రివ్యూ అండ్‌ రేటింగ్‌: మహర్షి

504 0

సినిమా టైటిల్‌: మహర్షి (Maharshi Review)

నటీనటులు: మహేష్‌బాబు, పూజా హెగ్దే, అల్లరి నరేష్‌, జగపతిబాబు, ప్రకాష్‌ రాజ్‌, రావు రమేష్‌, జయసుధ, వెన్నెల కిషోర్‌ తదితరులు.

సినిమాటోగ్రఫీ: కె.యు.మోహనన్‌

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌

ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె ఎల్‌

రచన: వంశీపైడిపల్లి, హరి, ఆహిషోర్‌ సాల్మన్‌

స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: వంశీ పైడిపల్లి

నిర్మాణం: శ్రీ వెంకటేశ్వరక్రియేషన్స్‌, వైజయంతీ మూవీస్‌, పీవీపీ

నిర్మాతలు: దిల్‌ రాజు, సి.అశ్వనీదత్‌, ప్రసాద్‌ వి.పొట్లూరి

విడుదల తేదీ: 09 మే 2019

రేటింగ్‌: 3/5

ముందుగా..  Maharshi Review

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు కెరీర్‌లో 25వ సినిమా కావడంతో, ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ‘ల్యాండ్‌ మార్క్‌’ అనదగ్గ స్థాయిలో ఈ సినిమాని వుంచేందుకు దర్శకుడు, నిర్మాతలు చాలా గట్టి ప్రయత్నాలే చేశారు.

హీరో మహేష్‌ సైతం, తన 25వ సినిమా ఎలా వుండాలన్నదానిపై ఖచ్చితమైన అభిప్రాయంతో దర్శకుడు వంశీ పైడిపల్లికి ఆ ఛాన్స్‌ ఇచ్చాడు. ‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ లాంటి విలక్షణ చిత్రాలు అందించిన వంశీ పైడిపల్లి, మహేష్‌తో ఎలాంటి సినిమా తీశాడు.? మహేష్‌ కెరీర్‌లో ఈ సినిమా ల్యాండ్‌ మార్క్‌ అవుతుందా? 100 కోట్ల పైబడి ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగిందనే ప్రచారం నేపథ్యంలో ఈ సినిమా సాధించబోయే విజయం ఎలా వుంటుంది.? ఈ అంశాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందైతే, కథలోకి వెళ్ళిపోదామా.!

కథేంటి.?  Maharshi Review

అమెరికాలో ఓ పెద్ద కంపెనీకి సీఈఓ రిషి. కలలు కంటాడు, వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడతాడు. అలా అంచలంచెలుగా జీవితంలో ఎదుగుతాడు. మధ్యతరగతి నేపథ్యం నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన రిషి, తన జీవితంతోపాటు తాను సాధించిన విజయాల వెనుక తన స్నేహితుల కష్టం కూడా వుందని గుర్తిస్తాడు. ఆ స్నేహితులు (పూజా హెగ్దే, అల్లరి నరేష్‌).

గెలవడమంటే డబ్బు సాధించడంతోపాటు స్థాయిని పెంచుకోవడం మాత్రమేనని భావించే రిషి, అసలు సిసలు విజయమంటే ఏంటో ఎలా తెలుసుకుంటాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన అనుభవాలేంటి? రిషి స్నేహితుల సంగతేంటి? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎవరెలా చేశారు.?

ఇప్పుడు కొత్తగా మహేష్‌లోని నటనా ప్రతిభ గురించి ఏం చెప్పుకుంటాం? బాల నటుడిగానే సత్తా చాటిన మహేష్‌, ఎన్నో సినిమాల్లో తన నటనతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఎలాంటి ఎక్స్‌ప్రెషన్‌ని అయినా తేలిగ్గా పలికించేయగల మహేష్‌, ఈ సినిమాని ఒంటిచేత్తో తన భుజాల మీద నడిపించాడు.

మూడు విభిన్నమైన స్థాయిల్లో మహేష్‌ నటన అత్యద్భుతం. సీఈఓ, కాలేజ్‌ స్టూడెంట్‌, సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తి.. ఇలా ఈ మూడు పాత్రల్లో మహేష్‌ చూపిన వేరియేషన్స్‌కి హేట్సాఫ్‌ చెప్పాల్సిందే. నటుడిగా ఇంకోసారి మహేష్‌ ఈ సినిమాతో మెస్మరైజ్‌ చేశాడు.

పూజా హెగ్దే అందంగా కన్పించింది. అంతకు మించి, ఆమె గొప్పగా నటించిందనడానికి తగినంత ప్రాధాన్యత ఆమెకు దక్కలేదు. కాలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌ సీన్స్‌లో మాత్రం ఆకట్టుకుంది.

అల్లరి నరేష్‌ చాలా మంచి నటుడని ఇంతకు ముందే చాలా సినిమాలతో ప్రూవ్‌ అయ్యింది. నరేష్‌కి ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది. కథకి మూల స్తంభంగా అతని పాత్ర వుంటుంది. కామెడీ హీరోగానే కాదు, ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగలనని అల్లరి నరేష్‌ ఇంకోసారి నిరూపించాడు.

జగపతిబాబు విలనిజం ఓకే. ఆ పాత్రని ఇంకాస్త జాగ్రత్తగా దర్శకుడు డిజైన్‌ చేసి వుండాల్సింది. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగానే చేశారు.

టెక్నికల్‌ సపోర్ట్‌..

టెక్నికల్‌ విషయాలకొస్తే ముందుగా సినిమాటోగ్రపీ గురించి మాట్లాడుకోవాలి. సినిమాని మూడు టోన్స్‌లో సినిమాటోగ్రాఫర్‌ అత్యద్భుతంగా చూపించాడు. ప్రతి ఫ్రేమ్‌ చాలా రిచ్‌గా కనిపించింది. సంగీతం ఓకే. పాటలు వినడానికీ, చూడ్డానికీ బాగానే వున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా ఓకే. పాటల్లో సాహిత్యం ఆలోచింపజేస్తుంది. డైలాగ్స్‌ బావున్నాయి.

ఎడిటింగ్‌ విషయంలోనే ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుని వుండాల్సింది. సెకెండాఫ్‌కి వచ్చేసరికి కత్తెర పదును తగ్గిపోయినట్లే అనిపిస్తుంది. నిర్మాణపు విలువలు చాలా రిచ్‌గా వున్నాయి. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్స్‌ తమవంతుగా మంచి పాత్ర పోషించాయి.

 

ప్లస్సులు

కాలేజ్‌ ఎపిసోడ్స్‌

మహేష్‌బాబు

నిర్మాణపు విలువలు

ఫస్టాఫ్‌

 

మైనస్‌లు

సెకెండాఫ్‌లో ఎక్కువైన ఎమోషనల్‌ కంటెంట్‌

సాగతీత అనిపించే సన్నివేశాలు

నిడివి ఎక్కువ కావడం

 

విశ్లేషణ (Maharshi Review)

కథ, కథనాల (Maharshi Review) పరంగా వంక పెట్టలేకపోయినా, సన్నివేశాలకొచ్చేసరికి సినిమా చూస్తున్నంతసేపూ ఏదో ఒక సినిమాలోని సన్నివేశం రిఫరెన్స్‌గా అనిపిస్తుంది. మహేష్‌ పాత సినిమాలూ గుర్తుకొస్తాయి. శ్రీమంతుడు, భరత్‌ అనే నేను, ఖైదీ నెంబర్‌ 150.. ఇలాంటి సినిమాల ప్రస్తావన ప్రేక్షకుడి మెదడులో ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందంటే, ‘కొత్తదనం’ విషయంలో దర్శకుడి ఆలోచనలు కొంత వెనుకబడినట్లే అనుకోవాలేమో.

కొన్ని సీన్స్‌ని చాలా బాగా ఎలివేట్‌ చేయగలిగిన దర్శకుడు, ఆ వెంటనే రొటీన్‌ సన్నివేశాల్ని జొప్పించి, బోర్‌ కొట్టించేయడం పెద్ద మైనస్‌. మహేష్‌ని కాలేజీ కుర్రాడిలా చూపించడంలో మాత్రం దర్శకుడు సఫలమయ్యాడు. ఆ సన్నివేశాల్లో మహేష్‌ ఎనర్జీ సూపర్బ్‌.

మెసేజ్‌ ఓరియెంటెడ్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్స్‌ తెరకెక్కించడం అంత తేలిక కాదు. కాన్‌ఫ్లిక్ట్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. తడబడ్డాడని చెప్పలేంగానీ, డల్‌గా సాగే కొన్ని సన్నివేశాలు కథా గమనానికి అడ్డుపడ్డాయి. దాంతో, సినిమా లెంగ్త్‌ పెరిగి, రిషి జర్నీని (Maharshi Review) సుదీర్ఘంగా మార్చేశాయి.

ఫైనల్‌ టచ్‌ (Maharshi Review): జర్నీ విత్‌ రిషి, కొంచెం లెంగ్తీ!

Related Post

రివ్యూ: – దేవదాస్‌ అదరగొట్టేశారు.!

Posted by - September 27, 2018 0
సినిమా టైటిల్‌: దేవదాస్‌ నటీనటులు: నాగార్జున, నాని, రష్మిక మండన్న, ఆకాంక్ష సింగ్‌, కునాల్‌ కపూర్‌, మురళీ శర్మ, శరత్‌కుమార్‌, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌, సత్య,…

రివ్యూ అండ్ రేటింగ్ : సవ్యసాచి

Posted by - November 2, 2018 0
సినిమా టైటిల్‌: సవ్యసాచి నటీనటులు: అక్కినేని నాగచైతన్య, నిధి అగర్వాల్‌, మాధవన్‌, భూమిక, వెన్నెల కిషోర్‌, తాగుబోతు రమేష్‌, హైపర్‌ ఆది తదితరులు. సినిమాటోగ్రఫీ: జె.యువరాజ్‌ సంగీతం:…
Ram Charan, Pooja Hegde, NTR, Rakul Preet Singh, Fitness, Six Pack

సిక్స్‌ ప్యాక్‌ రౌడీస్‌ అండ్‌ లేడీస్‌.!

Posted by - September 17, 2018 0
ఇప్పుడు సిక్స్‌ ప్యాక్‌ బాడీ (Six Pack Fitness) అంటే ఎంత ట్రెండింగో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ట్రెండ్‌ని అచ్చంగా ఫాలో అయిపోయే కుర్రకారు ఈ సిక్స్‌బాడీ వైపు…

‘సైరా’ మేకింగ్‌.. ది మెగా హై ఓల్టేజ్ యాక్షన్.!

Posted by - August 14, 2019 0
మెగా ఇంపాక్ట్‌ (Sye Raa Making) అంటే ఏంటో ఇంకోసారి ప్రూవ్‌ అయ్యింది. సోషల్ మీడియా పోటెత్తుతోంది.. ‘మెగా మేకింగ్..’ అంటూ. కొంచెం లేట్‌గా వచ్చినా, మెగాస్టార్‌…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *