జగదేక వీరుడితో అతిలోక సుందరి.! కండిషన్స్ అప్లయ్.!
Janhvi Kapoor Ramcharan
Ramcharan Janhvi Kapoor RCJK.. ఎప్పుడో అనుకున్నారు.. కానీ, ఇన్నాళ్ళకి కలవబోతున్నారు.! అదేనండీ, తెరపై జంటగా కలిసి కనిపించబోతున్నారు.!
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, జగదేక వీరుడు చిరంజీవి తనయుడు రామ్ చరణ్.. వెండితెరపై జంటగా కనిపించబోతున్నారన్నది తాజా ఖబర్.
ఎవరో చెబితే ఇది ఉత్త గాసిప్పే అవుతుందేమో.! కానీ, స్వయంగా జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్, ఈ విషయాన్ని ధృవీకరించారు.
Ramcharan Janhvi Kapoor RCJK.. నిజమయిన గాసిప్పు.!
చాలాకాలంగా ఈ కాంబినేషన్ గురించి గాసిప్స్ వినిపిస్తూ వచ్చాయి. ఎట్టకేలకు ఆ గాసిప్స్ నిజమవుతున్నాయ్.!
‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించబోతున్నారు.
త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. ప్రస్తుతానికైతే రామ్ చరణ్, ‘గేమ్ ఛేంజర్’ సినిమా పనుల్లో బిజీగా వున్నాడు. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది.
తెలుగులో తెరంగేట్రమిలా..
మరోపక్క, జాన్వీ కపూర్ తెలుగులో తన తొలి సినిమాని జూనియర్ ఎన్టీయార్‌తో చేస్తోంది. అదే, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘దేవర’.!

చాలాకాలం క్రితమే రామ్ చరణ్ – జాన్వీ కపూర్ జంటగా సినిమా తెరకెక్కించాలని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ప్రయత్నించారుగానీ, కుదర్లేదు.
ఆ మాటకొస్తే, పలువురు దర్శకులు, పలువురు నిర్మాతలు జాన్వీ కపూర్‌ని తెలుగులోకి తీసుకొచ్చేందుకు చాలా చాలా ప్రయత్నాలు చేశారు.
అప్పుడు కుదరలేదుగానీ..
జాన్వీ కపూర్ తెరంగేట్రమే తెలుగు తెరపై నుంచి జరగాలని అప్పట్లో శ్రీదేవి అనుకున్నా, అది కుదరలేదు.
Also Read: ఆకాశమంత ప్రేమ.! ఒక్క రోజు సరిపోద్దా.?
ఎలాగైతేనేం, ఇన్నాళ్ళకి జాన్వీ కపూర్ తెలుగు తెరపైకి వస్తుండడం.. అదీ బ్యాక్ టు బ్యాక్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో నటిస్తుండడం విశేషమే కదా.!
శ్రీదేవి జీవించి వుంటే, తన కుమార్తె జాన్వీ కపూర్‌ని తెలుగులో ఏ రేంజ్‌లో ప్రమోట్ చేసి వుండేదో కదా.!
ఎలాగైతేనేం.. జూనియర్ జగదేక వీరుడితో, జూనియర్ అతిలోక సుందరి జతకట్టబోతోందన్నమాట.! ఈ కాంబినేషన్ తెలుగు తెరపై సమ్‌థింగ్ వెరీ వెరీ స్పెషల్.. అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!