రివ్యూ: ఇస్మార్ట్‌ శంకర్‌ – రామ్‌ ‘షో’!

189 0

సినిమా టైటిల్‌: ఇస్మార్ట్‌ శంకర్‌ iSmart Shankar Review
నటీనటులు: రామ్‌ పోతినేని, నభా నటేష్‌, నిధి అగర్వాల్‌, సత్యదేవ్‌, ఆశిష్‌ విద్యార్థి, సయాజీ షిండే, పునీత్‌ ఇస్సార్‌, తులసి తదితరులు
సినిమాటోగ్రఫీ: రాజ్‌ తోట
సంగీతం: మణిశర్మ
ఎడిటింగ్‌: జునైద్‌ సిద్దికీ
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌
నిర్మాణం: పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌
నిర్మాతలు: పూరి జగన్నాథ్‌, ఛార్మి
విడుదల తేదీ: 18 జులై 2019
రేటింగ్‌: 3/5

ముందుగా..

ఇంతవరకు ఎప్పుడూ చేయని మాస్‌ క్యారెక్టర్‌లో రామ్‌ పోతినేనిని చూడమంటే, అతని అభిమానులకి పెద్ద పండగే. ఎనర్జీకి కేరాఫ్‌ అడ్రస్‌లా కన్పిస్తాడు రామ్‌. అలాంటి రామ్‌ని పూరి జగన్నాథ్‌ లాంటి డైరెక్టర్‌ ఇంకెలా చూపించి వుంటాడు.? అన్న ఆలోచనే, అభిమానులకి బోల్డంత కిక్‌ ఇస్తుంది.

స్వీయ నిర్మాణంలో పూరి తెరకెక్కించిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాకి హీరో రామ్‌ మెయిన్‌ ఎస్సెట్‌. హీరోయిన్ల గ్లామర్‌ ఈ సినిమాకి ఇంకో అదనపు ఆకర్షణ. రిలీజ్‌కి ముందు ఇలా పాజిటివ్‌ నోడ్‌తో సినిమాపై అంచనాలు పెంచేసుకున్న ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ ట్రేడ్‌ వర్గాల్లోనూ మంచి బజ్‌ రాబట్టుకుంది. పూరి ఈజ్‌ బ్యాక్‌ అనిపించుకున్నాడా.? మాస్‌లో మంచి ఫాలోయింగ్‌ వున్న రామ్‌ పోతినేని, మాస్‌ హీరోగా సత్తా చాటుతాడా.? తెలుసుకుందాం పదండిక..

కథేంటి.? iSmart Shankar Review

డబ్బు కోసం ఏమైనా చేసే ఓ కిరాయి రౌడీ శంకర్‌ (రామ్‌). సుపారీ తీసుకుని, ఓ హత్య కూడా చేస్తాడు. ఆ హత్య తర్వాత రామ్‌కి కష్టాలు మొదలవుతాయి. ఈ క్రమంలో అతను తన లవర్‌ చాందిని (నభా నటేష్‌)ని కోల్పోతాడు. ఆమె చావుకి కారణమైన వాళ్ళని చంపాలనే కసితో వుంటాడు శంకర్‌.

ఓ ప్రమాదంలో శంకర్‌ గాయపడి, పోలీసులకు చిక్కుతాడు. అక్కడినుంచి కథ అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. ఆ మలుపే సినిమాకి కీలకం. మాస్‌ శంకర్‌, ఇస్మార్ట్‌గా ఎలా మారాడు? ఇంతకీ, శంకర్‌ చంపింది ఎవర్ని? ఆ హత్య వెనుక వున్నదెవరు? మధ్యలో ఈ కంప్యూటచ్‌ చిప్‌ గోలేంటి.? డబుల్‌ ధిమాక్‌ వ్యవహారమేంటి.? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎవరెలా చేశారు.? iSmart Shankar Review

హీరో రామ్‌ పోతినేని ఎనర్జీకి కేరాఫ్‌ అడ్రస్‌. డాన్సుల్లోనూ, ఫైట్స్‌లోనూ ‘ఇస్మార్ట్‌’ స్పీడ్‌ రామ్‌కి కొత్త కాదు. మాస్‌ హీరోగా ఎప్పుడో ప్రూవ్‌ చేసుకున్నా, తన స్టామినాకి తగ్గ మాస్‌ హిట్‌ని మాత్రం ఇంతవరకూ కొట్టలేకపోయాడు. ఈ సినిమాతో ఆ కరువు రామ్‌కి తీరేలానే వుంది. ఎందుకంటే, కంప్లీట్‌ ఛేంజ్‌ ఓవర్‌ కన్పించింది రామ్‌లో. ప్రతి సన్నివేశంలోనూ రామ్‌ ఎనర్జీ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. డైలాగ్‌ డిక్షన్‌, బాడీ లాంగ్వేజ్‌.. ఇలా ఒకటేమిటి.? మొత్తం కలిపి ఓ కంప్లీట్‌ ఎనర్జిటిక్‌ ప్యాకేజీ అనుకోవచ్చు.

ఒక్క మాటలో చెప్పాలంటే, సినిమా మొత్తాన్నీ రామ్‌ తన భుజాల మీద మోసేశాడు.
హీరోయిన్ల గురించి చెప్పుకోవాలంటే, నభా నటేష్‌తోపాటు నిధి అగర్వాల్‌ కూడా గ్లామర్‌కే పరిమితమయినట్లు కనిపిస్తుంది. హద్దులు దాటేశారు గ్లామర్‌ విషయంలో ఈ ఇద్దరూ. నభా నటేష్‌ పాత్ర చాలా ఫాస్ట్‌గా వుంటే, నిధి పాత్ర కొంచెం కామ్‌గా కనిపిస్తుంటుంది. పోలీస్‌ అధికారి పాత్రలో సత్యదేవ్‌ బాగా చేశారు. ఆశిష్‌ విద్యార్థి తదితరులు తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు.

టెక్నికల్‌ సపోర్ట్‌..

సాంకేతికంగా సినిమా చాలా రిచ్‌గానే కన్పిస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకున్నాయి. మణిశర్మ చాలాకాలం తర్వాత మ్యాజిక్‌ చేశాడు. మరీ ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ విషయంలో తన పవర్‌ చూపించాడు మణిశర్మ. ఎడిటింగ్‌ అక్కడక్కడా ఇంకాస్త అవసరం అనిపిస్తుంది.

యాక్షన్‌ ఎపిసోడ్స్‌ బావున్నాయి. డాన్సులూ అదుర్స్‌. సినిమా చాలా రిచ్‌గా తెరకెక్కింది. నిర్మాణపు విలువలు సూపర్బ్‌ అంతే. కాస్ట్యూమ్స్‌ గురించి స్పెషల్‌గా మెన్షన్‌ చెయ్యాలి. ఊర మాస్‌ హీరోగా రామ్‌ని మలచిన కాస్ట్యూమ్స్‌, హీరోయిన్ల విషయానికొచ్చేసరికి.. మరీ పీనాసితనం చూపినట్లు అన్పించింది.. దానర్థం మేగ్జిమమ్‌ ఎక్స్‌పోజింగ్‌ జరిగిందని మాత్రమే.

ప్లస్సులు
రామ్‌ పోతినేని ఎనర్జీ
డైలాగ్స్‌, డాన్స్‌లు, యాక్షన్‌ ఎపిసోడ్స్‌
హీరోయిన్ల గ్లామర్‌

మైనస్‌లు
లాజిక్‌ లేని సన్నివేశాలు

విశ్లేషణ

ఓ వ్యక్తి మెదడులో ఇంకో వ్యక్తి తాలూకు మెమరీని చిప్‌ ద్వారా ఇన్‌సర్ట్‌ చేయడం అనే కాన్సెప్ట్‌ సంగతి పక్కన పెడితే, ఇది పరమ రొటీన్‌ మాస్‌ రొట్ట సినిమా. ఇలాంటి మాస్‌ సినిమాలు పూరికి కొత్తేమీ కాదు. తెలుగు సినిమాకి అసలే కాదు. సినిమా చాలా సందర్భాల్లో డల్‌ అయిపోతున్నట్లు అనిపిస్తుంది. కానీ, అక్కడ రామ్‌ తన ఎనర్జీతో పసలేని సీన్స్‌ని కూడా ఓ రేంజ్‌కి తీసుకెళ్ళాడు.

అక్కడక్కడా పూరి మార్క్‌ ఛమక్కులు (iSmart Shankar Review) కన్పించినా, ఓవరాల్‌గా పూరి తన పాత ఎనర్జీని అయితే రిపీట్‌ చేయలేకపోయాడన్నది నిస్సందేహం. కొత్త పాయింట్‌ని అయితే పట్టుకున్నాడుగానీ, పాత మూస పద్దతిలోనే దర్శకుడు చెప్పాలనుకోవడం అంతగా ప్రేక్షకుడికి మింగుడుపడదు. వన్‌ టు టెన్‌ రామ్‌ ఎనర్జీనే.. అన్నట్లుగా ఈ సినిమా అనిపిస్తుంటుంది.

మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నిధి అగర్వాల్‌ క్యారెక్టర్‌ మరీ పాసివ్‌గా మారిపోవడం అంతగా మింగుడుపడదు. హీరోకీ విలన్లకీ మధ్య సన్నివేశాలూ చప్పగా సాగుతాయి. అవన్నీ పక్కన పెడితే, బీభత్సమైన మాస్‌ సినిమాని చూడాలనుకున్నవారికి ఈ సినిమా కంప్లీట్‌ మీల్స్‌ అని చెప్పొచ్చు.
ఫైనల్‌ టచ్‌: ఇస్మార్ట్‌.. మాస్‌, ఊరమాస్‌ శంకర్‌.! iSmart Shankar Review

Related Post

Savyasachi Review, Savyasachi Preview,

ప్రివ్యూ: ‘సవ్యసాచి’ ఒక్కడేగానీ.!

Posted by - November 1, 2018 0
‘సవ్యసాచి’ అంటే అర్జునుడు అని. ఇక్కడ ఈ ‘సవ్యసాచి’ ఒక్కడే.. కానీ, ఇద్దరు. ఒక్కడేంటి, మళ్ళీ ఇద్దరేంటి.! అదే ‘సవ్యసాచి’ సినిమా. తల్లి గర్భంలో రెండు కవల…

రివ్యూ: – నోటా (ఎన్‌వోటీఏ NOTA)

Posted by - October 5, 2018 0
సినిమా టైటిల్‌: నోటా (ఎన్‌వోటీఏ NOTA) నటీనటులు: విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), మెహరీన్‌ కౌర్‌ పిర్జాదా (Mehreen Kaur Pirzada), సత్యరాజ్‌ (Sathya Raj), నాజర్‌,…

రివ్యూ అండ్‌ రేటింగ్‌: మజిలీ

Posted by - April 5, 2019 0
సినిమా టైటిల్‌: మజిలీ Majili Review Rating నటీనటులు: అక్కినేని నాగ చైతన్య, అక్కినేని సమంత, దివ్యాన్ష కౌశిక్‌, రావు రమేష్‌, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి, ఛాయ్‌ బిస్కట్‌…
Savyasachi Trailer Savyasachi trailer review

ట్రైలర్‌ రివ్యూ: ‘సవ్యసాచి’ తుపాన్‌ షురూ!

Posted by - October 24, 2018 0
‘సవ్యసాచి’ (Savyasaachi) అనే విలక్షణమైన టైటిల్‌. పైగా, ఆ టైటిల్‌లో చేతి గుర్తు. సినిమా అనౌన్స్‌మెంట్‌తోనే, ఈ సినిమాలో ఏదో కొత్తగా వుండబోతోందన్న భావన అందరిలోనూ కలిగింది.…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *