Pawan Kalyan Jana Sena Party

రాజకీయమంటే దేశ సేవ.. దటీజ్ పవన్‌ కళ్యాణ్‌

129 0

దేశంలో ఏ రాజకీయ పార్టీకి చెందిన కార్యక్రమంలో అయినా ఆ పార్టీ జెండా కంటే ఎక్కువగా జాతీయ జెండాలు కన్పిస్తాయా.? కన్పించవు.. ఒక్క జనసేన పార్టీ విషయంలో తప్ప. అవును, జనసేన పార్టీకి రాజకీయం (Pawan Kalyan Jana Sena Party) అంటే, ‘దేశ సేవ’. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పలు సందర్భాల్లో చెప్పారు.

సినిమాల్లో ‘పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌’ (Power Star Pawan Kalyan) అనే పేరుకి వున్న క్రేజ్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కోట్లాది రూపాయల సంపాదనని వదిలేసుకుని, రాజకీయాల వైపు అడుగులేశారాయన. రాజకీయాల్లో గెలుపోటముల్ని నిర్ణయించేది ప్రజలే. అయితే, ఓటమిని చూసి కుంగిపోయే మనస్తత్వం కాదు జనసేన అధినేతది.

‘ఒక్క ఓటు నాకు వచ్చినా.. ఆ ఒక్కడి మనసుని నేను గెలుచుకున్నట్లే..’ అన్న పాజిటివ్‌ మైండ్‌సెట్‌తో జనసేన అధినేత రాజకీయం చేస్తున్నారు. రాజకీయం అంటే దేశ సేవ. కులాల చుట్టూ తిరిగే రాజకీయాలు, మతాల చుట్టూ, ప్రాంతాల చుట్టూ తిరిగే రాజకీయాలు కాదు.. సరికొత్త రాజకీయం.. కుళ్ళిపోయిన వ్యవస్థలో మార్పు తెచ్చే రాజకీయం చేయాలనుకుంటున్నారు.. అదే చేస్తున్నారు పవన్‌ కళ్యాణ్‌.

తాజాగా తన ట్విట్టర్‌ హ్యాండిల్‌ ఫాలోవర్స్‌ సంఖ్య 4 మిలియన్లకు చేరుకోవడంతో, పవన్‌ కళ్యాణ్‌ ఓ ఆసక్తికరమైన ట్వీట్‌ టవేశారు. ఈ ట్వీట్‌లో జనసేన ఆలోచనా విధానాన్ని స్పష్టం చెప్పారు. మార్పు కోసం తనతో కలిసి నడుస్తోన్న 4 మిలియన్ల మందికీ కృతజ్ఞతలు తెలిపారు.

Jana Sena forayed into politics by drawing inspiration from the sacrifices of our freedom struggle & built upon the ideals of our constitution and on the values of Sanatana Dharma.

We took the road less traveled – for us Politics mean National Service. In the times of divisive and vendetta politics, toxic social media filled with abuses, hate and slander, Jana Sena is a Becon of Light standing for Change.

I thank 4 million change seekers who share the same vision for a responsible accountable politics.

బాధ్యతాయుతమైన రాజకీయాలు చేస్తానని ఈ సందర్భంగా జనసేనాని స్పష్టం చేశారు. ఇక, యాక్టింగ్‌ కెరీర్‌ విషయానికొస్తే, జనసేన పార్టీ ఆర్థిక అవసరాల నిమిత్తం జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తిరిగి సినిమాల్లో నటిస్తోన్న విషయం విదితమే.

‘నాకు సంపాదన అంటే అది సినిమాల ద్వారానే. అందుకే, సినిమాలు చేస్తున్నాను..’ అని ఇదివరకే ప్రకటించారు పవన్‌ కళ్యాణ్‌. ఈ క్రమంలో ఆయన వరుసగా మూడు సినిమాలకు కమిట్‌ అయ్యారు. వాటిల్లో ‘వకీల్‌ సాబ్‌’ (Vakeel Saab) ఇప్పటికే చాలావరకు షూటింగ్‌ పూర్తి చేసుకుంది.

మరోపక్క క్రిష్‌ డైరెక్షన్‌లో మరో సినిమా చేస్తున్నారు పవన్‌ కళ్యాణ్‌. ‘గబ్బర్‌ సింగ్‌’ ఫేం హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా ఖరారు కాగా, అది ఇంకా సెట్స్‌ మీదకు వెళ్ళలేదు.

Related Post

నౌ ఆర్‌ నెవర్‌: వైఎస్‌ జగన్‌కి సై అంటారా.?

Posted by - March 19, 2019 0
తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి (YS Rajasekhar Reddy) అండదండలతో రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి (YS Jaganmohan Reddy)రాజకీయం (YS Jagan YSRCP) రుచి…

40 ఏళ్ళ ‘మెగా’ చిరంజీవితం.!

Posted by - September 22, 2018 0
మెగాస్టార్‌ చిరంజీవి (Mega Star Chiranjeevi).. పరిచయం అక్కర్లేని పేరిది తెలుగు సినీ అభిమానులకి. నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ప్రేక్షకుల్ని అలరిస్తూనే వున్నారాయన. చిరంజీవి సినిమాలంటే..…
Sye Raa Power Punch

‘సైరా’ సాక్షిగా పవన్‌ ‘పవర్‌’ పంచ్‌ ఏంటంటే..

Posted by - September 22, 2019 0
మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Narasimha Reddy) అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ‘సైరా’ (Sye…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *