గ్లామరు.. గ్రామరు.! ఈ రాశి ఆ రాశి కాదు.. గానీ.!
Rashi Singh
Rashi Singh Tollywood Actress.. రాశి అనగానే, అందాల భామ రాశీ ఖన్నా గుర్తుకు రావడం సబబే.! ప్చ్.. ఈ మధ్య రాశి ఖన్నా తెలుగు సినిమాల్లో కనిపించడం తగ్గించేసింది.
అదే సమయంలో ఇంకో రాశి, తెలుగు సినిమాల్లో జోరు పెంచింది. ఈమె పూర్తి పేరు రాశి సింగ్.! ఎడా పెడా సినిమాలు చేసేస్తోంది.

స్టార్ డమ్ అయితే ఇంకా ఏమీ రాలేదుగానీ, చిన్న సినిమాల్లో ఈ రాశి సింగ్ విరివిగానే కనిపిస్తోంది. గ్లామరస్ టచ్‌తో కూడిన సినిమాలే కాదు, పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి మెప్పిస్తోంది రాశి సింగ్.
Rashi Singh Tollywood Actress.. సోషల్ గ్లామర్..
సినిమాల సంగతి పక్కన పెడితే, సోషల్ మీడియాలో రాశి సింగ్ చాలా చాలా యాక్టివ్‌గా కనిపిస్తూ.. బోల్డంతమంది ఫాలోవర్స్‌ని సంపాదించుకుంటోంది.
ఏమో, లక్కు ఎప్పుడెవర్ని ఎలా పలకరిస్తుందో చెప్పలేం కదా.! సరైన సినిమా ఒక్కటి.. సరైన సక్సెస్ ఒక్కటి.. తగిలితే, రాశి సింగ్ దశ తిరిగిపోతుందన్నది నిర్వివాదాంశం.
సినిమాల్లో ఎలాంటి పాత్రలకైనా ‘నో’ చెప్పడంలేదట ఈ అందాల రాశి.! దాంతో, అవకాశాలు బాగానే వచ్చిపడుతున్నాయ్.
Also Read: ఆ విషయంలో దీపికని మెచ్చుకోవాల్సిందే.!
మొన్నీమధ్యనే సుహాస్ హీరోగా వచ్చిన ‘ప్రసన్నవదనం’ సినిమాలో పోలీస్ అధికారిగా కీలక పాత్రలో కనిపించింది. నెగెటివ్ షేడ్స్ వున్న పాత్రలో బాగానే చేసింది రాశి సింగ్.
‘భూతద్దం భాస్కర్ నారాయణ’, ‘ప్రేమ్ కుమార్’.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాల్లోనే రాశి ఖన్నా నటించేసింది.