Stambheshwar Mahadev Temple Gujarat.. ‘మిస్సింగ్’ శివాలయం

 Stambheshwar Mahadev Temple Gujarat..  ‘మిస్సింగ్’ శివాలయం

Stambheshwar Mahadev Temple Gujarat

Stambheshwar Mahadev Temple Gujarat.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘అంజి’ సినిమాలో ఓ దేవాలయం కొంత సమయం పాటు మాత్రమే కనిపించి క్లైమాక్స్‌లో మాయమైపోతుంది. అవును ఇలాంటివి సినిమా గ్రాఫిక్స్‌లోనే చూస్తుంటాం.

కానీ, నిజంగా ఇలాంటి మాయమైపోవడాలు, తిరిగి ప్రత్యక్షమవ్వడాలు నిజ జీవితంలోనూ జరుగుతాయా.? ఛాన్సే లేదు అంటారా.? ఛాన్సుంది. అది తెలియాలంటే మీకీ ‘మిస్సింగ్’ దేవాలయం గురించి తెలియాల్సిందే. .

మన దేశంలో ఎన్నో శివాలయాలున్నాయి. ఒక్కో శివాలయానికి ఒక్కో ప్రత్యేకత. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే శివాలయం కథ చాలా విచిత్రమైనది.

ఈ ఆలయాన్ని దర్శించుకోవడం అంత సులభమేమీ కాదు. ఎందుకంటే, మనం దర్శించుకోవాలనుకున్నప్పుడు, ఆ ఆలయ దర్శనం జరగదు కాబట్టి.

ఎప్పుడు కనిపిస్తుందో, ఎప్పుడు అదృశ్యమవుతుందో ఎవ్వరికీ తెలియదు. అలా కనిపించి ఇలా మాయమైపోయే ఆ శివాలయం ప్రత్యేకత ఏంటో, ఆ అద్భుతమైన వింత శివాలయం ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Stambheshwar Mahadev Temple Gujarat.. మిస్సింగ్ టెంపుల్: రోజులో రెండు సార్లు మాత్రమే

రోజులో రెండు సార్లు మాత్రమే ఈ టెంపుల్ మనకి కనిపిస్తుంది. మిగిలిన సమయమంతా మాయమైపోతుంది. అవును మీరు విన్నది నిజమే. కేవలం రోజులో రెండు సార్లు మాత్రమే ఈ దేవాలయం కంటికి కనిపిస్తుంది.

మిగిలిన సమయమంతా, దేవాలయ శిఖరంతో సహా పూర్తిగా మాయమైపోతుంది. అదెలా అంటారా.? సముద్రంలో మునిగిపోతుంది.

అరె.. భలే విచిత్రంగా ఉందే, ఎక్కడుంది ఈ ఆలయం అనుకుంటున్నారా.? పదండి ఆ మిస్సింగ్ టెంపుల్ మిస్టరీ తెలుసుకుందాం.

గుజరాత్ రాష్ర్టంలోని వడోదరలో కవికంబోయ్ అనే చిన్న గ్రామంలో ఉన్న దేవాలయమే ఈ స్థంభేశ్వర్ టెంపుల్. దాదాపు 200 ఏళ్ల నాటి చరిత్ర ఉన్న పురాతన ఆలయమిది.

సముద్రం మధ్యలో ఈ ఆలయాన్ని 200 ఏళ్ల కిందట కనుగొన్నారు. రోజులో రెండు సార్లు మాత్రమే ఈ ఆలయం పైకి కనిపిస్తుంది.

మిగిలిన సమయమంతా పూర్తిగా సముద్రంలో మునిగిపోతుంది. పరమ శివుడు లింగ రూపంలో కొలువై ఉన్న ఆలయమిది.

దర్శనం ఎలా జరుగుతుంది.?

ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే, ఒక రోజంతా కేటాయించాల్సిందేనట. ఆలయ నిర్వాహకులు ఓ ప్రత్యేక రసీదును టికెట్టుగా ఇస్తారట. ఆ రసీదుపై ఆలయం పైకి తేలే సమయాలను ఇంచు మించుగా రాసిస్తారట.

ఆయా సమయాల్లో భక్తులు పరమ శివుడిని దర్శించుకోవాలట. ఎక్కువగా సూర్యోదయం వేళ అలల తాకిడి కాస్త తక్కువగా ఉండడం వల్ల ఉదయపు వేళల్లోనే ఈ ఆలయం కనిపిస్తుందట.

మిగిలిన సమయమంతా మాయమైపోతుందట. మధ్యలో కొన్ని సార్లు ప్రత్యక్షమయ్యే అవకాశం కూడా ఉంటుందని చెబుతారు.

Stambheshwar Mahadev Temple Gujarat
Stambheshwar Mahadev Temple Gujarat

ఆ విచిత్రమైన దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు ఎంతో ఓర్పుగా రోజంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారట.

Stambheshwar Mahadev Temple Gujarat.. స్థల పురాణం విషయానికి వస్తే,

తారకాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం కఠోర తపస్సు చేస్తాడట. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా, అమరత్వాన్ని తనకు వరంగా ప్రసాదించమని అడుగుతాడట.

అయితే, అది సాధ్యం కాదని శివుడు మరో అవకాశమిస్తాడట. అయితే ఈ సారి తన మరణం కేవలం ఆరు రోజుల ఆయువున్న శివ పుత్రుడి చేతులోనే జరగాలి అని వరం కోరుకుంటాడట.

Also Read: Maha Shivaratri.. శివరాత్రికి ‘జాగరణ’ ఎందుకు.. ఎలా చేయాలి.?

అందుకు సరే అంటాడు శివుడు. అలా వరం పొందిన తారకాసురుడు ఆ తర్వాత ముల్లోకాలను అష్ట కష్టాల పాలు చేస్తుంటాడట.

అది తట్టుకోలేని దేవతలు శివున్ని ప్రార్ధించగా, కార్తికేయుని జననం జరుగుతుంది. ఆరు రోజుల ఆయువున్న కార్తికేయుడి ద్వారా తారకాసురుడి మరణం సంభవిస్తుంది.

అయితే, తారకాసురుడు తన తండ్రి శివుడికి పరమ భక్తుడని తెలుసుకున్న కార్తికేయుడు, తీవ్రమైన బాధకు లోనవుతాడట.

ఆ బాధ నుండి విముక్తి కల్పించే ఉపాయం చెప్పమని మహా విష్ణువును అడగ్గా, సముద్రం మధ్యలో లింగ ప్రతిష్ట చేసి, ప్రత్యేక పూజలు చేయమని సూచించాడట.

అలా సముద్రం మధ్యలో కార్తికేయుడు ప్రతిష్టించిన శివ లింగంగా ఈ లింగాన్ని ఆరాధిస్తున్నారట. కొంచెం రిస్కే అయినా, ఈ ఆలయ విశిష్టత తెలిసిన భక్తులు తప్పకుండా ఈ ఆలయాన్నిఒక్కసారైనా దర్శించుకోవాలనుకుంటారు.

దగ్గరకు వెళ్లి దర్శనం చేసుకోలేకపోయినా, దూరం నుండే ఈ ఆలయ మిస్టరీని కళ్లతో చూసి వింత అనుభూతిని పొందాలనుకుంటారు.

Digiqole Ad

Related post