రివ్యూ అండ్‌ రేటింగ్‌: మజిలీ

464 0

సినిమా టైటిల్‌: మజిలీ Majili Review Rating

నటీనటులు: అక్కినేని నాగ చైతన్య, అక్కినేని సమంత, దివ్యాన్ష కౌశిక్‌, రావు రమేష్‌, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి, ఛాయ్‌ బిస్కట్‌ సుహాస్‌ తదితరులు.

సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ

సంగీతం: గోపీ సుందర్‌

నేపథ్య సంగీతం: తమన్‌ ఎస్‌ఎస్‌

ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి

కథ, స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్‌, దర్శకత్వం: శివ నిర్వాణ

నిర్మాణం: షైన్‌ స్క్రీన్స్‌

నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్‌ పెద్ది

విడుదల తేదీ: 5 ఏప్రిల్‌ 2019

రేటింగ్‌: 3/5

ముందుగా.. (Majili Review Rating)

అక్కినేని నాగచైతన్య, ఆయన సతీమణి సమంత ఇంతకు ముందు చాలా సినిమాల్లో నటించారు.. అయితే అది ఇద్దరికీ పెళ్ళి కాక ముందు. కానీ, ఇప్పుడు భార్యాభర్తలిరువురూ కలిసి నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకు రావడమంటే, అది అభిమానులకీ, సగటు సినీ ప్రేక్షకుడికీ ఆసక్తికరమైన విషయమే కదా! అందుకే ఈ సినిమాపై ఒకింత ఎక్కువ ఆసక్తి నెలకొంది అందరిలోనూ.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌ ఓ పక్క, క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ‘మజిలీ’ (Majili Review Rating) సినిమా విడుదల ఇంకోపక్క. వెరసి, ‘మజిలీ’పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ‘నిన్నుకోరి’ ఫేం శివ నిర్మాణ రూపొందించిన ‘మజిలీ’ విడుదలకు ముందే పాజిటివ్‌ బజ్‌ పొందడానికి కారణం ప్రోమోస్‌. మరి, సినిమాకి సంబంధించి పూర్తి విశేషాలేంటో తెలుసుకుందామా.!

కథేంటి.? Majili Review and Rating

గొప్ప క్రికెటర్‌ కావాలనే కసితో వుండే కుర్రాడు పూర్ణ. అతనికి అన్షు (దివ్యాన్ష కౌశిక్‌) ఓ సందర్భంలో తారసపడ్తుంది. ఇద్దరి మధ్యా ప్రేమ చిగురిస్తుంది. ఆ ప్రేమ ఇంకాస్త బలపడి, ఇద్దరూ పెళ్ళి చేసుకుందామనేదాకా వెళుతుంది. చాలా సినిమాల్లోలానే పెద్దలు వీరి పెళ్ళికి ఒప్పుకోరు. కొంత సంఘర్షణ నడుమ అన్షుకి వేరే వ్యక్తితో పెళ్ళయిపోతుంది.

పూర్ణ కూడా మరో అమ్మాయి శ్రావణి (సమంత)ని పెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. పెద్దల ఒత్తిడితో శ్రావణిని పెళ్ళి అయితే చేసుకున్నాడుగానీ, భార్యగా ఆమెకు ఏనాడూ తగిన గౌరవం ఇవ్వడు, అసలామెను పట్టించుకోడు పూర్ణ. ఎందుకంటే పూర్ణ మనసులో ఇంకా అన్షునే అలా వుండిపోతుంది.

కొన్ని ప్రత్యేక పరిస్థితులు పూర్ణ – శ్రావణి జీవితాల్లో అలజడి సృష్టిస్తాయి. అవేంటి? పూర్ణ – శ్రావణి ఒక్కటయ్యారా? అన్షు సంగతేంటి? క్రికెట్‌ అవ్వాలని ఒకప్పుడు కలలుగన్న పూర్ణ, ఆ డ్రీమ్‌ నెరవేర్చుకున్నాడా? లేదా? వంటి ప్రశ్నలన్నిటికీ తెరపైనే సమాధానం దొరుకుతుంది.

ఎవరెలా చేశారు.? Majili Review and Rating

అక్కినేని నాగ చైతన్య తొలి సినిమా ‘జోష్‌’లోనే పరిణతి చెందిన నటుడిలా కన్పించాడు. అప్పటినుంచీ సినిమా సినిమాకీ చిన్న చిన్న లోపాల్ని సరిదిద్దుకుంటూ నటనలో మేటి అనిపించుకుంటూనే వున్నాడు. సక్సెస్‌, ఫెయిల్యూర్‌ అన్న ఆలోచనలు పెట్టుకోకుండా కొత్తదనం కోసం ప్రయత్నిస్తున్నాడు, నటుడిగా తనను తాను మెరుగుపరుచుకుంటున్నాడు చైతూ. ఈ సినిమాలో అతని నటనకు ఇంకాస్త పదును పెట్టే పాత్ర దక్కింది. భిన్నమైన షేడ్స్‌ వున్న పాత్రలో చాలా అద్భుతంగా నటించి మెప్పించాడు.

హీరోయిన్‌ సమంత గురించి కొత్తగా చెప్పేదేముంది? నటిగా ఎప్పుడో ఫుల్‌ మార్క్స్‌ సంపాదించేసుకుందామె. ఈ సినిమాకి ఆమె నటన అదనపు ఆకర్షణ అయ్యింది. చాలా సన్నివేశాల్ని తన నటనతో ఇంకాస్త హైలైట్‌ అయ్యేలా చేసింది సమంత. రియల్‌ లైఫ్‌ భార్యా భర్తలు రీల్‌ లైఫ్‌ భార్యాభర్తలుగా నటిస్తే ఆ కంఫర్ట్‌ ఎలా వుంటుందో ఈ సినిమాతో ప్రూవ్‌ చేశారు సమంత, నాగ చైతన్య.

మిగతా పాత్రల్లో రావు రమేష్‌, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి చాలా బాగా చేశారు. రావు రమేష్‌, సుబ్బరాజు పాత్రల్ని చాలా సహజంగా దర్శకుడు తీర్చిదిద్దితే, అంతే సహజంగా వారిద్దరూ నటనతో మెప్పించారు. చైతూ ఫ్రెండ్‌గా నటించిన చాయ్‌ బిస్కట్‌ సుహాస్‌ ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగా చేశారు.

టెక్నికల్‌ సపోర్ట్‌..

టెక్నికల్‌ సపోర్ట్‌లో ముందుగా మాట్లాడుకోవాల్సింది బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ గురించి. ఎందుకంటే, మ్యూజిక్‌ డైరెక్టర్‌ గోపీ సుందర్‌ కొన్ని కారణాలతో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సమకూర్చలేకపోతే, ఆ బాధ్యతను తీసుకున్న తమన్‌ అదరగొట్టేశాడు. తన నేపథ్య సంగీతంతో సినిమాని ఇంకో మెట్టు పైకెక్కించాడు తమన్‌. సినిమాటోగ్రఫీ చాలా బావుంది.

సన్నివేశాల్లో మూడ్‌ సినిమాటోగ్రఫీ పరంగా బాగా క్యారీ అయ్యింది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ వర్క్‌ కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాణపు విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదు. ఎడిటింగ్‌ మాత్రం అక్కడక్కడా కాస్త అవసరం అనిపిస్తుంది. డైలాగ్స్‌ చాలా బాగున్నాయి.

ప్లస్సులు

అక్కినేని నాగచైతన్య నటన

సమంత నటన

సమంత, నాగచైతన్య మధ్య కెమిస్ట్రీ

ఎమోషనల్‌ సీన్స్‌

మైనస్‌లు

రొటీన్‌ కథ

కొన్ని సాగతీత అన్పించే సన్నివేశాలు

విశ్లేషణ Majili Review and Rating

సినిమా చూస్తున్నంతసేపూ ‘ఎమోషన్‌’ (Majili Review Rating) పరంగా ఎప్పుడో చూసినట్లు అన్పిస్తుంటుంది. శివ నిర్వాణ గతంలో తెరకెక్కించిన ‘నిన్ను కోరి’ తాలూకు ఛాయలు కన్పిస్తాయి. కథ కూడా ఆ షేడ్స్‌లోనే నడుస్తుంది. అయితే శ్రావణితో పూర్ణ కనెక్ట్‌ కాకపోవడానికి గల బలమైన సన్నివేశాల్ని చూపించలేకపోయాడు దర్శకుడు.

అలాగే, తనకిష్టమైన క్రికెట్‌ విషయంలో పూర్ణ ఎందుకు నిర్లక్ష్యం చేశాడన్నదానికీ లాజిక్‌ పక్కాగా కుదరదు. సినిమా కథని నెక్స్‌ట్‌ లెవల్‌కి తీసుకెళ్ళగల నటీనటులు వున్నా, ఆ వేగాన్ని కథలో చూపించడంలో దర్శకుడు కొంత మేర విఫలమయ్యాడు. అయితే, ఎమోషనల్‌ సీన్స్‌లో ఆడియన్స్‌ లీనమయ్యేలా చేయడంలో మాత్రం దర్శకుడు సఫలమయ్యాడు.

ఓవరాల్‌గా ఇదొక ఫీల్‌ గుడ్‌ మూవీ. సమంత, నాగచైతన్యలను భార్యా భర్తలుగా తెరపై చూస్తుంటే అభిమానులకి లభించే ఆ కిక్కే వేరు.
ఫైనల్‌ టచ్‌: మనసుని టచ్‌ చేసే ‘మజిలీ’

Related Post

రివ్యూ అండ్ రేటింగ్ : సవ్యసాచి

Posted by - November 2, 2018 0
సినిమా టైటిల్‌: సవ్యసాచి నటీనటులు: అక్కినేని నాగచైతన్య, నిధి అగర్వాల్‌, మాధవన్‌, భూమిక, వెన్నెల కిషోర్‌, తాగుబోతు రమేష్‌, హైపర్‌ ఆది తదితరులు. సినిమాటోగ్రఫీ: జె.యువరాజ్‌ సంగీతం:…

రివ్యూ: – దేవదాస్‌ అదరగొట్టేశారు.!

Posted by - September 27, 2018 0
సినిమా టైటిల్‌: దేవదాస్‌ నటీనటులు: నాగార్జున, నాని, రష్మిక మండన్న, ఆకాంక్ష సింగ్‌, కునాల్‌ కపూర్‌, మురళీ శర్మ, శరత్‌కుమార్‌, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌, సత్య,…

రివ్యూ అండ్‌ రేటింగ్‌: మహర్షి

Posted by - May 9, 2019 0
సినిమా టైటిల్‌: మహర్షి (Maharshi Review) నటీనటులు: మహేష్‌బాబు, పూజా హెగ్దే, అల్లరి నరేష్‌, జగపతిబాబు, ప్రకాష్‌ రాజ్‌, రావు రమేష్‌, జయసుధ, వెన్నెల కిషోర్‌ తదితరులు.…

రివ్యూ.. యూ టర్న్‌: సమంత హిట్‌ టర్న్‌

Posted by - September 18, 2018 0
సినిమా టైటిల్‌: యూ టర్న్‌ నటీనటులు: సమంత, భూమిక, ఆది పినిశెట్టి, రాహుల్‌ రవీంద్రన్‌, నరేన్‌ తదితరులు సంగీతం: పూర్ణ చంద్ర సినిమాటోగ్రఫీ: నికెత్‌ బొమ్మిరెడ్డి ఎడిటింగ్‌:…

రివ్యూ: డియర్‌ కామ్రేడ్‌

Posted by - July 27, 2019 0
సినిమా టైటిల్‌: డియర్‌ కామ్రేడ్‌ (Dear Comrade Review Rating)నటీనటులు: విజయ్‌ దేవరకొండ, రష్మిక మండన్న, శృతి రామచంద్రన్‌, సుహాస్‌, చారు హాసన్‌, ఆనంద్‌ తదితరులు. సినిమాటోగ్రఫీ:…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *