మేతావి ‘మేత’స్సు.. సమాజానికి అత్యంత హానికరం.!

 మేతావి ‘మేత’స్సు.. సమాజానికి అత్యంత హానికరం.!

Professor K Nageshwar Ys Jagan People Money Rulers Publicity

People Money Rulers Publicity.. ఆయన అనుభవం అంత లేదు నీ వయసు.. అని పెద్దోళ్ళు ఒకప్పుడు సంధించే మాట.. అప్పటి కాలానికి మంచిదే.!

ఎందుకంటే, వయసు మీద పడ్డవారి అనుభవం.. కొత్త తరానికి ‘మార్గం’ అయ్యేది.!

కానీ, ఇప్పుడు పరిస్థితులు వేరు.! వయసు మీద పడేకొద్దీ, మేధావి కాస్తా, మేతావిగా మారిపోతున్నాడు. ఈ ‘మేత’స్సు.. సమాజానికి అత్యంత హానికరంగా మారుతోంది.! ఇప్పుడిదంతా ఎందుకు.? అసలు విషయంలోకి వెళ్దాం పదండిక.!

ప్రొఫెసర్ నాగేశ్వర్.! ఈ పేరు రాజకీయాలతో పరిచయమున్న చాలామందికి తెలిసే వుంటుంది. చట్ట సభల్లోకి అడుగు పెట్టిన అనుభవం కూడా వుందీయనకి.. ప్రజా ప్రతినిథిగా.!

పేరులో ‘ప్రొఫెసర్’ అని వుందంటే, సమాజం పట్ల అవగాహన, దానికి మించిన బాధ్యత.. వుందనే అనుకోవాలి.! వుందా మరి.? వుండకనేం.. వుంటుంది. చాలా విషయాల్లో తనదైన విశ్లేషణ చేస్తుంటారు. మంచి మాటలూ చెబుతుంటారు.

People Money Rulers Publicity.. సొమ్ములెవరివి.? సోకులెవరివి.?

కానీ, అనూహ్యంగా ఈయన ‘మేత’స్సు చాటుకోవడం మొదలు పెట్టారు. అది కూడా, ‘ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి.. ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తి ఫొటో’ విషయమై.!

బర్త్ సర్టిఫికెట్ మీద అధికారి సంతకానికీ, సంక్షేమ పథకాలకు సంబంధించిన వాటిపై ముఖ్యమంత్రి ఫొటోకీ.. తేడా తెలియనంత ‘మేత’స్సు ఈయన సొంతం.! పదో తరగతి పరీక్షా పత్రంపై ఎవరి సంతకం వుంటుంది.? ఎస్ఎస్‌సీ బోర్డ్‌కి సంబంధించిన అధికారి సంతకం.!

ఓ వ్యక్తికి చెందిన ఆస్తి పత్రాలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటో ఎందుకు.? అన్నది ప్రశ్న.!

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ అధికారిక చిహ్నం సరిపోద్ది కదా.? ముఖ్యమంత్రి మారిన ప్రతిసారీ, ఆస్తి పత్రాల్ని మళ్ళీ మళ్ళీ మార్చుకుంటూనే వుండాలా.?

ఆయా వ్యక్తుల స్వార్జితమో, తాతలు తండ్రుల నుంచి వచ్చిన ఆస్తిపాస్తులో.. వీటిపై ప్రభుత్వాన్ని నడిపే రాజకీయ నాయకుల ఫొటోలు ఏ నైతికతకు నిదర్శనం.?

ఇది తప్పని చెప్పలేని భయం ‘ప్రొఫెసర్’ స్థాయి వ్యక్తికి ఎందుకొచ్చింది.? ఏ ‘మేత’స్సు ఈ మేతావితో ఇలా మాట్లాడించింది.?

Mudra369

ఎన్నేళ్ళయినా, ఆ పదో తరగతి సర్టిఫికెట్ మారదు.! ఆ సంతకం చేసిన వ్యక్తి చనిపోయినా, దాని విలువ అలాగే వుంటుంది.! కానీ, సంక్షేమ పథకాలకి సంబంధించి ముఖ్యమంత్రి ఫొటో అన్నది ఐదేళ్లకోసారి మారిపోతుంది. ఖర్మకాలి ప్రభుత్వం ఆర్నెళ్ళకే మారితే, ఫొటో మారిపోవాల్సిందే.!

ప్రభుత్వం మారాక, సంక్షేమ పథకాల పేర్లు మారిపోతాయ్.. వాటి మీద బొమ్మలూ మారిపోతాయ్.! ఇది తెలియని ‘మేత’స్సు.. ప్రొఫెసర్ నాగేశ్వర్ సొంతం. ‘ముఖ్యమంత్రి ఫొటోలు వుంటే తప్పేంటి.?’ అని ప్రశ్నిస్తున్నారంటే, ఇతన్ని ప్రొఫెసర్ అనగలమా.?

సంక్షేమం ప్రజల హక్కు..

ఏ సంక్షేమ పథకం అయినా ప్రజాధనంతోనే అమలవుతుంది. ప్రజాధనంతో అమలయ్యే సంక్షేమ పథకాలకి, ఐదేళ్ళకోసారి మారిపోయే ముఖ్యమంత్రి ఫొటో ఎందుకు.? పార్టీల రంగులెందుకు.? సిగ్గుండాలి కదా.?

ఆ సిగ్గు రాజకీయ నాయకులకి అస్సలు లేదు.. వాళ్ళకి సలాం కొడుతున్న అధికార యంత్రానికీ లేదు. ఇదిగో, నాగేశ్వర్ లాంటి మేతావుల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

జనం ప్రశ్నించాలి.! ప్రొఫెసర్ అంటే, జనంలో చైతన్యం పెంచగలగాలి.! రాజకీయ విశ్లేషకుడు.. అంటే వ్యవస్థలో తప్పొప్పుల్ని నిలదీయగలగాలి.! అంతేగానీ, ఏదో రాజకీయ పార్టీ ‘మేత’ వేస్తోంటే, దానికి తగ్గట్టుగా ‘మేత’స్సు ప్రదర్శిస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటో విషయమై ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రదర్శించిన మేతావితనంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రజలే ప్రభువులు.. బిచ్చగాళ్ళు కాదు.!

వైఎస్ జగన్ అనే కాదు, ముఖ్యమంత్రి ఎవరైనాసరే, ప్రధాన మంత్రి అయినాసరే.. ప్రజాధనంతో అమలయ్యే సంక్షేమ పథకాలకి తమ పేర్లను పెట్టుకోవడం, తమ ఫొటోలతో ప్రచారం చేసుకోవడం.. పైగా, పెయిడ్ ప్రచారాలు చేసుకోవడం.. అత్యంత బాధ్యతారాహిత్యం.!

ప్రజాధనం సొంత పబ్లిసిటీ కోసం దుర్వినియోగం చేయడమంటే.. ప్రజల్ని అవమానించడమే.! ప్రజల్ని మోసగించడమే.! ప్రజాధనం పైసా అయినాసరే, అది దుర్వినియోగం అవకూడదు.. ప్రజలకే చెందాలి.!

Andhra Pradesh: ఏ ఇంటెలిజెన్స్ చెప్పిందిరా బ్లూ మాఫియా రెడ్డీ.!

రాజకీయం అంటే సేవ.! ఆ సేవ చేసే ప్రజా ప్రతినిథులకు (ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా) గౌరవ వేతనం అందుతుంది.! ఆ వేతనం ఇచ్చేది కూడా ప్రజలే.!

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు.! పాలకులెవరైనా సేవకులు మాత్రమే.! సేవకుడి ఫొటో, ప్రభువులకి చెందాల్సిన ప్రజాధనంతో సేవకుల పబ్లిసిటీ స్టంట్లేంటి.? కామన్ సెన్స్ లేదా.?

Digiqole Ad

Related post