Rahul Sipligunj Vs Sree Mukhi

న్యూ గేమ్‌: ‘బిగ్‌’ రేసులోకి దూసుకొచ్చిన రాహుల్‌!

168 0

అస్సలేమాత్రం గేమ్‌ మీద సీరియస్‌నెస్‌ లేదన్న విమర్శల్ని రాహుల్‌ సిప్లిగంజ్‌ బిగ్‌బాస్‌ మూడో సీజన్‌ మొదటి రోజు నుంచీ ఎదుర్కొంటూనే వున్నాడు. టాప్‌ కంటెండర్‌ శ్రీముఖితో రాహుల్‌కి (Rahul Sipligunj Vs Sree Mukhi) ముందు నుంచీ స్నేహం వుంది.

కానీ, ఆ స్నేహం బిగ్‌హౌస్‌లో బద్దలయ్యింది. శ్రీముఖి.. రాహుల్.. ఇద్దరూ ఒకరి మీద ఒకరు నోరు పారేసుకుంటున్నారు. శ్రీముఖి పైకి కన్పించడంలేదు.. రాహుల్‌ పైకి కన్పిస్తున్నాడు.. అదే తేడా.

ఓ సందర్భంలో ‘వాళ్ళిద్దరూ ఒకటేనేమో.. మనమే వెర్రి వెంగళప్పలం..’ అని పునర్నవి భూపాలం చెప్పేసింది కూడా. అదే నిజమయ్యేలా కన్పిస్తోంది. శ్రీముఖి – రాహుల్‌ సిప్లిగంజ్‌ మధ్య వైరం కొనసాగుతున్నా.. దాన్ని చల్లార్చేందుకు హోస్ట్‌ నాగార్జున చేస్తున్న ప్రయత్నాలు ఆశ్చర్యంగా అన్పిస్తున్నాయి.

రాహుల్‌కి గతంలో క్లాస్‌ తీసుకున్న నాగ్‌, ఆ తర్వాత శ్రీముఖికి కూడా ఓ సారి క్లాస్‌ తీసుకున్నాడు. ఇద్దర్నీ కలిపేందుకు నాగ్‌ చేస్తున్న ప్రయత్నాల్లో ఏదో ‘స్రిప్టెడ్‌’ కలర్‌ కన్పిస్తోందన్నది చాలామంది చెబుతున్న మాట. ఆ సంగతి పక్కన పెడితే, రాహుల్‌.. రేసులోకి దూసుకొచ్చాడు.

టాప్‌ ఫైవ్‌లో రాహుల్‌ ప్లేస్‌ ఖాయమైనట్లే కన్పిస్తోంది. టైటిల్‌ వేట కూడా రాహుల్‌ – శ్రీముఖి మధ్య జరుగుతుందనీ.. చివరికి ఆ టైటిల్‌ శ్రీముఖిని వరించవచ్చనీ కొందరు ప్రిడిక్షన్‌ చేస్తున్నారు. మరోపక్క శివజ్యోతి – అలీ మధ్య కూడా టఫ్‌ ఫైట్‌ రానున్న రోజుల్లో జరగొచ్చట.

బాబా భాస్కర్‌ – వరుణ్‌ మధ్య కూడా రానున్న రోజుల్లో హీట్‌ పెంచే హ్యాపెనింగ్స్‌ వుంటాయని బిగ్‌బాస్‌ ఫాలోవర్స్‌ అంచనా వేస్తుండడం గమనార్హం. ఏదిఏమైనా, ఓసారి ఫేక్‌ ఎలిమినేషన్‌ ద్వారా హౌస్‌ నుంచి కొంచెం బయటకు వచ్చి, మిగతా హౌస్‌ మేట్స్‌ మనసులో ఏముందో తెలుసుకున్న రాహుల్‌, అక్కడినుంచి పూర్తిగా గేమ్‌ ప్లాన్‌ మార్చినట్లే కన్పిస్తోంది.

స్క్రిప్ట్‌ అంత పెర్‌ఫెక్ట్‌గా బిగ్‌బాస్‌ రాశాడు గనుక.. రాహుల్‌ నుంచీ అలాగే శ్రీముఖి (Rahul Sipligunj Vs Sree Mukhi) నుంచీ ఇంట్రెస్టింగ్‌ హేపెనింగ్స్‌ ముందు ముందు చూడబోతున్నామన్నమాట.

Related Post

Punarnavi Rahul Sreemukhi

శ్రీముఖి, రాహుల్‌, పునర్నవి.. ఎవరు ఫేక్‌.?

Posted by - September 21, 2019 0
రెండు మూడు వారాల క్రితమే ఎలిమినేట్‌ అవ్వాల్సిన హిమజ ఎందుకు ఇంకా హౌస్‌లోనే ఎందుకు వుంటోంది.? రియల్‌ లైఫ్‌లో మంచి ఫ్రెండ్స్‌ అయిన శ్రీముఖి – రాహుల్‌…
king nagarjuna bigg boss 3 telugu

బిగ్‌బాస్‌-3: ‘కింగ్‌’ నాగార్జున దమ్మెంత.?

Posted by - June 30, 2019 0
టాలీవుడ్‌ మన్మథుడు (Manmadhudu), కింగ్‌ నాగార్జునకి (King Nagarjuna) వెండితెరపై అద్భుతాలు చేయడమే కాదు, బుల్లితెరపై సంచలనాలు సృష్టించడమూ (Bigg Boss Telugu Season 3) తెలుసు.…
Punarnavi Lady Monarch

పునర్నవి అంటే లేడీ మోనార్క్‌.. అంతేనా.?

Posted by - September 20, 2019 0
పునర్నవికి (Punarnavi Bhupalam) ఆ ఆటిట్యూడే శాపమా.? బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో హాట్‌ కంటెస్టెంట్‌గా పునర్నవి ఆల్రెడీ ఓ స్టాంప్‌ వేయించేసుకుంది. హాట్‌ అంటే గ్లామర్‌ (Punarnavi…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *