ఆలస్యం అమృతం విషం.! త్వరగా తేల్చెయ్ జనసేనానీ.!

Janasenani Pawan Kalyan

Pawan Kalyan To Contest.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారన్న ప్రశ్నకు ఇంకా సరైన సమాధానం దొరకడంలేదు.

2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. కానీ, రెండు చోట్లా ఓడిపోయారాయన.

రాజకీయాల్లో గెలుపోటములు సహజం. అయితే, రెండు చోట్ల పోటీ అనేది రాజకీయ నాయకులకు అంత తేలికైన వ్యవహారం కాదు.

గతంలో, అంటే.. 2009 ఎన్నికల్లో అప్పటి ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి, పాలకొల్లు సహా తిరుపతి నుంచి పోటీ చేశారు.

పాలకొల్లలో ఓడిన చిరంజీవి, తిరుపతి నుంచి మాత్రం గెలిచారు. గత అనుభవాల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాగ్రత పడి వుండాల్సింది.

Pawan Kalyan To Contest.. గెలుపోటములు సహజం కానీ..

సరే, రాజకీయాల్లో వ్యూహాలు.. వాటి పర్యవసానాలు.. అది వేరే చర్చ. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి, కేసీయార్ రెండు చోట్ల పోటీ చేశారు.

కానీ, ఇద్దరూ ఓ చోట ఓడి, ఇంకో చోట గెలిచారు. రాజకీయాల్లో తలపండిపోయిన కేసీయార్‌కే ఓటమి తప్పలేదు. రాజకీయం అంటేనే ఇది.

Janasenani Pawan Kalyan
Janasenani Pawan Kalyan

ఇక, పవన్ కళ్యాణ్ విషయానికొస్తే ఆయన ఈసారి రెండు చోట్ల పోటీ చేసే అవకాశం లేదన్న ప్రచారం జరుగుతోంది. భీమవరం వైపే ఆయన మొగ్గు చూపుతున్నారట.

కానీ, గాజువాక జనసేన శ్రేణులు పవన్ కళ్యాణ్ తమ ప్రాంతంలో పోటీ చేయాలని కోరుకుంటున్నాయి. మరోపక్క, పవన్ కళ్యాణ్ లోక్ సభకు పోటీ చేయాలన్న చర్చ కూడా జరుగుతోంది జనసేనలో.

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేనాని పోటీ చేస్తే బావుంటుందని అక్కడి జనసేన నేతలు కోరుకుంటున్న సంగతి తెలిసిందే.

ఆలస్యం అస్సలు మంచిది కాదు..

ఏదో ఒక విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని త్వరగా తీసుకోవాల్సి వుంది.

ఒక్క చోట పోటీ చేస్తారా.? రెండు చోట్ల పోటీ చేస్తారా.? అసెంబ్లీకి మాత్రమే పోటీ చేస్తారా.? లోక్ సభకీ పోటీ చేస్తారా.? అన్న విషయాలపై ప్రజలకీ, పార్టీ శ్రేణులకీ జనసేనాని స్పష్టత ఇచ్చేస్తే మంచిది.!

Also Read: హరీష్ భాయ్.. నువ్వు ‘గ్రేట్’.! భలే ఏకిపారేశావోయ్.!

ఆ స్పష్టత వస్తే, పార్టీ శ్రేణులు ఆ నియోజకవర్గం లేదా ఆయా నియోజకవర్గాల్లో ఇంకొంత అగ్రెసివ్‌గా పనిచేసే అవకాశం వుంటుంది.

ఆలస్యం అమృతం విషం.!

hellomudra

Related post