రోహిత్ శర్మపై అనవసర పొగడ్తలు ఎక్కువవుతున్నాయా.?
Rohit Sharma India Australia.. రోహిత్ శర్మ.. హిట్ మ్యాన్.. టీమిండియా కెప్టెన్.! ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా ఇప్పటిదాకా ఓటమిని చవిచూడలేదు.!
ఒకదాన్ని మించిన విజయం ఇంకోటి.! ఇంకొక్కటి గెలిచేస్తే, ఛాంపియన్‌షిప్ మన చేతుల్లోనే.! వన్డే వరల్డ్ కప్ మన సొంతమైపోతుంది.
నో డౌట్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకి ఈ ఘనతలో మెజార్టీ భాగం దక్కుతుంది. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగి, చితక్కొట్టేసి.. వెళుతున్నాడు.
అంతేనా, కెప్టెన్సీ పరంగా చూసుకుంటే రోహిత్ శర్మ అత్యద్భుతం.! నాయకుడిగా, జట్టుని నడిపిస్తున్నాడు. చెయ్యాల్సినదంతా చేస్తున్నాడు.
Rohit Sharma India Australia.. రోహిత్ శర్మకి గెలవడమెలాగో తెలుసు..
ఔను.. రోహిత్ శర్మకి గెలవడమెలాగో తెలుసు.. గెలిపించడమెలాగో తెలుసు.! కానీ, ఇది కూడా ఓ ఆట మాత్రమే. ఆట అన్నాక గెలుపోటములు సహజం.
జట్టు గెలుపు.. అంటే, జట్టులోని సభ్యులందరిదీ ఆ గెలుపు. గెలుపు సమిష్టి కృషి. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ టీమిండియా రాణిస్తోంది. అదే ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా ఈ స్థాయి విజయాలు సాధించడానికి కారణం.
మాజీ క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు, క్రికెట్ అభిమానులు.. జట్టు ఆటగాళ్ళని పేరు పేరునా ప్రస్తావిస్తూ, అవసరానికి మించి పొగిడేస్తున్నారా.? అంటే, కాదనే చెప్పాలి.
కాకపోతే, ఈ పొగడ్తలు రేప్పొద్దున్న ఫలితం తేడాగా వచ్చినా, ఇలాగే వుంటాయా.? అన్నదే ప్రశ్న.!
గతంలోనూ టీమిండియా అత్యద్భుతంగానే ప్రదర్శన చేసింది. కానీ, కొన్ని కలిసి రాలేదంతే.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా మూడు విభాగాల్లోనూ టీమిండియా బలంగానే వున్నా.. కొన్ని బలహీనతలూ లేకపోలేదు. ఫీల్డింగ్ పరంగా సమస్యలున్నాయ్.
Also Read: సిన్నోడా.! భలేగా చందమామ గుట్టు విప్పేస్తున్నావ్ రా.!
ఆస్ట్రేలియాతో విషయం అంత ఈజీగా వుండదు.! ఆస్ట్రేలియా క్రికెటర్లు భారత పిచ్‌లకు, ఇక్కడి వాతావరణానికీ బాగా అలవాటు పడిపోయారు.
ఫీల్డింగ్ ఆస్ట్రేలియా ప్రధాన బలం. బౌలింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బ్యాటింగ్ కూడా అంతే.
ఒక్క అడుగు.. ఇంకాస్త బలంగా వేసి తీరాల్సిన సమయమిది. 2023 వన్డే వరల్డ్ కప్ టీమిండియా సొంతమవ్వాలని ఆశిద్దాం.! అందాకా, ఈ పొగడ్తల్ని ఎంజాయ్ చేద్దాం. ఆ తర్వాత పండగ చేసుకుందాం.!