Chitralahari Review

రివ్యూ అండ్‌ రేటింగ్‌: చిత్రలహరి

433 0

సినిమా టైటిల్‌: చిత్రలహరి Chitralahari Review Rating

నటీనటులు: సాయి ధరమ్‌ తేజ్‌, కళ్యాణి ప్రియదర్శన్‌, నివేదా పేతురాజ్‌, సునీల్‌, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌ తదితరులు.

సినిమాటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌

ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌

రచన, దర్శకత్వం: కిషోర్‌ తిరుమల

నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్‌

నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై రవి శంకర్‌, మోహన్‌ (సివిఎం)

విడుదల తేదీ: 12 ఏప్రిల్‌ 2019

రేటింగ్‌: 2.75/5

ముందుగా.. Chitralahari Review Rating

‘సుప్రీం’ తర్వాత సక్సెస్‌ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే వున్నాడు మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌. ఈ క్రమంలో వరుస ఫ్లాపుల్ని ఎదుర్కొన్నాడు. ‘సుప్రీం’ సినిమాతో అందుకున్న స్టార్‌ డమ్‌ ఆ తర్వాత తగ్గుతూ వచ్చిందే తప్ప, ఏ సినిమా కూడా అతన్ని మళ్ళీ సుప్రీంని మించిన లెవల్‌లో నిలబెట్టలేకపోయింది.

ఈ నేపథ్యంలో ‘చిత్రలహరి’ (Chitralahari Review Rating) అంటూ ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు సాయి ధరమ్‌ తేజ్‌. ఇద్దరు హీరోయిన్లు, సక్సెస్‌ కోసం పరితపించే హీరో.. సినిమాలో కూడా! ట్రైలర్‌ అదరగొట్టేసింది, ప్రోమోస్‌ సినిమాపై అంచనాల్ని పెంచాయి.

ఇంతకీ సినిమా ఆశించిన రీతిలో సాయిధరమ్‌ తేజ్‌కి సక్సెస్‌ ఇచ్చిందా? అన్నట్టు ఈ సినిమా కోసం తన పేరులోని ‘ధరమ్‌’ని పక్కన పెట్టాడండోయ్‌ సాయి ధరమ్‌ తేజ్‌. ఈ సినిమాకి జస్ట్‌ సాయి తేజ్‌గానే టైటిల్‌ కార్డ్స్‌లో తన పేరుని వేసుకున్నాడు.

కథేంటి.?

విజయం కోసం పరితపించే యువకుడు విజయ్‌ కృష్ణ (సాయిధరమ్‌ తేజ్‌ Sai Dharam Tej). ఎంత టాలెంట్‌ వుంటే ఏం, సక్సెస్‌ మాత్రం ఆయనకు ఆమడ దూరం పారిపోతుంటుంది. వున్న ఒకే ఒక్క హోప్‌ అయిన లహరి (కళ్యాణి ప్రియదర్శిని (Kalyani Priyadarshan) కూడా, చిన్న నాటి స్నేహితురాలైన స్వేచ్ఛ (నివేదా పేతురాజ్‌ Nivetha Pethuraj) కారణంగా విజయ్‌ కృష్ణకి దూరమవుతుంది.

పేరులో వున్న విజయం జీవితంలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తోన్న విజయ్‌ కృష్ణకి, స్వేచ్ఛ కారణంగా కొత్త సమస్యలొస్తాయి లహరి విషయంలో. ఇంతకీ స్వేచ్ఛ, లహరి మధ్య నలిగిపోయే విజయ్‌ కృష్ణ తన జీవితంలోకి విజయాన్ని తెచ్చుకున్నాడా? ఈ క్రమంలో స్వేచ్ఛ అతనికి ఉపయోగపడిందా? లహరి సంగతేంటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమాని చూడాల్సిందే.

ఎవరెలా చేశారు.? Chitralahari Review Rating

సాయితేజ్‌గా పేరు మార్చుకున్న సాయిధరమ్‌ తేజ్‌ నటనలో చాలా చాలా పరిణతి చూపించాడు. గత చిత్రాలకు భిన్నంగా ఓ కొత్త సాయి ధరమ్‌ తేజ్‌ని ఈ సినిమాలో చూస్తాం. భావోద్వేగాల పరంగా రాణించాడు. పేరులోని విజయం, జీవితంలో లేని ఓ యువకుడి పాత్రలో సాయిధరమ్‌ తేజ్‌ ఒదిగిపోయిన తీరుకి ప్రశంసలు దక్కుతాయి.

నటుడిగా సాయిధరమ్‌ తేజ్‌ ఈ సినిమాతో ఓ మెట్టు పైకెక్కాడని మాత్రం నిస్సందేహంగా చెప్పొచ్చు. అయితే సాయి ధరమ్‌ తేజ్‌ తన ఫిజిక్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పాత్రకు గడ్డం మరీ అంత అవసరమా? అనిపిస్తుంది. గడ్డం ఇంకాస్త తక్కువగా వుంటే, ఎక్స్‌ప్రెషన్స్‌ ఇంకా బాగా ఎలివేట్‌ అయ్యేవేమో.

హీరోయిన్లలో నటన పరంగా కళ్యాణి ప్రియదర్శన్‌ ఎక్కువ స్కోర్‌ చేసింది మరో హీరోయిన్‌ నివేదా పేతురాజ్‌తో పోల్చితే. ఇద్దరూ సహజమైన అందంతో కన్పించారు. సునీల్‌, వెన్నెల కిషోర్‌ కామెడీతో ఆకట్టుకున్నారు. హీరో తండ్రి పాత్రలో పోసాని కృష్ణమురళి నటన బావుంది. బ్రహ్మాజీ, రావు రమేష్‌, జయప్రకాష్‌ తదితరులు తమ పాల్ర పరిధి మేర బాగా చేశారు.

టెక్నికల్‌ సపోర్ట్‌..

దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌, కార్తీక్‌ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ సినిమాకి మేజర్‌ ప్లస్‌ పాయింట్స్‌. పాటలు వినడానికీ, తెరపై చూడ్డానికీ బావున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బావుంది. ఎడిటింగ్‌ పరంగా అక్కడక్కడా చిన్న చిన్న లోపాలు కన్పిస్తాయి.

మాటలు బావున్నాయి, ఆలోచింపజేస్తాయి. నిర్మాణపు విలువలు చాలా బావున్నాయి. దర్శకుడు, టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్స్‌ నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందుకోగలిగాడు. టెక్నికల్‌గా సినిమా ఉన్నతంగా రూపొందింది.

ప్లస్సులు

సాయిధరమ్‌ తేజ్‌ నటన

కళ్యాణి ప్రియదర్శన్‌, నివేదా పేతురాజ్‌ పాత్రలు

సంగీతం, ఎంటర్‌టైన్‌మెంట్‌

మైనస్‌లు

రొటీన్‌గా అనిపించే కథ

అక్కడక్కడా వేగం తగ్గడం

విశ్లేషణ Chitralahari Review Rating

ఫెయిల్యూర్స్‌ని కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చేసుకున్న ఓ యువకుడు, సక్సెస్‌ కోసం పడే శ్రమ, ఈ క్రమంలో అతనికి ఎదురయ్యే సమస్యల చుట్టూ కథ రాసుకున్న దర్శకుడు, హీరోని గట్టెక్కించేందుకు ఓ ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ అయితే అల్లుకున్నాడుగానీ, దాన్ని కన్విన్సింగ్‌గా చూపించలేకపోయాడు. మాల చమక్కులు బావున్నాయిగానీ, కథని వేగంగా నడిపించడంలో మాత్రం తడబడ్డాడు.

గ్రాఫ్‌ పెరుగుతున్నట్టే పరిగి, ఒక్కసారిగా వేగం తగ్గిపోవడంతో ఆ గ్రాఫ్‌ కిందికి పడిపోతుంటుంది. కొన్ని చోట్ల భావోద్వేగాలు బాగా పండితే, అవసరమైన చోట్ల మాత్రం అవి తేలిపోతాయి. సెకెండాఫ్‌లో వేగం మరింత తగ్గుతుంది. నాటకీయ సన్నివేశాలు పెరిగిపోతాయి. తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ముందే ఊహించలగుతాడు. ఈ క్రమంలో ‘స్లో’గా సాగే కథనం ప్రేక్షకుడ్ని ఇంకాస్త ఇబ్బందిపెడుతుంది.

అయితే నటుడిగా సత్తా చాటేందుకు ఓ మంచి ప్రయత్నం చేసిన సాయి ధరమ్‌ తేజ్‌ని (Chitralahari Review Rating) అభినందించాల్సిందే. మరీ నేల విడిచి సాము చేయకుండా కథకు లోబడి చేసిన దర్శకుడి ప్రయత్నమూ అభినందించాల్సిందే. ఓవరాల్‌గా ఓ మంచి అనుభూతిని కొంతవరకు ఈ సినిమా కలిగించినా, ‘నెమ్మదిగా సాగే కథనం’ కొంత మైనస్‌ అనిపిస్తుంది.

ఫైనల్‌ టచ్‌ (Chitralahari Review Rating): వినోదం, సందేశం ఓకేగానీ..

Related Post

స్టైలిష్‌గా ‘అల..’.. అదరగొట్టేస్తోందిలా.!

Posted by - January 7, 2020 0
మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు, గురూజీ.. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ (Trivikram Srinivas) సినిమాల్లో ఏదో మ్యాజిక్‌ వుంటుంది. ఆ మ్యాజిక్‌ని ప్రతి సినిమాలోనూ (Ala Vaikunthapurramuloo Allu…
2 point 0 review

రివ్యూ అండ్‌ రేటింగ్‌: 2.0 విజువల్‌ ఫీస్ట్

Posted by - November 29, 2018 0
సినిమా టైటిల్‌: 2.0 నటీనటులు: రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌, అమీ జాక్సన్‌, సుధాన్షు పాండే, ఆదిల్‌ హుస్సేన్‌, కళాభవన్‌ షాజాన్‌, రియాజ్‌ ఖాన్‌ తదితరులు. సినిమాటోగ్రఫీ: నిరవ్‌ షా…

‘సాహో’ టీజర్‌కి రాజమౌళి రివ్యూ చూశారా.?

Posted by - June 13, 2019 0
ఎప్పుడెప్పుడా అని మొత్తం భారతీయ సినీ ప్రపంచం ఎదురు చూస్తున్నారు ‘సాహో’ (Saaho) కోసం. అందరి అంచనాల్ని మించేలా ‘సాహో’ (Saaho Teaser Rajamouli Review) టీజర్‌…

రివ్యూ: అరవింద సమేత ’వీర‘ రాఘవ

Posted by - October 11, 2018 0
సినిమా టైటిల్‌: అరవింద సమేత Aravinda Sametha Review నటీనటులు: జూ. ఎన్టీఆర్‌, పూజా హెగ్దే, జగపతిబాబు, సునీల్‌, నాగబాబు, ఈషా రెబ్బ, సుప్రియ పాఠక్‌, నవీన్‌ చంద్ర,…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *