సిగ్గు లేదా? క్యాన్సర్‌తో పబ్లిసిటీ స్టంట్స్ చేస్తావా.?
Shefali Slams Poonam Pandey.. నటి, మోడల్ పూనమ్ పాండే, తాను క్యాన్సర్‌తో చనిపోయినట్లు స్వయంగా పబ్లిసిటీ స్టంట్ చేసిన సంగతి తెలిసిందే.
కేవలం క్యాన్సర్ పట్ల అవగాహన పెంచే క్రమంలో, తనవంతుగా ఈ డేరింగ్ స్టెప్‌ని ఎంతో నిజాయిగా తీసకున్నట్లు పూనమ్ పాండే చెప్పుకొచ్చింది.
‘నా దగ్గరకు ముగ్గురు పేషెంట్స్ వచ్చారు. సర్వైకల్ క్యాన్సర్ ఎలా వస్తుంది.? అని అడిగారు. తగిన వైద్య పరీక్షలూ చేయించుకున్నారు’ అంటూ ఓ వైద్యురాలు సోషల్ మీడియాలో పూనమ్ పాండే పబ్లిసిటీ స్టంట్‌పై స్పందించారు.
‘నేను పూనమ్ పాండే చేసిన పనిని సమర్థించను. కానీ, ఆ ప్రయత్నం వల్ల కొందరిలో అయినా అవగాహన పెరిగింది’ అన్నది సదరు వైద్యురాలి అభిప్రాయం.
Shefali Slams Poonam Pandey.. భయపెట్టి చంపేస్తావా.?
కాగా, మరో సినీ నటి, మోడల్ షెఫాలి జరీవాలా అయితే, పూనమ్ పాండే చేసిన పబ్లిసిటీ స్టంట్ విషయంలో ఇంకోలా స్పందించింది.
‘నా తండ్రి క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. పూనమ్ పాండే క్యాన్సర్‌తో చనిపోయిందన్న వార్తతో మా కుటుంబానికి కంటి మీద కునుకు లేకుండా పోయింది..’ అని వాపోయింది షెఫాలీ జరీవాలా.
క్యాన్సర్‌పై అవగాహనకు ఇలాంటి చీప్ పబ్లిసిటీ స్టంట్స్ ఎంచుకోవడం అస్సలేమాత్రం సమర్థనీయం కాదని షెఫాలీ జరీవాలా వ్యాఖ్యానించింది.
క్యాన్సర్‌ని జయించిన సెలబ్రిటీలు..
బాలీవుడ్ నటి సోనాలి బింద్రే అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ బారిన పడింది. కానీ, ఆమె కోలుకుంది. ఇప్పుడు తిరిగి సాధారణ జీవితం గడుపుతోందామె.
టాలీవుడ్ నటి హంసా నందిని (Hamsa Nandini) తెలుసు కదా.? ఆమె కూడా క్యాన్సర్ బారిన పడింది. కోలుకుంది. తిరిగి సినిమాల్లో నటిస్తోంది.
మరో సౌత్ బ్యూటీ మమతా మోహన్ దాస్ ఏనాడూ క్యాన్సర్ పేరుతో పబ్లిసిటీ స్టంట్స్ చేయలేదు. క్యాన్సర్‌తో పోరాడింది. పూర్తిగా కోలుకుంది కూడా. క్యాన్సర్ పట్ల ఎన్నో అవగాహనా కార్యక్రమాలూ చేపట్టింది.
Also Read: yeSBee యెట‘కారమ్’.! అర్జునా ఏటి నీకీ ఖర్మ.?
పూనమ్ పాండే అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్.! ఆమె చనిపోయిందన్న వార్తని నిజానికి చాలామంది నమ్మలేదు. పబ్లిసిటీ స్టంట్ చేసిందనే అనుకున్నారు.
మీడియా సహజంగానే చేసే అతి, ఇంత వివాదానికి కారణమయ్యింది. తప్పే అయినా, పూనమ్ పాండే పబ్లిసిటీ స్టంట్ నేపథ్యంలో సర్వైకల్ క్యాన్సర్ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది కదా.!