పిఎస్‌పికె28: పవన్‌తో హరీష్‌.. అప్‌డేట్‌ అదిరిపోలా.!

218 0

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌లోని (Power Star Pawan Kalyan) అసలు సిసలు పవర్‌ని (PSPK28) ‘గబ్బర్‌ సింగ్‌’ (Gabbar Singh) సినిమాలో చూపించిన (PSPK28 Pawan Kalyan Harish Shankar) దర్శకుడు హరీష్‌ శంకర్‌ (Harish Shankar), ‘ఆ స్థాయి వేరు.. ఆయన స్థానం వేరు’ అని పదే పదే చెబుతుంటాడు.

పవన్‌ కళ్యాణ్‌కి కోట్లాదిమంది అభిమానులుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. అందులో కొందరు భక్తులు కూడా వుంటారు. ఆ భక్తుల లిస్ట్‌లో ఖచ్చితంగా హరీష్‌ శంకర్‌ పేరుంటుంది. ఇక్కడ భక్తి.. అంటే అమితమైన అభిమానం.. ఆ అభిమానానికి కొల్లబద్ద దొరకడం అసాధ్యం.

నిజానికి ‘గబ్బర్‌ సింగ్‌’ తర్వాత మరోమారు హరీష్‌ శంకర్‌, పవన్‌ కళ్యాణ్‌ని డైరెక్ట్‌ చేయడానికి చాలా టైమే పట్టింది. మధ్యలో ‘గబ్బర్‌ సింగ్‌’ సీక్వెల్‌ చర్చ వచ్చినప్పుడు, ‘నాలాంటి భక్తులెందరో వున్నారు.. నాలాంటి ఇంకొకరికి ఆ దేవుడు అవకాశం కల్పిస్తున్నందుకు ఆనందిస్తాను తప్ప.. ఎప్పుడూ నాకే ఆ అవకాశం రావాలని కోరుకోను..’ అని చెప్పాడు హరీష్‌ శంకర్‌.

అయితే, పవన్‌ కళ్యాణ్‌ ఇంకోసారి హరీష్‌ శంకర్‌కి పిలిచి అవకాశమిచ్చాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాని నిర్మించబోతోంది. ‘పిఎస్‌పికె28’ అప్‌డేట్‌ రాగానే, పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు, తమ అభిమాన హీరోనే కాదు, అభిమాన దర్శకుడు హరీష్‌ శంకర్‌ని కూడా దేవుడ్ని చేసేశారు.

‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత రాజకీయాల్లో బిజీ అవడంతో, సినిమాలకు టైమ్‌ కేటాయించలేకపోయిన పవన్‌ కళ్యాణ్‌, చిన్న బ్రేక్‌ తర్వాత.. తిరిగి సినిమాల్లో బిజీ అవుతున్నారు. ఇప్పటికే ఓ సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళిపోయింది. అదే ‘పింక్‌’ రీమేక్‌. వేణు శ్రీరామ్‌ దర్శకుడు. దిల్‌ రాజు, బోనీ కపూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మరోపక్క క్రిష్‌ దర్శకత్వంలో సినిమా ఇటీవలే లాంఛనంగా ప్రారంభమయ్యింది. త్వరలో అదీ సెట్స్‌ మీదకు వెళ్ళనుంది. ఈలోగా మైత్రీ మూవీ మేకర్స్‌ – హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా సినిమా ప్రకటన విడుదలయ్యింది.

నెక్స్‌ట్‌ ఏంటి.? దర్శకులు, నిర్మాతలూ చాలామందే వున్న దరిమిలా.. పవన్‌ నుంచి ఇలాంటి ‘మైండ్‌ బ్లోయింగ్‌’ అనౌన్స్‌మెంట్స్‌ ఇంకా ఇంకా రావాలని అభిమానులు ఆశించకుండా వుంటారా.?

Related Post

pawan kalyan, vijay deverakonda, taxiwaala

పవన్‌ సారీ.. ‘ట్యాక్సీవాలా’ సవారీ.!

Posted by - November 20, 2018 0
సినిమాల్లో తిరిగి నటించాలన్న ఆలోచన ప్రస్తుతానికి తనకు లేదంటూ సినీ నటుడు, జనసేన పార్టీ (Jana Sena Party) అధినేత పవన్‌కళ్యాణ్‌ (Pawan Kalyan) ప్రకటించేశారు. రాజకీయాల్లో…
ys jagan pawan kalyan

జగన్‌పై దాడిని ఖండించిన పవన్‌

Posted by - October 25, 2018 0
విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSR Congress Party) అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై (YS Jaganmohan Reddy) జరిగిన దాడిని జనసేన పార్టీ అధినేత, సినీ…

నౌ ఆర్‌ నెవర్‌: వైఎస్‌ జగన్‌కి సై అంటారా.?

Posted by - March 19, 2019 0
తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి (YS Rajasekhar Reddy) అండదండలతో రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి (YS Jaganmohan Reddy)రాజకీయం (YS Jagan YSRCP) రుచి…

అతడు, ఆమె.. దారి తప్పుతోన్న ‘మీ..టూ..’

Posted by - October 22, 2018 0
అతడు నన్ను లైంగికంగా వేధించాడంటూ కొన్నేళ్ళ తర్వాత ఒకప్పటి వేధింపుల ప్రక్రియ గురించి చెప్పి, పాపులర్‌ అవడమే ‘మీ..టూ..’ అవుతుందా? ఈ ప్రశ్న ఇప్పుడు చాలామందిని వేధిస్తోంది.…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *