Sreenanda Shankar Gallbladder Surgery.. గాల్ బ్లాడర్ అనేది శరీరంలో ఓ కీలకమైన భాగం.! పిత్తాశయం అంటాం దీన్ని.! ఇదేమీ ప్రాధాన్యత లేనిది కాదు.! ప్రాధాన్యమైనదే.!
కాకపోతే, గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది కొందరిలో తీవ్ర సమస్యగా మారుతుంటుంది. స్టోన్స్ తొలగించే క్రమంలో గాల్ బ్లాడర్‌ని తొలగించేయాల్సి వస్తుంటుంది.
పరిస్థితి తీవ్రతను బట్టి ఏం చేయాలన్నది వైద్య నిపుణులు నిర్ధారిస్తారు. ఈలోగా, ఆ సమస్యకి ఈ పరిష్కారమంటూ.. ఏవేవో చేసేసి, తీవ్ర అనారోగ్య సమస్యల్ని కొనితెచ్చుకోకూడదు ఎవరైనా.!
Sreenanda Shankar Gallbladder Surgery.. బై బై చెప్పడమేంటి.?
కాలు పోతే, ‘బై.. బై.. కాలు’ అని అనగలమా.? మరి, గాల్ బ్లాడర్‌ని తొలగిస్తే.. ‘బై.. బై..’ అని చెప్పడమేంటి.? పైగా, సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేయడమేంటి.?

ఔను, ఇదో రకం వేలం వెర్రి. ఫొటోలో కనిపిస్తున్నదీ శ్రీనంద శంకర్. డాన్సర్, మ్యూజీషియన్, నటి కూడా.!
ఈమెకు ఇటీవలే గాల్ బ్లాడర్ తొలగించారట. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, పై ఫొటోల్ని పోస్ట్ చేసింది.
కాదేదీ పబ్లిసిటీకి అనర్హం..
ఔను, కాదేదీ పబ్లిసిటీకి అనర్హం.! అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే, వచ్చే పబ్లిసిటీ వేరే లెవల్.!
సెలబ్రిటీలకు ఇదో పిచ్చి.! నిజమే.. నిజంగానే ఇదో పెద్ద పిచ్చి.! అభిమానులతో అన్ని విషయాలూ పంచుకోవడం సెలబ్రిటీలకు ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా అలవాటైపోయింది.

అన్ని విషయాల్లోనూ ఈ ‘షేరింగ్’ అనేది సమర్థనీయం కాదు.! గాల్ బ్లాడర్ తొలగింపుని ఫ్యాషన్ వ్యవహారంగా కొందరు అభిమానులు భావించే ప్రమాదం లేకపోలేదు.
గాల్ బ్లాడర్ స్టోన్స్ రావడానికి కారణాలేంటి.? నివారణ మార్గాలున్నాయా.? స్టోన్స్ వచ్చాక ఏం చేయాలి.? వంటి విషయాలపై వైద్యులను అడిగి పూర్తి సమాచారం తెలుసుకోవాల్సి వుంటుంది.
Also Read: పగలు వద్దే వద్దు.!? పడక మీదే ఎందుకు ముద్దు.!?
అంతే తప్ప, ఇలాంటి ‘బై బై స్లోగన్స్’ మీరూ చేయాలనుకుంటే, ప్రాణాల మీదకు రావొచ్చు.. మీ అతి.! జర జాగ్రత్త.!
ఆరోగ్యమే మహాభాగ్యం.!