మహేష్‌ ‘సూపర్‌’ మాస్‌: ‘సరిలేరు’ దద్దరిల్లిపోతుందంతే.!

163 0

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు అభిమానులు, ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru) అంటుంటారు. అదే ఇప్పుడు మహేష్‌బాబు (Super Star Maheshbabu) కొత్త సినిమా టైటిల్‌గా మారింది. జనవరి 11న ప్రేక్షకుల ఈ సినిమా (Sarileru Neekevvaru Trailer) ముందుకు వస్తోంది.

భారీ అంచనాల నడుమ.. అనేది చాలా చాలా చిన్న మాట. ఎందుకంటే, ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru) సినిమాపై ఏర్పడ్డ అంచనాలు అలాంటివి. ఆకాశమే హద్దు.. అన్న మాట కూడా చిన్నదేనేమో ఈ సినిమాపై అంచనాల విషయంలో.

ఇక, ఈ సినిమా ప్రీ-రిలీజ్‌ వేడుక హైద్రాబాద్‌లో జరిగింది. కనీ వినీ ఎరుగని స్థాయిలో ఈ ఈవెంట్‌ని సక్సెస్‌ చేశారు సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు (Super Star Mahesh Babu) అభిమానులు. మెగాస్టార్‌ చిరంజీవి (Mega Star Chiranjeevi) ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ సంగతి పక్కన పెడితే, సినిమా ట్రైలర్‌ (Sarileru Neekevvaru Trailer) వచ్చేసింది. ‘దద్దరిల్లిపోయింది..’ అంటున్నారు మహేష్‌ అభిమానులు ట్రైలర్‌ చూశాక.

థియేటర్లలో పండగ సంగతి తర్వాత, సంక్రాంతి పండగ అభిమానులకి ముందే వచ్చేసింది.. అదీ ట్రైలర్‌తోనే (Sarileru Neeekevvaru) కావడం గమనార్హం.

ఫుల్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ గ్యారంటీ.. అని ఈ సినిమా గురించి చెబుతూ వచ్చాడు దర్శకుడు అనిల్‌ రావిపూడి. ఆ ఎంటర్‌టైన్‌మెంట్‌ పవర్‌ ఏంటో ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru review) ట్రైలర్‌లో కన్పించింది. యాక్షన్‌, ఎమోషన్స్‌, పవర్‌ ఫుల్‌ డైలాగులకు కొదవే లేదు.

ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక కంప్లీట్‌ ప్యాకేజీ అనొచ్చు. చాలా కాలం తర్వాత విజయశాంతి (Vijayashanthi) ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చారు. ఆమె అప్పీయరెన్స్‌ ఈ సినిమాకి అదనపు ప్లస్‌ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ప్రకాష్‌రాజ్‌ పవర్‌ఫుల్‌ విలనిజం ఈ సినిమాకి మరో ఎస్సెట్‌.

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు (Super Star Maheshbabu) సంగతి సరే సరి. ఫుల్‌ ఆఫ్‌ ఎనర్జీతో కన్పిస్తున్నాడు మహేష్‌ అన్ని ఫ్రేమ్స్‌లోనూ.

దేవిశ్రీప్రసాద్‌ మ్యూజిక్‌, అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) టేకింగ్‌.. వీటికి తోడు నిర్మాణపు విలువలు.. అన్నీ కలిసి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాని 2020లో బెస్ట్‌ ఫిలింగా నిలపనున్నాయని ట్రైలర్‌ చూశాక అర్థమవుతోంది.

గత రికార్డులు కొల్లగొట్టి, సరికొత్త రికార్డులు సృష్టించడానికి ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru) సినిమాతో వస్తోన్న మహేష్‌.. (SSMB) ఆ ఫీట్‌ చాలా తేలిగ్గానే సాధించేలనే వున్నాడు.

Related Post

స్టైలిష్‌గా ‘అల..’.. అదరగొట్టేస్తోందిలా.!

Posted by - January 7, 2020 0
మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు, గురూజీ.. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ (Trivikram Srinivas) సినిమాల్లో ఏదో మ్యాజిక్‌ వుంటుంది. ఆ మ్యాజిక్‌ని ప్రతి సినిమాలోనూ (Ala Vaikunthapurramuloo Allu…

ప్రభాస్ ‘సాహో’ చాప్టర్ వన్ రివ్యూ: స్టైలిష్ మేకింగ్

Posted by - October 23, 2018 0
మామూలుగా అయితే మేకింగ్‌ వీడియో అంటాం. కానీ, ‘షేడ్స్‌ ఆఫ్‌ సాహో’ (Shades of Saaho) అంటూ చాప్టర్స్‌ వారీగా ఆ మేకింగ్‌ వీడియోల్ని విడుదల చేస్తోంది…

‘పందెం కోడి’తో స్వీట్‌ ఫైట్‌ ‘గురూ!

Posted by - October 17, 2018 0
విజయదశమి సందర్భంగా రెండు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడ్తున్నాయి. ఒకటి డైరెక్ట్‌ తెలుగు సినిమా ‘హలో గురూ ప్రేమకోసమే’ (Hello Guru Prema Kosame) కాగా,…
Saaho Prabhas

బాక్సాఫీస్‌పై ‘సాహో’ దండయాత్ర షురూ.!

Posted by - August 28, 2019 0
తీరంలో కెరటాలు పోటెత్తుతాయ్‌.. అంటూ ఓ సినిమాలో ప్రబాస్‌ పవర్‌ ఫుల్‌ డైలాగ్‌ చెబుతాడు. ఇప్పుడు ప్రబాస్‌ అంటే వసూళ్లు పోటెత్తుతాయ్‌.. అని బాక్సాఫీస్‌ లెక్కలు చెబుతున్నాయి.…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *