స్టైలిష్‌గా ‘అల..’.. అదరగొట్టేస్తోందిలా.!

187 0

మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు, గురూజీ.. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ (Trivikram Srinivas) సినిమాల్లో ఏదో మ్యాజిక్‌ వుంటుంది. ఆ మ్యాజిక్‌ని ప్రతి సినిమాలోనూ (Ala Vaikunthapurramuloo Allu Arjun) ఎంజాయ్‌ చేస్తుంటాం.

సక్సెస్‌, ఫెయిల్యూర్‌కి అతీతంగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ని ఇష్టపడే అభిమానులు చాలామందే వుంటారు. ఆ ‘మ్యాజిక్‌’ని ఇష్టపడని హీరో (Ala Vaikunthapurramuloo Allu Arjun) వుండడు.. ఆ మ్యాజిక్‌ కోసం ఎదురుచూడని ప్రేక్షకుడూ వుండడు.

అలాంటి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, ముచ్చటగా మూడోసారి ఓ హీరోతో సినిమా చేస్తున్నాడంటే, ఆ సినిమాపై అంచనాలు ఇంకో లెవల్‌లో వుండడం సహజమే. అదీ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తో (Stylish Star Allu Arjun) అయితే ఆ కిక్కే వేరప్పా.

టైటిల్‌ దగ్గర్నుంచి ట్రైలర్‌ వరకూ.. అన్నిట్లోనూ త్రివిక్రమ్‌ మార్క్‌ మ్యాజిక్‌, అల్లు అర్జున్‌ మార్క్‌ స్టైలిష్‌ అప్రోచ్‌ కన్పిస్తూనే వున్నాయి.

ఒక్కో పాటా వస్తూనే, యూ ట్యూబ్‌ని ఓ కుదుపు కుదిపేసింది. మిలియన్ల కొద్దీ వ్యూస్‌ వచ్చిపడ్డాయంటే ఈ సినిమాకి తమన్‌ (SS Thaman) అందించిన మ్యూజిక్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

‘సామజవరగమన’ (Samajavaragamana), ‘రాములో రాములా’ (Ramulo Ramula), ‘ఓమైగాడ్‌డాడీ’ (OMG Daddy), ‘బుట్టబొమ్మ’ (Buttabomma).. ఇలా దేనికదే ప్రత్యేకం.

లిరికల్‌ సాంగ్స్‌ ఓ రేంజ్‌లో హల్‌చల్‌ చేస్తే, సాంగ్‌ ప్రోమోస్‌ నెక్స్‌ట్‌ లెవల్‌.. అనేలా అదరగొట్టేస్తున్నాయి.

ఇంతకీ, సినిమా సంక్రాంతి బరిలోకి దిగుతోంది కదా.. ఎలాంటి సంచలనాల్ని (Ala Vaikunthapurramuloo Allu Arjun) సృష్టించబోతోందట.? అంటే, ఆ స్థాయి వేరేలా వుంటుందని ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ అంటున్నాయి.

అల్లు అర్జున్‌ (Stylish Star Allu Arjun) హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో అతనికి జోడీగా పూజా హెగ్దే (Pooja Hegde) నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది రెండో సినిమా. గతంలో ఈ ఇద్దరూ కలిసి ‘డిజె దువ్వాడ జగన్నాథమ్‌’ సినిమా కోసం కలిసి పనిచేసిన విషయం విదితమే.

మరోపక్క, ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo Review) సినిమాలో టబు, సుశాంత్‌, జయరామ్‌ తదితరులు ఇతర ప్రధాన తారాగణం.

అన్నట్టు, ‘చిత్రలహరి’ ఫేం నివేదా పేతురాజ్‌ (Nivetha Pethuraj) ఈ సినిమాకి గ్లామర్‌ పరంగా అదనపు బోనస్‌. ఆమెది ఈ సినిమాలో మరో కీలకమైన పాత్ర.

తమన్‌ మ్యూజిక్‌, గీతా ఆర్ట్స్‌తోపాటు హారిక హాసిని సంస్థ నిర్మాణపు విలువలు.. వెరసి ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikuntapuramlo) సినిమాని ఇంకో లెవల్‌లో కూర్చోబెట్టాయి.

ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikuntapurramulo Review) అల్లు అర్జున్‌ని 100 కోట్ల క్లబ్‌లోకి చేర్చుతుందా.? వేచి చూడాల్సిందే.

Related Post

Happy Birthday Mahesh Babu

మహేష్‌.. రియల్ సూపర్‌ స్టార్‌.. ‘సరిలేరు నీకెవ్వరూ’

Posted by - August 8, 2019 0
తెలుగు తెర పైకి ‘రాజకుమారుడు’ లానే ఎంట్రీ ఇచ్చాడు మహేష్ బాబు చాలాకాలం క్రితం. అవును సూపర్‌ స్టార్‌ కృష్ణ తనయుడు మహేష్‌ (Happy Birthday Mahesh…
Meeku Maathrame Cheptha

విజయ్‌ దేవరకొండ ‘అది’ చెప్పేశాడుగానీ.!

Posted by - August 28, 2019 0
హీరోగా ఓ పక్క తిరుగులేని స్టార్‌డమ్‌ని ఎంజాయ్‌ చేస్తూనే, ఇంకోపక్క సినిమా నిర్మాణంలోకి దిగాడు రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ. తాను దాచుకున్న డబ్బులన్నిటినీ సినిమా నిర్మాణంలో…

‘సరిలేరు నీకెవ్వరు’ ఫస్ట్‌ టాక్‌ ‘దద్దరిల్లిపోయింది’

Posted by - January 11, 2020 0
సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తాజా సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ ఫస్ట్‌ టాక్‌ (Sarileru Neekevvaru Review FDFS) ‘దద్దరిల్లిపోయింది’. అవును, అందరి నోటా ఒకటే మాట.. సినిమా…

Trailer Review: Lakshmi’s NTR

Posted by - February 14, 2019 0
Trailer of Lakshmi’s NTR released (Trailer Review Lakshmi’s NTR) today and the occasion Valentine’s day is some thing co-incidental. Director…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *