Ala Vaikunthapurramuloo Review

ప్రివ్యూ: అల వైకుంఠపురములో.. స్టైలిష్‌ విన్నర్‌

508 0

ఆయన స్థాయి వేరు.. ఆయన స్థానం వేరు.. అందుకే ఆయన్ని అందరూ ‘గురూజీ’ (Guruji Trivikram) అని అభిమానిస్తుంటారు. హీరోలకి అభిమానులు వుండడం సర్వసాధారణమే (Ala Vaikunthapurramuloo Review). దర్శకులకి అభిమానులు వుండడం చాలా అరుదు.

పైగా, ఆ దర్శకుడి పట్ల ఆరాధనా భావం సినీ అభిమానుల్లో నెలకొనడం చాలా చాలా గొప్ప విషయం. ఆయనే, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ (Trivikram Srinivas). మాటల మాంత్రికుడిగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఎన్నెన్ని ప్రయోగాలు చేశారో చూశాం.

Also Read: స్టైలిష్‌గా ‘అల..’.. అదరగొట్టేస్తోందిలా.!

దర్శకుడిగా త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న సినిమాలు చూస్తున్నాం. ఒకటీ అరా సినిమాలు ఆయన కెరీర్‌లో ఫెయిల్‌ అయి వుండొచ్చు.. ఆ సినిమాల్ని మళ్ళీ చూస్తే, ‘గొప్ప గొప్ప విషయాల్ని’ చెప్పాలంటే గొప్ప గొప్ప వ్యక్తులే చెప్పాలి.. అన్పిస్తుంటుంది.

అలా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ నుంచి మరో గొప్ప సినిమా రాబోతోందా.? ‘అల వైకుంఠపురములో’ సినిమా అంచనాల్ని అందుకుంటుందా.?

అల్లు అర్జున్‌తో (Stylish Star Allu Arjun) మూడోసారి సినిమా చేస్తోన్న త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ (Trivikram Srinivas), ఈ సంక్రాంతికి తనదైన రేంజ్‌ హిట్‌ కొడతారా.? ఇంకెందుకు ఆలస్యం.. సినిమా ప్రివ్యూలోకి వెళ్ళిపోదాం.

అల్లు అర్జున్‌ – త్రివిక్రమ్‌ మూడోస్సారి..

‘జులాయి’తో తొలిసారిగా అల్లు అర్జున్‌ – త్రివిక్రమ్‌ జత కట్టారు. ఆ సినిమా పెద్ద హిట్‌. ఆ తర్వాత ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’ సినిమా చేశారు. అదీ బాగానే ఆడింది. ఇద్దరికీ వేవ్‌ లెంగ్త్‌ పెర్‌ఫెక్ట్‌గా సెట్‌ అయ్యింది గనుకనే, మూడు సినిమాలు చేయగలిగారు.

ఇదే విషయాన్ని అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ‘అల వైకుంఠపురములో’ ప్రమోషన్ల సందర్భంగా చెప్పుకొచ్చారు. త్రివిక్రమ్‌ సినిమాల్లో ఏదో తెలియని మ్యాజిక్‌ వుంటుంది. అల్లు అర్జున్‌ సినిమాల్లో ఓ విధమైన స్టైల్‌ వుంటుంది. అది ‘అల వైకుంఠపురములో’ సినిమాకి ఇంకాస్త ఎక్కువే కన్పిస్తోంది.

పూజా హెగ్దే – నివేదా పేతురాజ్‌..

త్రివిక్రమ్‌ సినిమాల్లో హీరోయిన్‌కి వుండే ప్రాధాన్యత గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఈ ‘అల వైకుంఠపురములో’ సినిమాలోనూ అంతే. పూజా హెగ్దేని (Pooja Hegde) ‘బుట్టబొమ్మ’లా చూపించాడు దర్శకుడు. ఆ విషయం సినిమా పాటల్లో కన్పిస్తోంది. ప్రోమోస్‌ అదిరిపోయాయ్‌ మరి.!

మరోపక్క ఈ సినిమాలో నివేదా పేతురాజ్‌ (Nivetha Pethuraj) మరో కీలక పాత్రలో కన్పించబోతోంది. సుశాంత్‌, టబు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్నట్టు, సునీల్‌ కూడా ఈ సినిమాలో నటించాడండోయ్‌.

ప్రీ రిలీజ్‌ టాక్‌ ఏంటి.?

ఆకాశాన్నంటే అంచనాలు.. అనేది చిన్న మాటేమో. అంతలా ‘సామజవరగమన’ (Samajavaragamana) పాటతోనూ, ‘రాములో రాములా’ (Ramulo Ramula)సాంగ్‌తోనూ ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo) సందడి చేసింది.. చేస్తూనే వుంది.

టీజర్‌ (Ala Vaikuntapuramulo), ట్రైలర్‌.. మిగతా సాంగ్స్‌.. అన్నీ ‘అల వైకుంఠపురములో‘ సినిమాపై అంచనాలు మరింత పెరగడానికి దోహదపడ్డాయి.

ఈ క్రమంలో అనూహ్యంగా ప్రమోషన్స్‌లో వేగం తగ్గించింది ‘అల వైకుంఠపురములో’ టీమ్‌. ఇదొక వ్యూహం అనుకోవాలేమో. ఓవర్సీస్‌లో అదిరిపోయే అంచనాలున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో సంగతి సరే సరి.

100 కోట్ల షేర్‌ టార్గెట్‌గా వస్తోన్న ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo Review) ఈ సంక్రాంతికి బక్సాఫీస్‌ బద్దలైపోయే వసూళ్ళను సాధిస్తుందని ‘అల్లు అర్జున్‌ ఆర్మీ’ భావిస్తోంది.

మరి ఆ అంచనాలు నిజమవుతాయా.? సంక్రాంతి విన్నర్ అని అల్లు అర్జున్ (Stylish Star Allu Arjun) అనిపించుకుంటాడా.? వేచి చూడాల్సిందే.

Related Post

Sarileru Neekevvaru Anthem

సరిలేరు ఏంథెమ్‌.. సైనికా నీకు సాటెవ్వరు.?

Posted by - December 23, 2019 0
సరిహద్దుల్లో సైన్యం ప్రాణాల్ని లెక్కచేయకుండా పోరాడుతుండడం వల్లే.. దేశంలో 120 కోట్ల మంది భారతీయులు హాయిగా జీవించగలుగుతున్నారు. అలాంటి సైనికుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం.? సైనికుల త్యాగాల్ని…
Antariksham 9000 kmph

ప్రివ్యూ: ‘అంతరిక్షం’లో మెగా సాహసం

Posted by - December 20, 2018 0
‘ఘాజీ’ ఫేం సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా రూపొందిన ‘అంతరిక్షం’ (Antariksham Preview) సినిమా గురించి తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న…

ఎన్టీఆర్‌ మ్యాజిక్‌.. సూపర్‌ హిట్‌ టాక్‌.!

Posted by - October 9, 2018 0
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ దూసుకొస్తున్నాడు ‘అరవింద సమేత’ సినిమాతో. హిట్టు మీద హిట్టు కొడుతూ మంచి జోరు మీదున్న ఈ యంగ్‌ టైగర్‌, తన పేరిట సరికొత్త…

బిగ్‌ బిగ్గర్‌ బిగ్గెస్ట్‌.. విజేత కౌశల్‌

Posted by - September 11, 2018 0
కౌశల్‌ ఆర్మీ.. సోషల్‌ మీడియాని ఇప్పుడు ఈ ఆర్మీ ఓ ఊపు ఊపేస్తోంది. అసలు ఎవరు ఈ కౌశల్‌.? అని ప్రశ్నించుకుంటే, పలు తెలుగు సినిమాల్లో నటించిన…

రివ్యూ: అరవింద సమేత ’వీర‘ రాఘవ

Posted by - October 11, 2018 0
సినిమా టైటిల్‌: అరవింద సమేత Aravinda Sametha Review నటీనటులు: జూ. ఎన్టీఆర్‌, పూజా హెగ్దే, జగపతిబాబు, సునీల్‌, నాగబాబు, ఈషా రెబ్బ, సుప్రియ పాఠక్‌, నవీన్‌ చంద్ర,…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *