Saaho Prabhas

‘సాహో’ వసూళ్ళ రచ్చ: డార్లింగ్‌ ‘రెబల్‌ ‘ దెబ్బ

194 0

బాక్సాఫీస్‌ మీద డార్లింగ్‌ ప్రభాస్‌ (Prabhas All India Star) దెబ్బ ఎలా వుంటుందో తెలుసా.? ఆ విషయం ‘బాహుబలి’ని చూస్తే తెలుస్తుంది.? అదొక్కటే కాదు, ఇదిగో.. ఇంకోటొచ్చింది. అదే ‘సాహో’.. సినిమాకి చాలా నెగెటివ్‌ రివ్యూలొచ్చాయ్‌. కొందరైతే ఒకటిన్నర రేటింగులు ఇచ్చారు. కానీ, అవేవీ ‘సాహో’ మేనియాని ఆపలేకపోయాయ్‌.

రివ్యూల్ని బలాదూర్‌ అనేశారు సినీ ప్రేక్షకులు. తెరపై ప్రభాస్‌ (Rebel Star Prabhas) తప్ప ఇంకేమీ కన్పించడంలేదు సగటు సినీ అభిమానికి. ‘ఇండియన్‌ సినిమా హీరో ఏంటి.? హాలీవుడ్‌ హీరోలా మారిపోవడమేంటి.?’ అన్న ఆశ్చర్యమే దేశమంతటా కన్పిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశమంతా ఇదే మాట. ఆ మాటకొస్తే, ఇతర దేశాల్లో ‘బాహుబలి’ చూసిన, చూడాలనుకున్న ప్రేక్షకుల ఆలోచన కూడా ఇదే.

Read This Too: Saaho Preview: Silver Screen Wonder!

అందుకే, వసూళ్ళ ప్రభంజనం కన్పిస్తోంది. పది.. పాతిక కాదు.. ఏకంగా 130 కోట్ల గ్రాస్‌ తొలి రోజే ‘సాహో’ దక్కించుకుంది. ఇంతకన్నా ‘సాహో’ (Saaho) నుంచి ఏం ఆశించగలం.? కాదు కాదు, ఇంకా ఆశించాలి. ‘వినయ విధేయ రామ’ సినిమా గుర్తుంది కదా.? డిజాస్టర్‌ టాక్‌తో దాదాపు 70 కోట్ల షేర్‌ దక్కించుకుంది.

‘సాహో’ ఇండియన్‌ సినిమా.. ఎన్ని కోట్లు కొల్లగొడుతుందో, ఎన్ని రికార్డుల్ని అదరగొడ్తుందో ముందు ముందు తెలియనుంది. అత్యద్భుతమైన అంచనాల నడుమ తొలి రోజు ఓపెనింగ్స్‌ అదిరిపోవడం సహజమే. రెండో రోజు కూడా ఎక్కడా జోరు తగ్గలేదు. టాక్‌ని అసలు ఆడియన్స్‌ పట్టించుకోలేదనడానికి రెండో రోజు థియేటర్ల వద్ద క్యూ కట్టిన జనమే నిదర్శనం.

తెలుగు రాష్ట్రాల్లో ‘నాన్‌ బాహుబలి’ (Non Baahubali) రికార్డులు దాదాపుగా గల్లంతయిపోయాయని ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. మరోపక్క, బాలీవుడ్‌లో ప్రభంజనం సంగతి సరే సరి. ఎవరైతే ఒకటిన్న రేటింగ్‌ ఇచ్చాడో, సదరు మహానుభావుడే.. తొలి రోజు ‘సాహో’ రికార్డుల గురించి గొప్పగా చెప్పాడు. అదీ ‘సాహో’ పవర్‌ అంటే.

Read This Too: ‘సాహో’: ప్రభాస్‌ సెన్సేషన్‌.. రికార్డులన్నీ గల్లంతే.!

దాదాపు 300 కోట్లతో ‘సాహో’ రూపొందింది. డిజాస్టర్‌ టాక్‌తోనూ సినిమా సేఫ్‌ జోన్‌లోకి వెళ్ళిపోతుందా.? లాభాలు రాబట్టి కొత్త చరిత్ర సృష్తిస్తుందా.? వేచి చూడాల్సిందే.

Related Post

కౌశల్‌ది వేట, వాళ్ళది దొంగాట

Posted by - September 25, 2018 0
సైలెంట్‌గా కూర్చున్న కౌశల్‌ని కెలికి మరీ, రచ్చకు కారణమయ్యింది దీప్తి నల్లమోతు. దీప్తి అడిగిన ప్రశ్నకు కౌశల్‌ సమాధానమిస్తే, ‘నీలో మెచ్యూరిటీ లెవల్స్‌ చాలా తక్కువ’ అంటూ…
Sarileru Neekevvaru

మేజర్‌ అజయ్‌ కృష్ణ సర్‌ప్రైజ్‌.. సరిలేరు నీకెవ్వరూ.!

Posted by - August 9, 2019 0
సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు (Happy Birthday Mahesh) పుట్టినరోజు.. అంటే, ఆ కిక్‌ ఎలా వుంటుందో తెలుసా.? ట్వీట్లు పోటెత్తుతాయ్‌.. వ్యూస్‌ అదిరిపోతాయ్‌.. అవును, నిజంగానే ట్విట్టర్‌…

‘సాహో’ టీజర్‌కి రాజమౌళి రివ్యూ చూశారా.?

Posted by - June 13, 2019 0
ఎప్పుడెప్పుడా అని మొత్తం భారతీయ సినీ ప్రపంచం ఎదురు చూస్తున్నారు ‘సాహో’ (Saaho) కోసం. అందరి అంచనాల్ని మించేలా ‘సాహో’ (Saaho Teaser Rajamouli Review) టీజర్‌…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *