సచిన్‌ టెండూల్కర్‌తో విరాట్ కోహ్లీని పోల్చగలమా.?

 సచిన్‌ టెండూల్కర్‌తో విరాట్ కోహ్లీని పోల్చగలమా.?

Sachin Tendulkar Virat Kohli

Sachin Tendulkar Vs Kohli.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. ‘కింగ్’ విరాట్ కోహ్లీ.! ఒకరేమో, క్రికెట్‌కి గుడ్ బై చెప్పి చాలాకాలమే అయ్యింది. ఇంకొకరేమో, రిటైర్మెంట్‌కి కాస్త దగ్గర్లో వున్నారు.!

అసలు, ఈ ఇద్దర్నీ పోల్చగలమా.? సచిన్ టెండూల్కర్ వన్డేల్లో 49 సెంచరీలు కొడితే, ఆ రికార్డుని విరాట్ కోహ్లీ తాజాగా సమం చేశాడు.

ఈ నేపథ్యంలో ఎవరు గొప్ప.? అన్న చర్చని కొందరు ‘మేతావులు’ తెరపైకి తెచ్చారు.! నో డౌట్, సచిన్ టెండూల్కరే గొప్ప.! ఈ విషయాన్ని స్వయంగా విరాట్ కోహ్లీ చెప్పాడు.!

Sachin Tendulkar Vs Kohli.. సచిన్ గొప్పే.. కానీ, విరాట్ కోహ్లీ అంటే..

సచిన్ టెండూల్కర్ చాలా చాలా గొప్ప.! మరి, విరాట్ కోహ్లీ సంగతేంటి.? విరాట్ కోహ్లీ కూడా మేటి క్రికెటర్.! అతని గొప్పతనం, ఆయన సొంతం చేసుకున్న గణాంకాల రూపంలోనే కనిపిస్తోంది కదా.!

ఛేదనలో చెలరేగిపోయే విరాట్ కోహ్లీ గురించి తక్కువగా మాట్లాడగలమా.? టీమిండియాకి ఎన్నో అపురూపమైన విజయాల్ని అందించాడు విరాట్ కోహ్లీ.!

Sachin Tendulkar Virat Kohli
Sachin Tendulkar Virat Kohli

ఒకానొక దశలో సచిన్ టెండూల్కర్ కూడా ఫామ్ కోల్పోయాడు చాలామంది క్రికెటర్లలానే. అప్పట్లో, ‘సచిన్ టీమిండియాకి భారం’ అనుకున్నారు. కానీ, ఆ సచిన్.. ఆ ఊపులోనే వన్డేల్లో డబుల్ సెంచరీ కొట్టాడు.

విరాట్ కోహ్లీ సంగతి సరే సరి. పనైపోయింది, క్రికెట్ నుంచి తప్పుకోవాల్సిందేనని విరాట్ కోహ్లీకి కొందరు ఉచిత సలహా ఇస్తే, వారికీ బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు.

నిజానికి, సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడిన సమయంలో వున్న పరిస్థితులు వేరు. అప్పటి బౌలింగ్, ఫీల్డింగ్, పిచ్ కండిషన్లు వేరు.

Also Read: స్నాక్స్ అండ్ గా‘చిప్స్’.! ఇక మొదలెడదామా.?

ఇప్పుడు, క్రికెటర్లకు అందుబాటులో వున్న వనరులు వేరు. ఈ పరిస్థితులూ వేరు. సచిన్ టెండూల్కర్, విచాట్ కోహ్లీ.. ఒకరితో ఒకరికి పోలికపెట్టి, ఒకర్ని తక్కువ చేయడం తగని పని.

కోహ్లీని పొగుడుతూ, సచిన్ టెండూల్కర్‌ని ట్రోల్ చేయడమంటే, క్రికెట్ పట్ల కనీసపాటి అవగాహన లేదనే అర్థం.!

Digiqole Ad

Related post