Sarileru Neekevvaru Review Mudra 369

ప్రివ్యూ: ‘సరిలేరు నీకెవ్వరు’ – బ్లాక్‌ బస్టర్‌!

867 0

జాతర మొదలయ్యింది.. థియేటర్ల ప్రాంగణాలు సూపర్‌ స్టార్‌ అభిమానుల నినాదాలతో మార్మోగిపోతున్నాయి. ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru Preview) అంటూ తమ అభిమాన నటుడు మహేష్‌బాబుని కొనియాడుతున్నారు కల్ట్‌ ఫ్యాన్స్‌.

సంక్రాంతి పండగ ముందే వచ్చేసింది సూపర్ స్టార్ అభిమానులకి మరి. ఇంతకీ సినిమా ఎలా వుంది.? థియేటర్లలో ప్రీమియర్‌ షో పడక ముందే అభిమానుల తొందర ఇది.!

Also Read: మహేష్‌ ‘సూపర్‌’ మాస్‌: ‘సరిలేరు’ దద్దరిల్లిపోతుందంతే.!

బొమ్మ బ్లాక్‌ బస్టర్‌ అట.. అంటూ డిస్కషన్లు. ఓవర్సీస్‌ రిపోర్ట్‌ కెవ్వుకేక.. అంటూ సంబరాలు.. వెరసి, అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండాపోతోంది.

తెలుగు రాష్ట్రాల్లోనూ, ఓవర్సీస్‌లోనూ.. ఒకటే సందడి. మల్టీప్లెక్సులు.. ఊర మాస్‌ థియేటర్లు.. అన్నీ ఒకే స్థాయిలో సూపర్‌ స్టార్‌ అభిమానుల సందడితో దర్శనమిస్తున్నాయి. రికార్డు ఓపెనింగ్స్‌ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి రావడం ఖాయమని ఆల్రెడీ అభిమానులు డిసైడ్‌ అయిపోయారు.

Also Read: ‘డాంగ్‌ డాంగ్‌..’ మహేష్‌, తమన్నా కుమ్మేశారంతే..

‘ఈ సంక్రాంతికి వార్‌ వన్‌సైడే..’ అని అభిమానులు ధీమాగా చెబుతున్నారు. 100 కోట్లు అనేది చాలా చిన్న విషయమనీ, 150 కోట్లు ఖచ్చితంగా సినిమా షేర్‌ సాధిస్తుందని అభిమానులు బల్లగుద్ది మరీ నినదిస్తున్న సందర్భమిది. కనీ వినీ ఎరుగని రీతిలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి అభిమానుల హంగామా కన్పిస్తోంది.

Also Read: సరిలేరు ఏంథెమ్‌.. సైనికా నీకు సాటెవ్వరు.?

అయితే, ఇది ప్రతి సినిమాకీ చేసే సందడేననీ, సినిమా సినిమాకీ ఈ సందడి పెరుగుతుందే తప్ప తగ్గదని అభిమానులు ఉత్సాహంగా చెబుతున్నారు. ఆకాశాన్నంటే కటౌట్లు.. కళ్ళు చెదిరేంత పొడవున్న దండలు.. ఆకాశం మిరుమిట్లు గొలిపేలా బాణాసంచా.. ఇవన్నీ చూస్తే, ఒక్క మహేష్‌ అభిమానులకే ఈ హంగామా సాధ్యమేమో అన్పించకమానదు.

ఇంకెంత.. కొద్ది సమయం మాత్రమే.. ఫస్ట్‌ రిపోర్ట్‌ వచ్చేయబోతోంది.. ఆల్రెడీ బ్లాక్‌బస్టర్‌ ప్రీ రిలీజ్‌ టాక్‌ వచ్చేసిన తర్వాత.. ఫస్ట్‌ షో టాక్‌ వరకూ వేచి చూడటం కష్టమే. ఆ కష్టాన్ని ఇంకాస్త ఇష్టంగా ఎంజాయ్‌ చేస్తున్న అభిమానులకి, ఫస్ట్‌ షో టాక్‌ కూడా ‘బ్లాక్‌ బస్టర్‌’ (Sarileru Neekevvaru Preview) అని వినేయాలన్న తొందర వుండడం తప్పేమీ కాదు కదా.!

Related Post

vijay devarakonda, priyanka jawalkar

ట్యాక్సీ వాలా.. ఇది అందరి వాలా.!

Posted by - November 15, 2018 0
సినిమా అంటే 24 క్రాఫ్ట్స్‌ కష్టపడితే వచ్చే ఔట్‌పుట్‌. ఇందులో ఏ ఒక్క విభాగం సరిగ్గా పనిచేయకపోయినా అంతే సంగతులు. అందరూ సరిగ్గా పనిచేసినా, ఒక్కోసారి ‘లక్కు’…

దేవదాస్‌ ప్రివ్యూ: కిర్రాక్‌ మల్టీస్టారర్‌

Posted by - September 26, 2018 0
తెలుగులో మల్టీస్టారర్‌ చిత్రాలు చాలా చాలా అరుదుగా వస్తుంటాయి. కొత్త తరహా కథలు తెలుగు తెరపై సినిమాలుగా అలరించాలంటే మల్టీస్టారర్స్‌ ఎక్కువగా రావాల్సి వుంది. ఆ దిశగా…

‘మహర్షి’ ప్రివ్యూ: ‘సూపర్‌’ స్టామినా ఇదీ.!

Posted by - May 1, 2019 0
గత సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా కొత్త సినిమాపై ఆకాశాన్నంటే అంచనాల్ని పొందడమే ‘సూపర్‌’ స్టార్‌డమ్‌. ఆ స్టార్‌డమ్‌ సూపర్‌స్టార్‌ సొంతం. పరిచయం అక్కర్లేని ఆ సూపర్‌స్టార్‌…
pawan kalyan

ఫోర్బ్స్‌ కింగ్స్‌: ప‘వన్’.. ఎన్టీఆర్‌ 2, మహేష్‌ 3

Posted by - December 5, 2018 0
ఫోర్బ్స్‌ (Forbes) 2018 లిస్ట్‌ బయటకు వచ్చింది. ఇండియాలో ఈ ఏడాది అత్యధిక సంపాదన కలిగిన ప్రముఖుల లిస్ట్‌లో టాప్‌ ఛెయిర్‌ బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌కి…

బిగ్‌ స్కెచ్‌.. శ్రీముఖి గ్లామర్‌ బీభత్సం.!

Posted by - July 23, 2019 0
శ్రీముఖి (Sree Mukhi) రియల్‌ లైఫ్‌లో ఎలా వుంటుంది.? అనే సందేహం చాలామందికి కలుగుతుంటుంది. శ్రీముఖి అంటేనే జోష్‌. ‘పటాస్‌’ కామెడీ షో ద్వారా శ్రీముఖి (Sree…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *