Samyuktha Menon: గుర్రమెక్కావ్.! ఏంటి సంగతి.?
Samyuktha Menon Swayambhu.. సంయుక్త మీనన్ తెలుసు కదా.? అదేనండీ, ‘భీమ్లా నాయక్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైందీ బ్యూటీ.!
తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోన్న ఈ బ్యూటీ.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది.!
‘బింబిసార’ లాంటి కమర్షియల్ సక్సెస్ వచ్చినా, ఇంకా నిఖార్సయిన స్టార్‌డమ్ ఆమెకు రాలేదనే చెప్పాలి.! అయితేనేం, ‘మంచి నటి’ అన్న ‘మంచి పేరు’ అయితే తెచ్చుకుంది సంయుక్త మీనన్.
ఈ మధ్యనే ‘డెవిల్’ సినిమాలోనూ కనిపించింది సంయుక్త మీనన్. కళ్యాణ్ రామ్‌తో (Nandamuri Kalyan Ram) ఆమెకిది రెండో తెలుగు సినిమా.!
Samyuktha Menon Swayambhu.. కొత్తగా.. సరికొత్తగా..
ఇక, అసలు విషయానికొస్తే, 2024 తనకు చాలా చాలా ప్రత్యేకమైన సంవత్సరం అనీ, ఈ కొత్త సంవత్సరంలో చాలా చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాననీ సంయుక్త మీనన్ చెప్పుకొచ్చింది.
చూస్తున్నారు కదా.. ఆ గుర్రమెక్కిన ఫొటోని తాజాగా సోషల్ మీడియాలో సంయుక్త మీనన్ (Samyuktha Menon Horse Riding) షేర్ చేసింది.
‘స్వయంభు’ (Swayambhu) పేరుతో తెరకెక్కుతోన్న సినిమాలో సంయుక్త మీనన్ నటిస్తోంది. నిఖిల్ సిద్దార్ధ్ ఈ సినిమాలో హీరో.
పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కాబోతోంది.! ట్రెండ్ మారింది. సినిమా కోసం ఏం చేయడానికైనా వెనుకాడ్డం లేదు నటీనటులు.!
Also Read: పద్ధెనిమిదేళ్ళ తర్వాత.! ఇంత గ్యాప్ ఎందుకో.!
గుర్రపు స్వారీ దగ్గర్నుంచి కష్టమైన కసరత్తులు.. వాట్ నాట్.. ఏమైనా చేసేస్తున్నారు. సంయుక్త మీనన్‌ని ఈ గుర్రపు స్వారీ విషయంలో అభినందించి తీరాల్సిందే.
అన్నట్టు, నన్ను నమ్మండి.. ఈ సినిమా చాలా చాలా స్పెషల్.! అంటోంది సంయుక్త మీనన్.
మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ (Supreme Hero Sai Dharam Tej) హీరోగా నటించిన ‘విరూపాక్ష’ సినిమాలో సంయుక్త మీనన్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయ్.
ఈసారి అంతకు మించి.. అనే స్థాయిలో సంయుక్త మీనన్ (Samyuktha Menon) పాత్ర ‘స్వయంభూ’ సినిమాలో వుండబోతోందిట.!