RRR Movie: తెలుగు సినిమాకి ఇదేం ఖర్మ.?
RRR Movie Goes Global తెలుగు సినిమానే.! నటించింది తెలుగు హీరోలే. కాకపోతే, రెండు కులాలకు చెందినవారు.! అదే అసలు సమస్య అయి కూర్చుందిప్పుడు కొంతమంది ఇడియట్స్‌కి.!
కుల గజ్జితో కొట్టుకు ఛస్తున్నారు సోకాల్డ్ అభిమానులు. అసలు వాళ్ళు అభిమానులేంటి.? అభిమానం ముసుగేసుకున్న కేటుగాళ్ళు.!
మన తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటోంటే ఓర్వలేనితనాన్ని ఏమనాలి.?
జూనియర్ ఎన్టీయార్ అభిమానుల ముసుగులో తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయిలో పలచన చేస్తోంది ఓ మాఫియా.!
ఎన్టీయార్ మాత్రమే కాదు.. ఆయా హీరోలంతా ఈ తరహా ఫేక్ అభిమానుల విషయంలో అప్రమత్తంగా వుండాల్సిందే.
లేదంటే, తెలుగు సినిమా జాతీయ స్థాయికి, అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని మురిసిపోయేలోపు.. అంతటా తెలుగు సినిమా పరువు పోయే ప్రమాదమూ లేకపోలేదు.!
Mudra369
జూనియర్ ఎన్టీయార్ కావొచ్చు.. రామ్ చరణ్ కావొచ్చు.. ఇద్దరూ తెలుగు హీరోలే కదా.? ఎందుకీ ఓర్వలేనితనం.? రామ్ చరణ్ ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రెజెంటర్‌గా పాల్గొనడం నేరమైపోయింది.
RRR Movie Goes Global.. జూనియర్ ఎన్టీయార్ అభిమానుల ముసుగులో..
మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగి రామ్ చరణ్‌ని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారట. ఎవరో రామ్ చరణ్ కోసం కోట్లు ఖర్చు చేసి పీఆర్ నడిపిస్తున్నారట.
ఏంటిదంతా.? ఏకంగా, విదేశీ సెలబ్రిటీల్ని అమ్ముడుపోయారంటూ వెటకారం చేస్తే ఎలా.? ఒకామె అయితే, ఈ ‘ర్యాగింగ్’పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆమె ‘హెచ్‌సిఎ’ అవార్డుల జ్యూరీ మెంబర్ మోనిక.
తెలుగు సినిమా అంటే.. కాదు కాదు, ఇండియన్ సినిమా అంటే అంతర్జాతీయ సమాజానికి అసహస్యం పుట్టించేలా సోకాల్డ్ దురభిమానులు వ్యవహరిస్తున్నారు.
సాధారణ సినీ అభిమానులు, వాళ్ళకి క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తోంది.
ఆస్కార్ వచ్చినా అంతేనా.?
‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ఆస్కార్ వచ్చినా అంతేనేమో.! ఆస్కార్ జ్యూరీ అమ్ముడుపోయిందంటారేమో.! హాలీవుడ్ మేకర్స్, ఇండియాకి రండి.. అంటూ రామ్ చరణ్ విజ్ఞప్తి చేశాడు.
యంగ్ టైగర్ ఎన్టీయార్ అయినా అదే చెబుతాడు. కానీ, హాలీవుడ్ నుంచి వాళ్ళెవరూ ఇండియాకి వచ్చేలా వుండవేమో పరిస్థితులు.
సోషల్ మీడియాలో కూర్చుని, అశుద్ధం మొహానికి పూసుకుని కామెంట్లేస్తే ఎంత అసహ్యంగా వుంటుంది.?
Also Read: ఇదీ రామ్ చరణ్ విక్టరీ.! లెంపలేసుకో యండమూరీ.!
‘ఆర్ఆర్ఆర్’ అంటే, ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా మారింది. రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీయార్.. ఇప్పుడు ఇండియన్ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు.
అభిమానులు కాస్తా హీరోల స్థాయిని దిగజార్చే ‘అల్లరి బ్యాచ్’లా తయారవుతుండడం బాధాకరం.!
నిర్మాణ సంస్థల్ని వేధిస్తున్నారు.. హీరోల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని చెడగొడుతున్నారు.
గతంలో ఎన్నడూ లేని అత్యంత భయంకరమైన పరిస్థితి ఇది.
సినిమా పరిశ్రమ అంతా ఒక్కతాటిపైకి వస్తున్న సందర్భంలో.. అభిమానులే సినీ పరిశ్రమని పాతాళంలోకి తొక్కేసేలా వున్నారు.!
అందరూ కాదు, కొందరి కారణంగా.. అందరు అభిమానుల మీదా మచ్చ పడుతోంది.!
Mudra369
కుల గజ్జి పక్కన పెట్టి.. ఇండియన్ సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో దక్కుతున్న గౌరవాన్ని చూసి గర్వపడండి. అది మన తెలుగు సినిమా అని ఇంకాస్త గర్వపడండి.! గర్వపడటం చేతకాకపోతే, మూసుక్కూర్చోండంతే.!