయితీపై నర్మగర్భ వ్యాఖ్యలు.!
జనం ఆలోచనల మేరకే.. జనసైనికుల ఆలోచనలకు తగ్గట్టే ఏదైనా.!
Mudra369
ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. అయితే, ఆ ప్రజా తీర్పుని డబ్బుతో కొనేస్తున్న రోజులివి. పవన్ కళ్యాణ్ (Janasenani Pawan Kalyan) మాత్రం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓట్లను కొనేది లేదంటున్నారు.
ఒక్క దెబ్బకి మూడు పిట్టలు..
ఒకటి కాదు, రెండు కాదు.. ఒక్క దెబ్బకి మూడు పిట్టలు.. అన్న చందాన, జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ వేదికగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తనదైన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారు.
మిత్రపక్షం బీజేపీ తమతో బాధ్యతాయుతంగా కలిసి రాకపోవడంపైనా, వైసీపీ – టీడీపీ ఆడుతున్న రాజకీయ డ్రామాలపైనా జనసేనాని (Janasenani Pawan Kalyan) కడిగి పారేశారు.

‘రాష్ట్రం కోసం జనసేనకు ఓటెయ్యండి.. నేను రాజకీయాల్లో వున్నా, లేకపోయినా.. సినిమా రంగంలో నేను సంపాదించుకోగలను.. రాజకీయాల్లో వుంటే, సినిమాల్లో సంపాదించింది ఖర్చు చేయాలి..’ అని పవన్ చెప్పుకొచ్చారు.
ధర్మం వైపు నిలబడతాను.. గెలిచినా, ఓడినా.. అదే నాకు ఆత్మసంతృప్తి అని జనసేనాని (Jana Sena Party Chief Pawan Kalyan) అన్నారు.
Also Read: పవన్ కళ్యాణ్ బ్రహ్మచర్యం.! జాతీయ సమస్యే.?
‘దమ్ముంటే ఒంటరిగా పోటీ చెయ్.. అంటున్నారు. తొడలు కొడుతున్నారు.. దుర్యోధనుడూ ఇలాగే విర్రవీగాడు.. చివరికి అతని తొడల్ని భీముడు బద్దలుగొట్టాడు.. మీ పరిస్థితి కూడా అంతే..’ అని వైసీపీని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.