రాహుల్‌ విన్నర్‌.. శ్రీముఖి లూజర్‌.!

113 0

‘ఇప్పటిదాకా జరిగిన టాస్క్‌లలో ఒక్కటైనా సరిగ్గా ఆడావా.?’ అని పదే పదే శ్రీముఖి, రాహుల్‌ సిప్లిగంజ్‌ని (Rahul Sipligunj Shocks Sree Mukhi) ఎగతాళి చేయడం చూశాం.

కానీ, బ్యాక్‌ టు బ్యాక్‌ రెండు టాస్క్‌లు రాహుల్‌ సిప్లిగంజ్‌ గెలిచాడు తాజాగా. అదే సమయంలో శ్రీముఖి రెండు టాస్క్‌లు ఓడిపోయింది. అందులో ఒకటి రాహుల్‌ సిప్లిగంజ్‌ చేతిలో శ్రీముఖి ఓడిపోవడం గమనార్హం.

టిక్కెట్‌ టు ఫినాలే రేస్‌కి సంబంధించిన టాస్క్‌లలో శ్రీముఖి పూర్తిగా చేతులెత్తేసింది. అదే సమయంలో, రాహుల్‌ సిప్లిగంజ్‌ విన్నర్‌గా నిలిచి టిక్కెట్‌ టు ఫినాలే దక్కించుకున్నాడు. తన మీద రాహుల్‌ సిప్లిగంజ్‌ గెలవడాన్ని శ్రీముఖి జీర్ణించుకోలేకపోయింది.

‘అదృష్టం నాకెప్పుడూ కలిసిరాదు.. నేనెప్పుడూ కష్టపడాల్సిందే..’ అంటూ రాహుల్‌ గెలుపుని చులకన చేస్తూ, బాబా భాస్కర్‌ వద్ద కామెంట్‌ చేసింది శ్రీముఖి. డామినోస్‌ని వరుసగా నిలబెట్టడం అనేది రాహుల్‌, శ్రీముఖిల మధ్య టాస్క్‌. గాలి కారణంగా శ్రీముఖి డామినోస్‌ ఒకటికి పదిసార్లు పడిపోయాయి.

రాహుల్‌కి గాలి సమస్య రాలేదంటే, అంత పకడ్బందీగా రాహుల్‌ వాటిని ప్లేస్‌ చేశాడు. శ్రీముఖి మాత్రం, ఒకదానితో ఒకటి చాలా తక్కువ గ్యాప్‌లో పెట్టడంతో ఒకటి పడగానే, ఆ వెంటనే పక్కనున్నవి కూడా పడిపోయాయి.

‘గాలి’ అనేది చాలా చిన్న విషయమిక్కడ. అన్నట్టు, టాస్క్‌ పూర్తయ్యాక.. ‘ఫెయిర్‌ గేమ్‌ ఆడినందుకు’ అంటూ శ్రీముఖిని రాహుల్‌ సిప్లిగంజ్‌ (Rahul Sipligunj Shocks Sree Mukhi) అభినందించాడు కూడా.

కానీ, శ్రీముఖి మాత్రం రాహుల్‌ సిప్లిగంజ్‌ మీద తనకున్న వ్యతిరేకతను అసహనం రూపంలో చాటుకుంది.

Related Post

బిగ్‌ సస్పెన్స్‌: పునర్నవీ ఎందుకిలా చేశావ్‌.?

Posted by - August 5, 2019 0
మొన్న బాబా భాస్కర్‌, ఇప్పుడు పునర్నవి.. (Punarnavi Bhupalam Bigg Boss) నామినేషన్స్‌ పర్వం సందర్బంగా ఒకర్ని ఒకరు డామినేట్‌ చేసుకున్నారు. ఒకరు మంచి మార్కులు కొట్టేయడానికి…
Sree Mukhi Big Winner

బిగ్‌ పాలిటిక్స్‌: శ్రీముఖికి ఎదురే లేదా.?

Posted by - August 24, 2019 0
బిగ్‌ హోస్ట్‌ (Bigg Boss 3 Telugu) నాగార్జున (Akkineni Nagarjuna) నుంచి ఫుల్‌ సపోర్ట్‌.. కంటెస్టెంట్స్‌ నుంచి కూడా అదే తరహా సపోర్ట్‌ని రాబట్టుకోగల నైపుణ్యం..…
Himaja Rahul Sipligunj

హిమజకు అతనిపై ఎందుకంత కసి.?

Posted by - August 19, 2019 0
మొదట్లో సైలెంట్‌గా చాలా కూల్‌గా, అంతకు మించి బుద్ధిమంతురాలిగా కనిపించిన హిమజ (Himaja), రియల్‌ కలర్‌ బయట పడింది పునర్నవి, అలీ రెజాలకు (Ali Reza) బిగ్‌బాస్‌…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *