Sania Mirza Divorce.. సెలబ్రిటీలకు సంబంధించి ఏ చిన్న విషయానికైనా బోల్డంత క్రేజ్ వుంటుంది.!
ఫలానా హీరో వేసుకున్న షర్టు ధరెంతో తెల్సా.? ఫలానా హీరోయిన్ హ్యాండ్ బ్యాగ్ ఖర్చెంతో తెల్సా.? వంటి ప్రశ్నలతో వార్తల్ని చూస్తుంటాం.!
మరి, సెలబ్రిటీల విడాకులకు ఇంకెంత క్రేజ్ వుండాలె.! టెన్నిస్ సంచలనం సానియా మీర్జా విడాకులు తీసుకుందట.. అన్నది లేటెస్ట్ అండ్ ట్రెండీ టాపిక్.!
Sania Mirza Divorce.. విడాకులు ఇచ్చేది వాళ్ళే..
ఎక్కడో ఏదో గాలి వార్త పుడుతుంది.. ఆ తర్వాత అది నిజమై కూర్చుంటుంది.! నిప్పు లేకుండా పొగ రావడం కాదు.. ఈ గాలి వార్తలే, సెలబ్రిటీల కొంపల్లో కుంపట్లు రాజేసిన సందర్భాలనేకం.!

ఆ విషయాన్ని పక్కన పెడితే, అక్కినేని నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకుంటోందని పుట్టుకొచ్చిన పుకార్లు.. చివరికి నిజం అయ్యాయ్.
సానియా మీర్జా విషయంలోనూ అదే జరిగింది.! పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో కొన్నేళ్ళ క్రితం సానియా మీర్జాకి వివాహం జరిగిన సంగతి తెలిసిందే.
షోయబ్ మాలిక్ రెండో పెళ్ళితో బయటపడ్డ విడాకుల బాగోతమ్.!
తాజాగా, షోయబ్ మాలిక్ ఇంకో పెళ్ళి చేసుకున్నాడు. షోయబ్ మాలిక్ తాజా పెళ్ళితో, సానియా మీర్జా విడాకుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అద్గదీ అసలు సంగతి.

నిజానికి సానియా మీర్జా వివాహం షోయబ్ మాలిక్‌తో నాటకీయ పరిణామాల నడుమ జరిగింది. తొలుత ఓ హైద్రాబాదీ కుర్రాడితో వివాహం నిశ్చయమైంది సానియా మీర్జాకి.
Also Read: Maldieves Vs Lakshadweep: మాల్దీవులంటేనే మంటెత్తిపోతోంది
ఆ తర్వాత అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముందు అనుకున్న ‘సంబంధం’ చెడింది.. రేసులోకి షోయబ్ మాలిక్ దూసుకొచ్చాడు.
అలా, పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్, హైద్రాబాదీ అల్లుడయ్యాడు.. ఇప్పుడేమో, సానియా మీర్జాకి మాజీ భర్త అయ్యాడు.

అప్పట్లో సానియా మీర్జా ఎంగేజ్మెంట్ రద్దవడానికీ, ఇప్పుడు షోయబ్ మాలిక్‌తో సానియా మీర్జా వైవాహిక బంధం తెగిపోవడానికీ.. ఓ సినీ నటుడు కారణమంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయ్.!
గాలి వార్తలు పోగెయ్యడం పెద్ద కష్టమేమీ కాదు.! అలాంటిదేనా ఈ గాలి వార్త కూడా.? అంతేనేమో.!