రోహిత్‌ సెంచరీ.. బుమ్రా యార్కర్‌.. మనదే విక్టరీ.!

290 0

హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ (Hit Man Rohit Sharma) సెంచరీ (Rohit Sharma Century Team India Victory) కొట్టాడు.. మిస్టరీ స్పీడ్‌స్టర్‌, యార్కర్స్‌ స్పెషలిస్ట్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (Jaspreet Bumrah)  నాలుగు వికెట్లు పడగొట్టాడు.. ఇంకేముంది.? విక్టరీ టీమిండియా (Team India) సొంతమైంది.

బంగ్లాదేశ్‌తో (Bangladesh) జరిగిన కీలక మ్యాచ్‌లో టీమిండియా (Team India) అదరగొట్టింది. ఈ టోర్నీలో అనూహ్యంగా సత్తా చాటుతున్న బంగ్లాదేశ్, టీమిండియాపై గెలిచేందు కోసం పక్కా వ్యూహాలు రచించుకున్నామని పదే పదే చెప్పడంతో.. ఈ మ్యాచ్ పట్ల రెట్టింపు ఆసక్తి నెలకొంది. కానీ, టీమిండియా, బంగ్లాదేశ్ జట్టుకి ఎక్కడా అవకాశమివ్వలేదు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా (Team India Men In Blue) నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 314 పరుగులు సాధించింది. 315 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌, 48 ఓవర్లలో 286 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది.

భారత్‌ (Bharath) విజయంలో రోహిత్‌ శర్మ (Rohit Sharma Century) సెంచరీతోపాటు (Rohit Sharma Century Team India Victory), జస్‌ప్రీత్‌ బుమ్రా (Jaspreet Bumrah) తీసిన నాలుగు వికెట్లు కీలక పాత్ర పోషించాయి. ఈ విజయంతో టీమిండియా సెమీస్‌లోకి సగర్వంగా అడుగు పెట్టింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా (Rohit Sharma Century Team India Victory)

పిచ్‌ కండిషన్స్‌ నేపథ్యంలో తొలుత బ్యాటింగ్‌కి మొగ్గు చూపాడు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ. టాస్‌ గెలవగానే ఇంకో ఆలోచన లేకుండా బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. కోహ్లీ వ్యూహమే ఫలించింది.

తొలుత బ్యాటింగ్‌కి అనుకూలించింది పిచ్‌. ఓపెనర్లు కె.ఎల్‌. రాహుల్‌, రోహిత్‌ శర్మ ధాటిగా ఆడారు.. బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ సెంచరీ నమోదు చేశాడు. ఈ వరల్డ్‌ కప్‌ టోర్నీలో ఇప్పటికే మూడు సెంచరీలు చేసిన రోహిత్‌ శర్మ, తాజాగా నాలుగో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు (Rohit Sharma Century Team India Victory).

అయితే, సెంచరీ సాధించిన వెంటనే రోహిత్‌ శర్మ ఔటయ్యాడు. 180 పరుగులకు టీమిండియా తొలి వికెట్‌ని కోల్పోతే, రెండో వికెట్‌ని మరో 15 పరుగులకే టీమిండియా కోల్పోయింది. కెఎల్‌ రాహుల్‌ 77 పరుగుల వద్ద వికెట్‌ పారేసుకున్నాడు.

కాగా, విరాట్‌ కోహ్లీ 23 పరుగులు చేసి ఔట్‌ అయితే, ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్య డకౌట్‌గా వెనుదిరిగాడు. రిషబ్‌ పంత్‌ మాత్రం బ్యాట్‌తో కాస్సేపు మెరిపించాడు. మరో ఎండ్‌లో ధోనీ ఎప్పటిలానే ‘స్లో’గా ఆడాడు. దినేష్‌ కార్తీక్‌ నిరాశపర్చగా, చివరి ఓవర్‌లో రెండు పరుగులకే మొత్తం మూడు వికెట్లు కోల్పోయింది టీమిండియా.

కంగారెత్తించిన బంగ్లా బ్యాట్స్‌మెన్‌

ఓ వైపు వికెట్లు పడుతున్నా, బంగ్లా బ్యాట్స్‌మెన్‌ తమ స్కోర్‌ బోర్డ్‌ని పరుగులు పెట్టించారు. ఓ దశలో బంగ్లాదేశ్‌ మరోమారు వరల్డ్‌ కప్‌లో టీమిండియాకి ఝలక్‌ తప్పదేమో అనుకున్నారు. అయితే, భారత బౌలర్లు ఛాన్స్‌ తీసుకోలేదు.

చివర్లో బుమ్రా మెరుపులు టీమిండియా విజయాన్ని ఖారారు చేశాయి. తన చివరి ఓవర్‌లో బుమ్రా రెండు వికెట్లు తీసి, బంగ్లా ఇన్నింగ్స్‌కి తెరదించాడు. బంగ్లా ఆటగాళ్ళలో వరల్డ్‌ కప్‌ హీరో షకీబ్‌ అల్‌ హసన్‌ 66 పరుగులు చేస్తే, చివర్లో మొహమ్మద్‌ సైఫుద్దీన్‌ 51 పరుగులు చేసి, టీమిండియాకి కంగారు పుట్టించాడు.

బంగ్లా జట్టులో ఇంకెవరూ అర్థ సెంచరీ చేయలేకపోయారు. ఈ విజయంతో వరల్డ్‌ కప్‌లో టీమిండియా, బంగ్లాదేశ్‌పై తన విజయాల సంఖ్యను 3కి పెంచుకుంది. ఒకే ఒక్క వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో బంగ్లా చేతిలో టీమిండియా పరాజయం పాలయ్యింది ఇప్పటిదాకా.

స్కోర్లు..

టీమిండియా: లోకేష్‌ రాహుల్‌ 77, రోహిత్‌ శర్మ 105, విరాట్‌ కోహ్లీ 26, రిషబ్‌ పంత్‌ 48, హార్దిక్‌ పాండ్య 0, ఎంఎస్‌ ధోనీ 35, దినేష్‌ కార్తీక్‌ 8, భువనేశ్వర్‌ కుమార్‌ 2, మొహమ్మద్‌ షమి 1. బంగ్లాదేశ్‌ బౌలింగ్‌: ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ 5 వికెట్లు, షకీబ్‌ అల్‌ హసన్‌ 1 వికెట్‌, రుబెల్‌ హొస్సేన్‌ 1 వికెట్‌, సౌమ్యా సర్కార్‌ 1 వికెట్‌.

బంగ్లాదేశ్‌: తమీమ్‌ ఇక్బాల్‌ 23, సౌమ్యా సర్కార్‌ 33, షకీబ్‌ అల్‌ హసన్‌ 66, ముష్ఫికర్‌ రహీమ్‌ 24, లిటన్‌ దాస్‌ 22, మొసాద్దెక్‌ హొస్సెయిన్‌ 3, సబ్బీర్‌ రహ్మాన్‌ 36, మొహమ్మద్‌ సైఫుద్దీన్‌ 51, ముషరఫీ మోర్టజా 8, రుబెల్‌ హుస్సేన్‌ 9, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ 0. భారత్‌ బౌలింగ్‌: జస్‌ప్రీత్‌ బుమ్రా 4 వికెట్లు, హార్దిక్‌ పాండ్యా 3 వికెట్లు, మొహమ్మద్‌ షమీ 1 వికెట్‌, యజువేంద్ర చాహల్‌ 1 వికెట్‌, భువనేశ్వర్‌ కుమార్‌ 1 వికెట్‌.

నలుగురు బౌలర్లు, ఓ ఆల్‌రౌండర్‌తో బరిలోకి దిగిన టీమిండియా ఈ మ్యాచ్‌తో పెద్ద సాహసమే చేసింది. 3 వికెట్లు తీసుకున్న ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్య, జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించినా, మరో స్పిన్నర్‌ లేని లోటు మాత్రం స్పష్టంగా కన్పించింది.

దినేష్‌ కార్తీక్‌.. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.?

ఇప్పటిదాకా రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమైపోయిన దినేష్‌ కార్తీక్‌ ఈ మ్యాచ్‌తో తుది జట్టులో చోటు సంపాదించుకున్నాడుగానీ, అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

సుదీర్ఘ కాలం తర్వాత దినేష్‌ కార్తీక్‌కి (Dinesh Karthik) వరల్డ్‌ కప్‌ (World Cup) మ్యాచ్‌లో ఆడే అవకాశం దక్కింది. ఈ మ్యాచ్‌లో ఫెయిల్‌ అవడంతో, తదుపరి మ్యాచ్‌లకు అతన్ని జట్టు మేనేజ్‌మెంట్‌ కొనసాగిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

Related Post

australia, team india

టీమిండియా విక్టరీ: ఇదీ హిస్టరీ.!

Posted by - December 10, 2018 0
అడిలైడ్‌ టెస్ట్‌లో (Adelaide Test) టీమిండియా (Team India) విజయాన్ని అందుకుంది. అనేక రికార్డులు ఈ మ్యాచ్‌తో బద్దలయ్యాయి. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాని (Australia) చిత్తు చేయడమంటే అది…

మెన్ ఇన్ బ్లూ.. ఈ దాహం తీరనిది.!

Posted by - July 8, 2019 0
ఈసారి వరల్డ్‌ కప్‌ పోటీల్లో టీమిండియా (Team India World Cup 2019 Winner) బ్యాటింగ్‌ సెన్సేషన్‌ ఎవరంటే, తడుముకోకుండా వచ్చే సమాధానం రోహిత్‌ శర్మ అనే.…
King Kohli

కోహ్లీ ఊచకోత: 10,000 నాటౌట్‌

Posted by - October 24, 2018 0
ఇండియన్‌ క్రికెట్‌లో ‘విరాట’ పర్వం కొనసాగుతోంది. కాదు కాదు, అంతర్జాతీయ క్రికెట్‌లోనే విరాట్‌ కోహ్లీ తన ప్రస్థానాన్ని ఇంకెవరికీ సాధ్యం కాని రీతిలో కొనసాగిస్తున్నాడు. రికార్డులన్నీ విరాట్‌…

పసికూనపై మెన్ ఇన్ బ్లూ గెలుపు

Posted by - September 19, 2018 0
క్రికెట్‌లో అగ్ర జట్లలో ఒకటి టీమిండియా (Team India). పసికూన హాంగ్‌ కాంగ్‌ (Hong Kong). అయితే, మైదానంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. పిచ్‌ కండిషన్స్‌…

బిగ్ విన్: కంగారూలకు టీమిండియా షాక్

Posted by - June 10, 2019 0
వరల్డ్‌ కప్‌ పోటీల్లో ‘ఆట’ని కాస్త లేటుగా మొదలు పెట్టినా, లేటెస్ట్‌గా సంచలనాల్ని షురూ చేసింది టీమిండియా. ఆల్రెడీ సౌతాఫ్రికాపై బంపర్‌ విక్టరీ కొట్టిన ‘మెన్‌ ఇన్‌…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *