Sye Raa Narasimha Reddy Review

ప్రివ్యూ: ‘సైరా నరసింహారెడ్డి’ న భూతో న భవిష్యతి

1180 0

‘సైరా నరసింహారెడ్డి’లో (Sye Raa Narasimha Reddy) అసలేముంది.? చాలా సినిమాలు వస్తుంటాయి. వెళుతుంటాయి. కొన్ని సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తారు.

మరికొన్నింటిని తిరస్కరిస్తారు. హిట్‌ సినిమాల్లోనూ కొన్ని సూపర్‌ హిట్‌ సినిమాలుంటాయి. చరిత్రని తిరగ రాసే సినిమాలూ (Sye Raa Narasimha Reddy Review) ఉంటాయి.

విడుదలకు ముందే భారీ అంచనాలు, విడుదలయ్యాకా అద్భుతాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. కమర్షియల్‌ సక్సెస్‌ అనే ఆలోచన లేకుండా ఓ పెద్ద సినిమాని, అదీ దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందించాలన్న ఆలోచన నిజంగానే ఓ అద్భుతం. నిజానికి అది చాలా పెద్ద సాహసం.

తనకు నటనను వారసత్వంగా ఇచ్చిన తండ్రికి ఏ కొడుకయినా ఇంతకన్నా గొప్ప బహుమతి ఎలా ఇవ్వగలడు.? ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను.? అని ఓ తనయుడు తన తండ్రి గురించి చేసిన ఆలోచనల్లోంచే ‘సైరా నరసింహారెడ్డి’ ఊపిరి పోసుకుంది.

సైరా నరసింహారెడ్డి.. మన చరిత్ర.. Sye Raa Narasimha Reddy Review

300 కోట్ల బడ్జెట్‌తో కాకపోయినా, చిరంజీవి ఓకే అంటే, ఎప్పుడో పదేళ్ల క్రితమే ‘సైరా నరసింహారెడ్డి’ ప్రేక్షకుల ముందుకొచ్చేసేది. నిజానికి చిరంజీవికి ఇలాంటి వెండితెర అద్భుతాలు కొత్తేమీ కాదు.

‘అంజి’ సినిమా సుదీర్ఘ కాలం ఆలస్యమవడం వల్ల రిజల్ట్‌ తడబడింది కానీ, లేకపోతే, అది నిజంగానే ఓ సాంకేతిక అద్భుతం.

‘సైరా’ విషయానికొద్దాం. 300 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా ఏదో చేశారు. ఇవన్నీ కాదు, చిరంజీవి హీరోగా నటించిన సినిమా ఇది. ఇదొక్కటి చాలు, ఈ ఒక్కదాన్నీ వంద కారణాలుగా, కాదు, కాదు.. లక్ష కారణాలుగా చెప్పొచ్చు ‘సైరా నరసింహారెడ్డి’ని ఎందుకు చూడాలి.? అన్న ప్రశ్నకు సమాధానంగా.

‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి, ఇంకా ఏదో తన నుండి ప్రేక్షకులు ఆశిస్తున్నారని గుర్తెరిగి చేసిన సినిమా ఈ ‘సైరా నరసింహారెడ్డి’. ‘పర్లేదు సార్‌.. ఈ సీన్‌కి ఇంత రిస్క్‌ అవసరం లేదు.. మ్యానేజ్‌ చేద్దాం.. అని దర్శకుడు చెబితే, పర్లేదు చేద్దాం..’ అని చిరంజీవి యోధుడిలా సన్నివేశంలోకి దూకిన వైనం చాలా ప్రత్యేకం.

చిరంజీవితం.. కష్టమే ఇష్టంగా..

చిరంజీవి గారి మీద రెస్పెక్ట్‌ పది రెట్లు పెరిగింది.. అని దర్శకుడు సురేందర్‌ రెడ్డి చెబుతున్నాడంటే, ఎంతగా సెట్స్‌లో చిరంజీవి అందర్నీ మెస్మరైజ్‌ చేసి ఉంటారో అర్ధం చేసుకోవచ్చు.

అంత కష్టపడీ, ‘నేను చేసిందేమీ లేదు.. ఎంత చేయాలో అంత చేశాను. నా కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. నన్ను చాలా బాగా చూసుకున్నారు..’ అని చిరంజీవి చెప్పడం అతని గొప్పతనాన్ని చెప్పకనే చెబుతోంది.

తెలుగు సినిమాకి స్టంట్స్‌ పరంగా, సరికొత్త గ్లామర్‌ నేర్పిన చిరంజీవి ఈ వయసులో మళ్లీ కొత్త రాత రాశారు ‘సైరా నరసింహారెడ్డి’తో. ముంబయ్‌కి వెళ్లి అమితాబ్‌ని పొగిడినా, ప్రతీ ఇంటర్వ్యూలోనూ ఇతర నటీనటుల్ని మెచ్చుకుంటున్నా, అదంతా చిరంజీవి గొప్పతనం.

అంతేకాదు, తండ్రి డ్రీమ్‌ని నిజం చేయాలని ఓ కొడుకు చేసిన సాహసం ‘సైరా నరసింహారెడ్డి’. ఇది సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరూ చెబుతున్న మాట. అందుకే ‘సైరా నరసింహారెడ్డి’ని చూడాలి.

ఒక్కసారి కాదు.. వందసార్లు..

ఒక్కసారి కాదు, ఒకటికి పదిసార్లు కాదు, వీలైతే వంద సార్లు ‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Narasimha Reddy Review) సినిమాని చూడాలి.

హిట్టు సినిమాలొస్తుంటాయ్‌. చరిత్ర సృష్టించే సినిమాలొస్తుంటాయ్‌. కానీ, ఎప్పటికప్పుడు మెగాస్టార్‌ ఈజ్‌ సమ్‌థింగ్‌ స్పెషల్‌. అందులోనూ ఈ ‘సైరా నరసింహారెడ్డి’ ఇంకా స్పెషల్‌.

Related Post

ileana, raviteja

ప్రివ్యూ: అమర్‌ అక్బర్‌ ఆంటోనీ

Posted by - November 15, 2018 0
ఫ్లాప్‌ వచ్చిందని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే, కెరీర్‌లో హిట్టూ ఫ్లాపూ ఎవరికైనా సహజమే. ఒకప్పుడు అగ్రహీరోలు అతనితో సినిమాల కోసం పరితపించేవారు. అలాంటిది, వరుస…

ట్రాలింగ్‌: సోషల్‌ మీడియా ఇందుకేనా?

Posted by - January 15, 2019 0
ఇదివరకటి రోజుల్లో సినిమా పోస్టర్లపై ‘పేడ’ కొట్టి, తమ వ్యతిరేకతను చాటుకునేవారు ‘హేటర్స్‌’. ట్రెండ్‌ మారిపోయింది. సినిమాలపైనా, రాజకీయాలపైనా జుగుప్సాకరమైన రీతిలో వ్యవహరించడానికి సోషల్‌ మీడియాని (Social…

‘నోటా’ ప్రివ్యూ: నయా సూపర్‌ స్టార్‌ విజయ్

Posted by - October 4, 2018 0
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త సూపర్‌ స్టార్‌ అవతరించాడు. అతని పేరు విజయ్‌ దేవరకొండ. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో హీరో ఫ్రెండ్‌ క్యారెక్టర్‌లో కన్పించిన విజయ్‌ దేవరకొండ,…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *