అందుకే స్టార్ హీరోయిన్ అవలేకపోయా: షాలిని పాండే

Shalini Pandey
Shalini Pandey Maharaj.. తెలుగు సినీ పరిశ్రమలో ‘అర్జున్ రెడ్డి’ ఓ సంచలనమైతే, ఆ సినిమాలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా ఓ సంచలనమే.
అలాగే, ‘అర్జున్ రెడ్డి’ సినిమాకి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga), ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన షాలిని పాండే కూడా ఓ సంచలనమేనన్నది నిర్వివాదాంశం.
కానీ, ఎందుకో ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) తర్వాత స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయింది షాలిని పాండే.! అవకాశాలు రాలేదా.? అంటే, వచ్చాయ్.! కాకపోతే, హిట్లు కొట్టలేకపోయిందంతే.
Shalini Pandey Maharaj.. చాలా కారణాలుంటాయ్..
అందం ఒక్కటే కొలమానం కాదు సినీ పరిశ్రమలో. నటనా ప్రతిభ కూడా ఒక్కోసారి సక్సెస్‌కి సహకరించకపోవచ్చు.! లక్ అనేది మాత్రం కలిసి రావాలంతే.

షాలిని పాండే విషయంలో లక్కు కలిసి రాలేదని అనుకోవాలేమో.! కాకపోతే, ఈ బ్యూటీ మాత్రం తాను సౌత్‌లో సక్సెస్ కాలేకపోవడానికి కారణం, బాడీ షేమింగ్.. అంటోంది.
తాను దారుణంగా బాడీ షేమింగ్ ఎదుర్కొన్నానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వాపోయింది షాలినీ పాండే. హిందీలో తాజాగా ‘మహారాజ్’ అనే సినిమాలో నటించిన షాలిని, దాంతో బాగానే పాపులారిటీ సంపాదించుకుంది.
చరణ సేవ..
తనను తాను దేవుడిగా ప్రకటించుకున్న ఓ వ్యక్తికి ‘చరణ్ సేవ’ చేసే యువతిలా కనిపిస్తుంది ‘మహారాజ్’లో షాలిని పాండే. ఆమె పాత్ర త్వరగానే ముగిసిపోతుందిలెండి.. అది వేరే సంగతి.

ఏదిఏమైనా, కాస్త బొద్దుగా కనిపించే షాలిని పాండే (Shalini Pandey), తాను బాడీ షేమింగ్‌కి గురయ్యానని చెప్పడం ఒకింత ఆశ్చర్యకరమైన విషయమే.
బొద్దుగా వున్న చాలా మంది హీరోయిన్లు, తెలుగు తెరపై రాణించిన సందర్భాలున్నాయ్. ఆ బొద్దుతనమే తాను రాణించలేకపోవడానికి కారణమని షాలినీ పాండే చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
Also Read: ఆమెతో అది నిజమేగానీ.! రాజ్ తరుణ్ ‘నొక్కుడు’.!
తెలుగులో ‘118’, ‘ఇద్దరి లోకం ఒకటే’ తదితర సినిమాల్లో షాలిని పాండే (Shalini Pandey) నటించిన సంగతి తెలిసిందే.
