‘సరిలేరు నీకెవ్వరు’ ఫస్ట్‌ టాక్‌ ‘దద్దరిల్లిపోయింది’

646 0

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తాజా సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ ఫస్ట్‌ టాక్‌ (Sarileru Neekevvaru Review FDFS) ‘దద్దరిల్లిపోయింది’.

అవును, అందరి నోటా ఒకటే మాట.. సినిమా ‘దద్దరిల్లిపోయింది’ అనే. ఓవర్సీస్‌ రిపోర్ట్స్‌ కంటే ముందే, తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్‌ షోస్‌ నుంచి రిపోర్ట్స్‌ అందుతున్నాయి.

Also Read: ప్రివ్యూ: ‘సరిలేరు నీకెవ్వరు’ – బ్లాక్‌ బస్టర్‌!

నెవర్‌ బిఫోర్‌.. అన్న చందాన, యునానిమస్‌గా ‘సూపర్‌ హిట్‌.. బ్లాక్‌ బస్టర్‌..’ అనే మాటలే విన్పిస్తున్నాయి. మహేష్‌బాబు అభిమానులు, సాధారణ ప్రేక్షకుల నుంచీ సినిమాకి సూపర్బ్‌ టాక్‌ (Sarileru Neekevvaru Review FDFS) విన్పిస్తుండడం గమనార్హం.

మరోపక్క, నెగెటివ్‌ టాక్‌ని స్ప్రెడ్‌ చేసేందుకు ‘హేటర్స్‌’ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వాటిని అభిమానులు బీభత్సంగా తిప్పికొడుతున్నారు. ఇదిలా వుంటే, సోషల్‌ మీడియా వేదికగా సినిమాకి సంబంధించిన కొన్ని వీడియోల్ని కట్‌ చేసి పోస్ట్‌ చేసేస్తుండడం గమనార్హం.

దాదాపుగా ప్రతి పెద్ద సినిమాకీ ఈ తలనొప్పి తప్పడంలేదు. ‘సరిలేరు నీకెవ్వరు’ మీద ఇంకాస్త ఎక్కువ పగబట్టేశారేమో.. హేటర్స్‌, ఆ వీడియోల్ని ఎక్కువగా స్ప్రెడ్‌ చేసేస్తున్నారు.

ఏదిఏమైనా, ఫస్ట్‌ టాక్‌ సూపర్‌ పాజిటివ్‌గా వచ్చింది గనుక.. దీన్ని నిలబెట్టే సత్తా మహేష్‌ అభిమానులకి వుందనడంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవ్‌.

ఫస్ట్‌ రివ్యూ (Sarileru Neekevvaru Review) అనీ, ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో రిపోర్ట్స్‌ అనీ.. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న కామెంట్స్‌లో నూటికి తొంభై తొమ్మిది శాతం.. అంటే, 99 పర్సంట్‌ సూపర్‌ హిట్‌ అనే కన్పిస్తుండడం గమనార్హం. మహేష్‌బాబు ముందే చెప్పాడు.. దద్దరిల్లిపోద్దని.! అదే నిజమయ్యేలా వుంది.

Related Post

రౌడీ హీరోతో పూరి కనెక్ట్: ఇస్మార్ట్‌ ‘సీక్రెట్‌’?

Posted by - August 12, 2019 0
ఇస్మార్ట్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది. ఈ సారి రౌడీస్‌ని మెప్పించే అనౌన్స్‌మెంట్‌ అది. ఇంతకీ ఏంటా.? ఇస్మార్ట్‌ అనౌన్స్‌మెంట్‌. రౌడీస్‌కి ఇది హ్యాపీ న్యూస్‌. నిజంగానే ఇది బిగ్‌…

ప్రివ్యూ: ‘యాత్ర’

Posted by - February 4, 2019 0
మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి (Mammooty) ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘యాత్ర’ (Yatra Preview). దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి (YS Rajasekhar Reddy) కాంగ్రెస్‌…

కౌశల్‌ది వేట, వాళ్ళది దొంగాట

Posted by - September 25, 2018 0
సైలెంట్‌గా కూర్చున్న కౌశల్‌ని కెలికి మరీ, రచ్చకు కారణమయ్యింది దీప్తి నల్లమోతు. దీప్తి అడిగిన ప్రశ్నకు కౌశల్‌ సమాధానమిస్తే, ‘నీలో మెచ్యూరిటీ లెవల్స్‌ చాలా తక్కువ’ అంటూ…

టీజర్‌ రివ్యూ: ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’

Posted by - October 29, 2018 0
మాస్‌ మహరాజ్‌ రవితేజ (Mass Maharaj Raviteja) హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ని…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *