లక్షద్వీప్‌కి ఆ ‘స్థాయి, సత్తా’ వున్నాయా.?
Shenaz Treasurywala Lakshadweep.. మాల్దీవులకు వెళ్ళాలనుకున్న చాలామంది భారత సెలబ్రిటీలు, తమ పర్యటనల్ని రద్దు చేసుకున్నారు.!
బాలీవుడ్ నటీ నటులు చాలామంది ఇప్పటికే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కన్ఫామ్ చేసేశారు కూడా.!
తమ కొత్త డెస్టినేషన్ లక్షద్వీప్.. అంటూ ఆయా సెలబ్రిటీలు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. లక్షద్వీప్‌లో అసలేముంది.? అంటూ నెటిజనం తెగ వెతికేస్తున్నారు కూడా.!
Shenaz Treasurywala Lakshadweep.. లక్ష ద్వీపాలు..
అత్యంత సుందరమైన సముద్ర తీర ప్రాంతం లక్ష్యద్వీప్ సొంతం. లక్ష ద్వీపాల సముదాయం గనుకనే, లక్షద్వీప్ అనే పేరొచ్చిందంటారు.
అయితే, అక్కడ ఇప్పుడు చాలా తక్కువ సంఖ్యలో దీవులు మాత్రమే వున్నాయి. అందులో కొన్ని మాత్రమే నివాసయోగ్యంగా వున్నాయని పర్యాటక రంగ ప్రముఖులు చెబుతున్నారు.
అగాట్టి ఎయిర్‌పోర్ట్ ప్రస్తుతం లక్షద్వీప్ వెళ్ళే ప్రయాణీకులకు అందుబాటులో వుంది. ఇంకో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించ తలపెట్టింది కేంద్ర ప్రభుత్వం. అదెప్పుడు మొదలవుతుందో, ఎప్పటికి పూర్తయ్యేనో.!
అదే అసలు సమస్య..
అంతా బాగానే వుందిగానీ, వేల సంఖ్యలో.. లక్షల సంఖ్యలో లక్షద్వీప్‌కి పర్యాటకులు వెళితే పరిస్థితి ఏంటి.? అక్కడ తగిన సౌకర్యాలున్నాయా.?
వేస్ట్ మేనేజిమెంట్ అనేది పర్యాటక ప్రాంతాల్లో అత్యంత కీలకం.! తాగు నీరు, వైద్య సౌకర్యాలు.. ఇవన్నీ ఖచ్చితంగా ఉన్నత ప్రమాణాలతో వుండి తీరాల్సిందే.
ఇదే విషయాన్ని సినీ నటి షెహనాజ్ ట్రెజరీవాలా సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించింది. తెలుగులో అక్కినేని నాగార్జున సరసన ఓ సినిమాలో నటించిందీ బ్యూటీ.
ఆమె చెప్పిదీ నిజమే కదా.?
షెహనాజ్ ట్రెజరీవాలా ప్రస్తుతం ట్రావెల్ బ్లాగర్‌గా మారింది. ప్రపంచంలోని వివిధ పర్యాటక ప్రాంతాల్ని సందర్శించి, సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది.
అవును.. షెహజాన్ చెప్పిందీ నిజమే.! మాల్దీవుల మీద మంటతో, మన సెలబ్రిటీలంతా లక్షద్వీప్ మీద మోజు ప్రదర్శిస్తున్నారు.
Also Read: ఎందుకొచ్చిన ఎగ్జిట్ పోల్.? ఎవర్ని ఏమార్చడానికి.?
మరి, కేంద్ర ప్రభుత్వం లక్షద్వీప్‌ని ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తుందా.? లేనిపక్షంలో ప్రపంచం దృష్టిలో పరువు పోతుంది.!