జుట్టూడితే కష్టమే.! నెత్తి మీద వ్యవసాయం దండగే.!
Reason Behind Hair Fall.. హెయిర్ ఫాల్.. అదేనండీ, జుట్టు ఊడిపోవడం.! నెత్తి మీద జుట్టు ఊడిపోతుంటే చాలా చాలా బెంగగా వుంటుంది.! ఆడ, మగ.. ఎవరికైనా ఈ సమస్య చాలా చాలా తీవ్రమైనది.!
నిజానికి, జుట్టు రాలిపోవడం అనేది ఎలాంటి ప్రత్యేక కారణాలు లేకుండా కూడా జరగొచ్చునని కొందరు వైద్య నిపుణులు చెబుతుంటారు.
మానసిక సమస్యలతో జుట్టు రాలిపోవచ్చు.! కొందరికి శారీరక అనారోగ్య సమస్యల వల్ల కూడా జుట్టు రాలిపోవచ్చు.!
ఇప్పుడంతా పొల్యూషన్ ప్రపంచమే.! సో, ఆ పొల్యూషన్ కూడా జుట్టు ఊడిపోవడానికి కారణం కావొచ్చునని చెబుతుంటారు వైద్య నిపుణులు.
జుట్టు ఊడిపోతుందనే బెంగ కారణంగా, మరింత జుట్టు రాలిపోవడం అనేది జరుగుతుందట. ఇది మరీ విచిత్రంగా వుంది కదా.!
వైద్య నిపుణుల్ని సంప్రదిస్తే సరి..
చర్మ సంబంధ సమస్యలకు సంబంధించి ప్రత్యేకంగా వైద్య నిపుణులుంటారు. వారిని సంప్రదిస్తే, అసలు జుట్టు ఎందుకు రాలుతుందన్న విషయమై స్పష్టత వస్తుంది.
ముందంటూ వాడుతున్న షాంపూల్లో గాఢత ఎంత.? అన్నది ఆయా షాంపూల మీద రాసి వుండే విషయాల్ని పూర్తిగా చదువుకోవడం, ఆ తర్వాతే వాటిని వాడటం అనేది ఉత్తమం.
జుట్టు రాలడాన్ని అరికడుతుందంటూ రకరకాల షాంపూలు వాడేస్తే, అది మరింతగా జుట్టు రాలడానికి కారణమవ్వొచ్చు.
షాంపూలే కాదు, హెయిర్ ఆయిల్స్ విషయంలోనూ జాగ్రత్తగా వుండకపోతే, జుట్టు రాలిపోవడాన్ని చూసి బాధపడాల్సిందే.
Reason Behind Hair Fall.. చిట్కాలు కొంప ముంచుతాయ్.!
మార్కెట్‌లో దొరికే హెయిర్ ఆయిల్స్, హెయిర్ కండిషనింగ్ షాంపూస్.. ఇవే కాదండోయ్, ‘చిట్కాలు’ కూడా జుట్టుకి శాపంగా మారొచ్చు.
ఫలానా ఆకుని అలా చేసి, ఇలా చేసి.. ఇంకోటేదో కలిపేసి.. తద్వారా వచ్చిన పేస్టుని తలకి పట్టించేస్తే, జుట్టు ఒత్తుగా పెరుగుతుందని యూ ట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా ఎవరైనా చెబితే, గుడ్డిగా నమ్మేయొద్దు.
చెప్పుకుంటూ పోతే, జుట్టు పురాణం పెద్దదే.! ఆరోగ్యంగా వుండడం ముఖ్యం.! ఆనందంగా వుండటం ఇంకా ముఖ్యం.
పొల్యూషన్‌ని ఎలాగూ తప్పించుకోలేం.. పొల్యూషన్‌లోకి వెళ్ళేటప్పుడు, కాస్త జుట్టుని కవర్ చేసుకోవడం ఉత్తమం.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా..
షాంపూలు వాడేటప్పుడూ, హెయిర్ ఆయిల్స్ వాడేటప్పుడూ.. అప్రమత్తంగా వుంటే, జుట్టుని కాపాడుకోవచ్చు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా జుట్టు ఊడిపోవచ్చు.
మగాళ్ళకి వంశపారంపర్యంగా వచ్చే బట్టతల.. తెలుసు కదా.! సో, జుట్టు రాలిపోవడాన్ని నివారించడం అనేది అంత తేలికైన విషయం కాదు.!
రకరకాల వైద్య చికిత్సలు చేయించేసుకుని, నెత్తి మీద జుట్టుని పండించాలనుకుంటే, సైడ్ ఎఫెక్ట్స్ తప్పకపోవచ్చు సుమీ.!
సోషల్ మీడియాలో ఎవరో ఏదో కూశారనో.. సెలబ్రిటీలు ఫలానా ప్రోడక్టుకి బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారనో.. ఆయా ప్రయోగాలు చేశారో.. వున్న ఆ కాస్త జుట్టు కూడా ఊడిపోవచ్చు.!
Also Read: తూనీగా.! తప్పు కదా.! అడ్డు తప్పుకో.!
జర జాగ్రత్త.! జుట్టు ఊడిపోవడమంటూ జరిగితే, మళ్ళీ మొలకెత్తడం అంత తేలిక కాదు.! ఎవడి జుట్టుకి వాడే బాధ్యుడు సుమీ.!