మహేష్‌ వర్సెస్‌ అల్లు అర్జున్‌.. ఎవరి దమ్మెంత.?

192 0

ఒకరేమో సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు.. ఇంకొకరేమో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. ఇద్దరూ కమర్షియల్‌ స్టామినా వున్న స్టార్‌ హీరోలే. ఈ సంక్రాంతికి తమ తమ సినిమాలు ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’లతో (Sarileru Neekevvaru Ala Vaikunthapurramuloo) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Also Read: మహేష్‌ ‘సూపర్‌’ మాస్‌: ‘సరిలేరు’ దద్దరిల్లిపోతుందంతే.!

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకుడు కాగా, ‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ (Trivikram Srinivas) తెరకెక్కించాడు. అటు హీరోలు, ఇటు దర్శకులే కాదు, హీరోయిన్ల పరంగానూ ఈ రెండు సినిమాలకీ క్రేజ్‌ ఓ రేంజ్‌లో వుంది.

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి హీరోయిన్‌ రష్మిక మండన్నతోపాటు (Rashmika Mandanna), స్పెషల్‌ సాంగ్‌ చేసిన తమన్నా (Tamannah Bhatia) అదనపు అడ్వాంటేజ్‌.

Also Read: స్టైలిష్‌గా ‘అల..’.. అదరగొట్టేస్తోందిలా.!

మరోపక్క, ‘అల వైకుంఠపురములో’ సినిమాకి హీరోయిన్‌ పూజా హెగ్దేతోపాటు (Pooja Hegde) మరో హీరోయిన్‌ నివేదా పేతురాజ్‌ (Nivetha Pethuraj) స్పెషల్‌ అడ్వాంటేజ్‌ కాబోతోంది.

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో సీనియర్‌ నటి విజయశాంతి (Vijayashanthi) నటిస్తే, ‘అల వైకుంఠపురములో’ సినిమా కోసం టబుని (Tabu) తీసుకున్నారు.

‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru) సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తే, ‘అల వైకుంఠపురములో’కి తమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. రెండు ఆల్బమ్స్‌ మ్యూజికల్‌గా పెద్ద హిట్స్‌.

టీజర్స్‌, ట్రైలర్స్‌.. కాస్త అటూ ఇటూ ఒకే స్థాయిలో రెండు సినిమాలూ హల్‌చల్‌ చేశాయి. ప్రమోషన్స్‌ విషయంలో మాత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ చాలా అడ్వాన్స్‌డ్‌గా వుంది.. ‘అల వైకుంఠపురములో’ టీమ్‌ కొంత వెనుకబడింది.

ఇంతకీ, సంక్రాంతి బరిలో ఏ పుంజు సత్తా ఎంత.?

రెండు కాదు, మూడు కాదు, నాలుగు సినిమాలైనా సంక్రాంతి సీజన్‌లో రిలీజయితే ప్రేక్షకులు ఆదరిస్తారు. సినిమాల్లో కంటెంట్‌ కాస్త పాజిటివ్‌గా అనిపిస్తే చాలు ఓ మోస్తరు సినిమాని సూపర్‌ డూపర్‌ హిట్‌ చేసేస్తారు ఆడియన్స్‌. సంక్రాంతి సీజన్‌కి వున్న అడ్వాంటేజ్‌ అది.

సో, ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru), ‘అల వైకుంఠపురములో’ (Ala Vikunthapurramuloo) సినిమాల్లో కంటెంట్‌ ఎంత.? అన్నదానిపైనే వాటి సక్సెస్‌ రేట్‌ ఆధారపడి వుంటుందన్నమాట. ప్రస్తుతానికైతే రెండిటికీ ఓపెనింగ్స్‌ అదిరిపోతాయని నిస్సందేహంగా చెప్పొచ్చు.

ఓపెనింగ్స్‌ పరంగా చూస్తే మళ్ళీ మహేష్‌కే (Super Star Maheshbabu) అడ్వాంటేజ్‌ ఎక్కువ. అదే సమయంలో మహేష్‌ సినిమా తేడా కొట్టిందంటే, అల్లు అర్జున్‌కి (Stylish Star Allu Arjun) అది అదనపు అడ్వాంటేజ్‌ అయి కూర్చుంటుంది.

సంక్రాంతి సీజన్‌ కదా.. ఈ రెండు సినిమాలూ (Sarileru Neekevvaru Ala Vaikunthapurramuloo) బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయాలని కోరుకుందాం.

ముచ్చటగా మూడోదీ వుందండోయ్‌..

సైలెంటుగా రేసులోకి దూసుకొచ్చాడు నందమూరి కళ్యాణ్‌రామ్‌ (Nandamuri Kalyanram).

పెద్ద సినిమాలతో పోటీ.. అన్న టెన్షన్‌ లేదు ఈ నందమూరి హీరోకి. ఎందుకంటే, సంక్రాంతి సీజన్‌లో మూడో సినిమాకీ అవకాశమిస్తారు ఆడియన్స్‌ అనే నమ్మకం కళ్యాణ్‌రామ్‌కి వుంది మరి.

‘ఎంత మంచివాడవురా’ (Entha Manchivaadavura) అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తోన్న నందమూరి కళ్యాణ్‌రామ్‌ సరసన హీరోయిన్‌గా నటించింది మెహ్రీన కౌర్‌ (Mehreen Kaur Pirzada). ఈ చిత్రానికి ‘శతమానంభవతి’ ఫేం సతీష్‌ వేగేశ్న దర్శకుడు.

మొత్తమ్మీద, ఎవరి స్టామినా ఎంత.? అనే విషయాన్ని పక్కన పెట్టి.. ఒకటి కాదు, రెండు కాదు.. మొత్తంగా మూడు తెలుగు సినిమాలూ ఈ సంక్రాంతికి (Pongal) బాక్సాఫీస్‌ వద్ద కళకళ్ళాడాలని ఆశిద్దాం.

ఆయా హీరోల అభిమానులు ఈ సంక్రాంతి (Sankranthi) సీజన్‌లో గొడవలు పక్కన పెట్టేసి, ట్రోలింగ్‌ మానేసి.. ఎంచక్కా ఎంజాయ్‌ చేస్తే.. తెలుగు సినీ పరిశ్రమ కళకళ్ళాడుతుంది.

Related Post

అందానికి చిరునామా: 45 ఏళ్ళ ఐశ్వర్యం.!

Posted by - November 1, 2018 0
ఆమెకు 45 ఏళ్ళు అంటే ఎవరైనా నమ్మగలరా.? ఇంకో ఐదేళ్ళలో ఆమె 50 ఏళ్ళ వయసుకు చేరుకుంటుందంటే ఒప్పుకోగలమా.? వయసు పెరిగే కొద్దీ, తన అందాన్ని మరింతగా…

ట్రైలర్‌ రివ్యూ: అరవింద సమేత – ఎన్టీఆర్‌ సత్తా.!

Posted by - October 3, 2018 0
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నుంచి కొత్త సినిమా వస్తోందంటే, ఆ సినిమాపై వుండే అంచనాల తీరే వేరు. ఆకాశమే హద్దు.. అన్నట్లుంటాయి ఆ అంచనాలు. అలాంటిది మాటల…

‘నోటా’ ప్రివ్యూ: నయా సూపర్‌ స్టార్‌ విజయ్

Posted by - October 4, 2018 0
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త సూపర్‌ స్టార్‌ అవతరించాడు. అతని పేరు విజయ్‌ దేవరకొండ. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో హీరో ఫ్రెండ్‌ క్యారెక్టర్‌లో కన్పించిన విజయ్‌ దేవరకొండ,…
ram gopal varma

మీ..టూ.. వర్మ షాకయ్యాడండోయ్‌.!

Posted by - November 27, 2018 0
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, ఇతరులకు షాక్‌ ఇవ్వడంలో దిట్ట. అయితే, ఆయనే షాక్‌ అయ్యే విషయమొకటి వుందట. అదే ‘మీ..టూ..’. ‘మీ..టూ..’తో వర్మ ఎందుకు షాక్‌…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *