Radhika Apte: నిందలేస్తే సింపతీ వస్తుందా రాధికా.!?
Radhika Apte
Radhika Apte On Tollywood.. రాధికా ఆప్టే తెలుసు కదా.? తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేస్తే, అందులో ఒకటి పెద్ద హిట్.! ఇంకోటి ఫ్లాప్.!
ఆ సినిమాలేంటి.? ఆ కథేంటి.? అన్నది వేరే చర్చ. అసలు విషయమేంటంటే, తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడమెలాగో రాధికా ఆప్టేని చూసి నేర్చుకోవాలెవరైనా.!
ఛత్.. నేర్చుకోకూడదు ఇలాంటివి.! అత్యంత దారుణమైన వ్యవహారమది. కృతజ్ఞతాభావం లేకపోవడమంటారు దాన్ని.!
Radhika Apte On Tollywood.. తెలుగు సినీ పరిశ్రమపై ఎందుకింత కసి.?
తెలుగు సినీ పరిశ్రమపై రాధికా ఆప్టే ఆరోపణలు చేయడం ఇదే కొత్త కాదు. ఓ హీరో తనను అవమానించాడనీ, దక్షిణాది సినీ పరిశ్రమలో తాను అవమానాలు ఎదుర్కొన్నానని గతంలో సంచలన ఆరోపణలు చేసింది రాధికా ఆప్టే.
ఆ హీరో ఎవరు.? అన్న విషయమై అప్పట్లోనే క్లారిటీ వచ్చేసింది. అతనెవరో కాదు, నందమూరి బాలకృష్ణ.

ఓ సినిమా షూటింగ్ సందర్భంగా ఓ పెద్ద హీరో, దేవుడిలా ఫీలయిపోయాడననీ, తనను చిన్నచూపు చూశాడనీ రాధికా ఆప్టే ఆరోపించింది.
ఆరోపణలు చేసింది నందమూరి బాలకృష్ణ మీద కదా.. అందుకే, తెలుగు మీడియా లైట్ తీసుకుంది. అదే, ఇంకో హీరో ఎవరి మీదైనా.. అదీ మెగా హీరోలెవరి మీదైనా చేస్తే, ఆ లెక్క వేరేలా వుండేది.
నిలకడలేనితనం..
అయితే, ఇక్కడ రాధికా ఆప్టే నిలకడలేనితనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె చేసే ఆరోపణలకు విలువ, విశ్వసనీయత అనేవి వుండవ్.
సంచలన వ్యాఖ్యలు చేయడం, వివాదాస్పదంగా వార్తల్లోకెక్కడం రాధికా ఆప్టేకి కొత్తేమీ కాదు. ఆ కోవలోనే ఇంకోసారి, తెలుగు సినీ పరిశ్రమపై నోరు పారేసుకుంది రాధిక.
Also Read: Samyuktha Menon: గుర్రమెక్కావ్.! ఏంటి సంగతి.?
తెలుగు సినీ పరిశ్రమలో పురుషాధిక్యం చాలా చాలా ఎక్కువని రాధిక ఆరోపించింది. ఇందులో వింతేముంది.? హిందీ సినీ పరిశ్రమలో అయినా అంతే కదా.?
అలాగని, హీరోయిన్లు స్టార్లుగా ఎదగలేదా.? కొందరు హీరోయిన్లు, హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్లు అందుకున్న రోజులున్నాయ్.!
ఫిమేల్ సెంట్రిక్ మూవీస్, స్టార్ హీరోల సినిమాల కంటే ఎక్కువ వసూలు చేసిన సందర్భాలు చాలానే.! బాలీవుడ్ అయినా, తెలుగు సినీ పరిశ్రమ అయినా.. ఇంకోటైనా.. అన్ని చోట్లా ఇదంతా అనుభవమే అందరికీ.!
తాప్సీ కూాడా అంతే..
అన్నట్టు, రాధికా ఆప్టే మాత్రమే కాదు, తాప్సీ పన్ను (Taapsee Pannu) కూడా తరచూ సౌత్ సినిమాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తుంటుంది.
సోకాల్డ్ హిందీ మీడియా కెలికి మరీ, సెలబ్రిటీలతో సౌత్ సినిమా మీద విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తుంటుందన్నది నిర్వివాదాంశం.
వాళ్ళు అడగడం.. వీళ్ళు ఓవరాక్షన్ చేయడం.. ఇదంతా ఓ నిరంతర ప్రక్రియ అంతే.!